Serious offender escaped to foreign from jail

police caught taking bribe, police took bribe and left offender, serious offender out of jail, serious offender escaped foreign, police left serious offender

serious offender escaped to foreign from jail as he bribed jailers and police

జైలు నుంచి విదేశాలకు పారిపోయిన దోంగ.. దోరికిన పోలీసు

Posted: 12/14/2014 05:44 PM IST
Serious offender escaped to foreign from jail

ధనమేరా అన్నింటికీ మూలం.. అని సినీ కవులు రాసిన పాటను అలభించాడో లేక పెద్దలు చెప్పినట్టు ధనం మూలం మిదమ్ జగత్ అని తెలుసుకున్నాడో.. తెలియదు కానీ.. తనను వదిలిపెడితే భారీగా డబ్బు ఇస్తానని ఆశ చూపించడంతో పోలీసులు ఓ హంతకుడిని వదిలిపెట్టారు. యావజ్జీవ కారాగార శిక్ష పడిన నేరస్తుడు. పోలీసులకు డబ్బును లంచంగా ఇచ్చి ఎంచక్కా జైలునుంచి తప్పించుకున్నారు. తప్పించుకోవడమే కాదు… ఏకంగా భార్యతో సహా విదేశాలకు చెక్కేశాడు.వినడానికే విచిత్రంగా వున్న ఈ కేసు పూర్వాపరాలు ఇలా వున్నాయి

తమిళనాడు కడలూరుకు చెందిన తవమణి అనే వ్యక్తీ.. తమిళనాడులో ఒక హత్య కేసులో… మరియు పూణేలో మరో హత్యకేసులో నిందితుడిగా ఉన్నాడు. అంతేకాకుండా.. ఇతగాడిపై గ్రూప్ 2 ప్రశ్నాపత్రాల లీకేజీ కేసుకూడా ఉన్నది. ఈ కేసులో ఇతను కడలూరు జిల్లా జైలులో యావజ్జీవ కారాగార శిక్ష అనుభవిస్తున్నాడు. అయితే… తవమణి కడలూరు జైలులో ఉండగా తప్పించుకోవడానికి ప్రయత్నించాడు. దీంతో అతడ్ని కడలూరు నుంచి తిరుచ్చి సెంట్రల్ జైలుకు మార్చారు.

అయితే… గత నెల 24న ఇతడిని కేసు విచారణ నిమిత్తం పూణే కోర్టుకు హాజరు పరిచేందుకు రైలులో తీసుకొని వెళ్తుండగా.. తప్పించుకున్నాడు. దీంతో పోలీసులు అప్రమత్తమై… అతని కోసం గాలింపు చర్యలు మొదలు పెట్టారు. అయితే.. ఈ గాలింపులో పోలీసులు కొందరు రౌడీలను అరెస్ట్ చేసి.. విచారించగా… ఆసక్తి కరమైన విషయాలు బయటపడ్డాయి. తవమణి తప్పించుకోలేదని… పోలీసులు 40లక్షల రూపాయల లంచం తీసుకొని… తవమణిని తప్పించారని వెల్లడించారు. ఇక తవమణి తన భార్యతో కలిసి విదేశాలకు వేల్లిపోయినట్టు వారు పోలీసులకు తెలియజేశారు.

జి, మనోహర్

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : Tamilnadu kadalooru jail  Tavamani  escape  foreign  bribe  

Other Articles