Sydney hostage crisis 3 people have come out of cafe and one telugu person is there in terrorist hostage

An armed offender is holding an "undisclosed number" of hostages, Lindt cafe in central Sydney, Hostages were earlier seen pressing a black flag ,Sydney siege

A gunman took an unknown number of hostages inside a popular cafe, The Australian police have confirmed that five people have come out using the side entrance.

ఆస్ట్రేలియాలో ఉగ్రవాదుల చెరలో తెలుగువాడు...

Posted: 12/15/2014 04:14 PM IST
Sydney hostage crisis 3 people have come out of cafe and one telugu person is there in terrorist hostage

ఆస్ట్రేలియాలోని సిడ్నిలో ఉగ్రవాది చెరలో ఒక తెలుగు వాడు కూడా ఉన్నట్లు సమాచారం.. గుంటూరు జిల్లాకు చెందిన విశ్వకాంత్ అంకిరెడ్డి ఇన్ఫోసిస్ లో పని చేస్తున్నారు. ఆయనది పిగురాల్ల మన్దమ్ గంగిరెడ్డి పల్లి. బిట్స్ పిలాని లో చదివిన విశ్వకాంత్ ఇన్ఫోసిస్ లో చేరి బదిలీపై ఆస్ట్రేలియా వెళ్ళినట్లు తెలుస్తుంది. ఉగ్రవాది చెరలో ఉన్న ఆ కేఫ్ లో ఇతను కూడా ఉన్నట్లు తెలుస్తుంది.

ముందు జాగ్రత్తగా సిడ్నీ లోని భారత రాయభార కార్యాలయాన్ని, అమెరికా రాయభార కార్యాలయాన్ని పోలీసులు మూసివేశారు. మార్టిన్ ప్లేసులో ఉన్న ప్రలందరినీ ఖాళి చేపించారు. ఉగ్రవాది ప్రజలను నిర్భందించిన మార్టిన్ ప్లేస్ లోని కేఫ్ నుండి ఐదుగురు బందీలు చెర నుండి తప్పించుకొని బయట పడినట్లు సమాచారం. ఉగ్రవాది చెరలో ఇంకా ౩౦ మంది వరకు ఉన్నట్లు తెలుస్తుంది. లోపల ఉన్నవారికి ఎలాంటి హాని జరగలేదని, అందరిని సురక్షితంగా విడుదల చేయించే ప్రయత్నాలు జరుగుతున్నాయని పోలీసులు తెలిపారు.

ఆయుధం కలిగిన వ్యక్తి పలువురిని బందీలుగా తీసుకున్న సంఘటన తనను దిగ్బ్రాంత పరిచ్న్హిందని ఆస్ట్రేలియా ప్రధాని టోనీ అబ్బాట్ తెలిపారు. శాంతియుతంగా ఉండే ఆస్ట్రేలియా ని ఇలాంటి సంఘటనలు ఏమి చేయలేవని, ప్రజలను ఆందోళనకు గురి కావద్దని ఆయన సూచించారు. భద్రతాధికారులు బందీలను కాపాడే ప్రయత్నాల్లో ఉన్నారని చెప్పారు.

హరి

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Other Articles