Fourth phase voting ends in jammu kashmir and jarkhand

jammu kashmir assembly elections, jammu kashmir 4th phase assembly elections, jammu kashmir elections 2014, Jk assembly elections 2014, 50 % polling in 4th phase, 61.65% in jarkhand 4th phase, jarkhand assenbly elections, jarkhand elections 2014, jarkhand assembly elections, jarkhand elections 4th phase, chilling atmosphere in Jk

last and the fifth phase voting remains in jammu kashmir and jarkhand, to be held on 20th december, counting on 23 december

20న తుది దశ, 23న కౌంటింగ్.. ప్రశాంతంగా నాల్గవ విడత

Posted: 12/14/2014 07:52 PM IST
Fourth phase voting ends in jammu kashmir and jarkhand

జమ్మూ కశ్మీర్, జార్ఖండ్ అసెంబ్లీలకు జరుగుతున్న నాలుగో విడత పోలింగ్ ప్రశాంతంగా ముగిసింది. జమ్మూకాశ్మీర్ లో 49 శాతం, జార్ఖండ్ లో 61.65 శాతం పోలింగ్ నమోదైనట్లు ఎన్నికల సంఘం అధికారులు తెలిపారు. ఈ దశలో జమ్మూకాశ్మీర్ లో 182 మంది అభ్యర్థులు, జార్ఖండ్ లో 217 మంది అభ్యర్థులు ఎన్నికల బరిలో నిలిచి వారి అదృష్టాన్ని పరీక్షించుకుంటున్నారు. రెండు రాష్ట్రాల్లో చెదురుమదురు ఘటనలు మినహా పోలింగ్ ప్రశాంతంగా ముగిసింది. జమ్మూకాశ్మీర్ లో వేర్పాటు వాదులు ఎన్నికల బహిష్కరణకు ఇచ్చిన పిలుపును, హెచ్చరికలను అక్కడి ఓటర్లు లక్ష్యపెట్టలేదు. యముకలు కోరికే చలిని కూడా లెక్క చేయకుండా ఓటర్లు పోలింగ్ కేంద్రాల వద్ద బారులు తీరారు.

ఉదయం కొంత మందకొడిగానే ప్రారంభమైనా.. ఆ తరువాత ఓటుహక్కు వినియోగించుకునేందుక భారీ సంఖ్యలోనే ఓటర్లు పోలింగ్ కేంద్రాలకు తరలివచ్చారు. నాల్గవ దశలో 18 అసెంబ్లీ నియోజకవర్గాలకు ఎన్నికలు జరిగాయి. ఈ రోజు జరిగిన ఎన్నికల్లో జమ్మూ కశ్మీర్ ముఖ్యమంత్రి ఒమర్ అబ్దుల్లా, మాజీ ముఖ్యమంత్రి ముఫ్తీ మహ్మద్ సయ్యద్ ఇతర ప్రముఖులు బరిలో ఉన్నారు. అయితే ఈ నెల 20న తుది విడత ఎన్నికలు పూర్తి కానున్నాయి. అనంతరం  ఈ నెల 23న కౌంటింగ్ ప్రక్రియ జరగనుంది.

జి మనోహర్

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : assembly elections  4th phase  jammu and kashmir  jarkhand  

Other Articles