Women gand raped and sold away to prostitutes

Sexual Harassment & Misconduct on woman, crime against woman, voilence against women, gang rape and sold off, maharastra migrant woman, truck driver and his associotes, two year old strangulated to death, police investigation, accused arrested, Haryana rawari district

A 25-year-old migrant woman was allegedly gangraped and sold to a man for Rs 40,000 while her two-year-old child was strangulated to death,

మహిళపై మగమృగాళ్ల గ్యాంగ్ రేప్.. కొడుకు బలి..

Posted: 12/14/2014 08:44 PM IST
Women gand raped and sold away to prostitutes

హర్యానాలోని రేవరి జిల్లాలో దారుణం జరిగింది. మహారాష్ట్రకు చెందిన 25 ఏళ్ల మహిళపై ఐదుగురు కామాంధులు సామూహిక అత్యాచారానికి తెగబడ్డారు. అంతేకాదు.. ఆమెను అమ్మకానికి పెట్టిన ఘటన కలకలం సృష్టించింది. బాధితురాలు పట్టణ ప్రాంతంలో పని కోసం వెతుకుతూ.. కొద్దిరోజుల క్రితం ఓ రైల్వే స్టేషన్‌లో ముఖేష్ అనే ట్రక్ డ్రైవర్‌ను కలిసింది. తనకు చాలా మంది పరియస్తులున్నారని వారితో చెప్పి ఏదో ఓ పనిలో పెడతానని నమ్మబలికిన అగంతకుడు ఆమెను తన గ్రామమైన ఖిజురీకి తీసుకెళ్లాడు. ఇంటికి తీసుకువెళ్లిన తరువాత మరుసటి రోజున అనగా, డిసెంబర్ 10న తన వికృత రూపాన్ని చూపించాడు ముఖేష్. అతనితో పాటు అతని సోదరుడు, అనుచరులతో కలిసి బాధితురాలిపై సామూహిక అత్యాచారానికి పాల్పడ్డారు.

తన తల్లిపై కామాందులు విరుచుకుపడుతుంటే.. ఏమి చేయాలో తెలియక అమాయకంగా ఏడుస్తున్న బాధితురాలి రెండేళ్ల పసికందును అతి దారుణంగా ముఖేష్ సహా అందరు నిందితులు కలసి పీకనొక్కి చంపేశారు. పని కోసం వస్తే.. తన కుమారుడిని పోగొట్టుకున్నాని పుట్టెడు దు:ఖంలో వున్న మహిళను వదిలేయకుండా.. తమ అకృత్యాలు బయటపడకుండా వుండేందుకు అమెను అమ్మకానికి పెట్టారు. సూరజ్ భాన్ సైనీ వ్యక్తి సహాయంతో ఆమెను సందీప్ అనే వ్యక్తికి రూ. 40 వేలకు అమ్మేశారు. ఈ నరకకూపం నుంచి బయటపడి తనపై అత్యాచారం చేసి తన కుమారుడిని చంపిన నిందితులకు శిక్ష పడాలని నేరుగా పోలీసులను ఆశ్రయించింది భాదితురాలు. ఈ దారుణానికి ఒడిగట్టిన ముఖేష్ ను అతని సోదరుడు సతీష్, అతని ఇద్దరు అనుచరులు జైపాల్, హవాసింగ్ లను పోలీసులు అదుపులోకి తీసుకుని దర్యాప్తు చేపట్టారు.
 
జి మనోహర్

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : Crime  Rape  Murder  Police & Security Forces  Women  

Other Articles