Indian american man in michigan sentenced to 64 months in prison

Indian American fraud, Sachin Uppal, Indian American Sachin Uppal fraud case, Sachin Uppal sentenced to 64 months, Indian American sentenced, Indian American sentenced in ponzi scheme, Sachin Uppal sentenced in ponzi scheme, US federal court in washington, U.S. District Judge sentenced Uppal, U.S. District Judge Nancy G. Edmunds

An Indian American man in Brighton, Michigan, Sachin Uppal, 37, was sentenced in federal court to 64 months in prison for running a $3.8-million Ponzi scheme.

అగ్రరాజ్యంలో భారత అమెరికన్ కు 64 మాసాల జైలుశిక్ష

Posted: 12/15/2014 04:37 PM IST
Indian american man in michigan sentenced to 64 months in prison

అగ్రరాజ్యంలో భారత సంతతికి చెందిన అమెరికన్ కు అక్కడి న్యాయస్థానం 64 మాసాల జైలు శిక్షను విధించింది. అమెరికాలోని మిచిగన్ బ్రైటన్ లో నివసించే భారత అమెరికన్ సచిన్ ఉప్పల్ తనను నమ్మి డబ్చలు పెట్టుబడులుగా పెట్టినవారికి శఠగోపం పెట్టినట్లు పిర్యాదులు వెల్లువెత్తాయి. అతని కుటుంబ సభ్యులు, మిత్రులు, పరిచయస్తులకు అధిక మొత్తంలో డబ్బును చెల్లిస్తానని చెప్పి వారి నుంచి డబ్బులను సేకరించి చివరకు డబ్బులు చెల్లించక పోవడంతో వారు అతనిపై కేసు పెట్టారు.

అగ్రరాజ్యంలో అన్ లైన్ ట్రేడింగ్ చేసేందుకు అనుమతి లేకున్నప్పటికీ.. తనకు చెందిన జెప్పర్ సన్ స్మిత్ ట్రేడింగ్ కంపెనీ ఎల్ఎల్ సీ ద్వారా ట్రేడింగ్ కార్యకలాపాలు సాగించేవాడు. సంస్థ ఆద్వర్యంలో అనుమతి లేకుండా అక్రమంగా సాగించిన ట్రేడింగ్ ను పిరామిడ్ లేదా పాన్జీగా పేర్కొంటారు. తనకు తెలిసిన వారు స్నేహితులు, బంధువులను నమ్మించి వారి వద్ద పెద్ద మొత్తంలో డబ్బులు వసూలు చేశాడు. అసలు అలానే వున్నప్పటికీ ఏడాదికి 18 నుంచి 20 శాతం డబ్బును అదనంగా పోందవచ్చునని నమ్మబలికాడు. ఇలా తన సంస్థను అడ్డుపెట్టుకుని జులై 2007 నుంచి సెప్టెంబర్ 2013 వరకు తన అక్రమాలు సాగించాడు. ఇలా సేకరించిన అసలు మొత్తం సుమారుగా 3.8 మిలియన్ డాలర్ల రూపాయలకు చేరింది.

పెట్టుబడిదారుల పెట్టుబడులు సవ్యంగా సాగుతున్నాయని అవి మరింత పెరిగే అవకాశాలు వున్నయాని సచిన్ ఉప్పల్ నకిలీ మెయిల్స్, అకౌంట్స్ తో మభ్యపెట్టాడు. తీరా తమకు అసలు మొత్తం కావాలని అడిగిన వారికి ఏదో విషయం చెప్పి తప్పించుకునేవాడు. ఇలా కొన్నాళ్లు పాటు ఎదురుచూసిన పెట్టుబడి దారులు ఇక తమ డబ్బులు రాకపోవడంతో అక్కడి న్యాయస్థానాన్ని ఆశ్రయించారు. సచిన్ ఉప్పల్ అక్రమాలపై విచారణ జరిపిన న్యాయస్థానం పెట్టుబడిదారుల నుంచి వసూలు చేసిన 38 లక్షల 67 వేల 187 రూపాయలను వారికి తిరిగి చెల్లించాలని వాషింగ్టన్ డిసీ లోని న్యాయస్థానం అదేశించింది. కేవలం తన కుటుంబానికి సంబంధించిన ఒక ప్రాంత, ఒక మతం వారిని మోసగించినందుకు గాను 64 మాసాల కారాగారశిక్షను విధిస్తూ న్యాయస్థానం తీర్పును వెలువరించడంతో సచిన్ ఉప్పల్ కటకటాలు లెక్కబెడుతున్నాడు.

జి.మనోహర్

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : Indian American  Michigan  sentence  $3.8 million Ponzi scheme  Sachin Uppal  

Other Articles