Husband surrenders wife to her boy friend in tamilnadu

husband surrenders wife, husband makes his wife's marriage, husband makes his wife's marriage with lover, wife and her lover marriage, Tamilnadu, Turaiyuru Perumal temple

this is a real life dramatic story where her husband surrenders his wife to her boy friend and gets marriage in tamilnadu

తమిళనాడులో నిజ జీవిత కన్యాదానం..

Posted: 12/14/2014 05:53 PM IST
Husband surrenders wife to her boy friend in tamilnadu

ఇది నిజ జీవిత కన్యాధానం. అదేంటి కన్యాధానం నిజజీవితంలోనే అమ్మాయి తల్లిదండ్రులు చేస్తారు కదా..? మరి దీనికి బిన్నంగా జరిగిన కన్యాదానం ఏంటనుకుంటున్నారా..? స్వర్గీయ దర్శకుడు ఇవివి సత్యానారాయణ ముందుగా ఊహించి 1998 లోనే అంటే సుమారుగా పదహారేళ్ల క్రితమే తీసిన ఓ సినిమా పేరు కూడా కన్యాధానమే. అయితే ఇక్కడ కూడా సినిమాలో చూపించినట్టే జరిగంది. సుమారు పదహారు సంవత్సరాల తరువాత సరిగ్గా అలానే జరగడం విచిత్రంగా వుంది. అదేంటో తెలుసుకోవాలనుందా..?

వివాహం చేసుకున్న భార్యను కన్యాదానంగా ప్రియునికి ఇచ్చి భర్త వివాహం జరిపించాడు. తిరుచ్చి జిల్లా, తురైయూరు సమీపం ఉప్పిలియాపురం వద్ద ఓ గ్రామానికి చెందిన దేవి, తురైయూర్ యూనియన్‌లోని మరో గ్రామానికి చెందిన నందకుమార్ (26)కు పెళ్లి చేయూలని పెద్దలు నిశ్చరుుంచారు. 20 రోజుల క్రితం నిశ్చితార్థం జరిగింది. గత బుధవారం వరుడి ఇంట్లో వీరిద్దరి వివాహం కూడా అట్టహాసంగా సాగింది. పెళ్లి పెద్దలు, బందుమిత్రులు అందరి సమక్షంలో మూడు ముళ్లు వేశాడు వరుడు.

వరుని ఇంటికి వచ్చిన తర్వాత మొదటి రాత్రి  దేవి... నందకుమార్ కాళ్లపైపడి భోరున విలపించింది. నందకుమార్ ఏమి జరిగిందని ఆమెను ప్రశ్నించాడు. నవ వధువు మాట్లాడుతూ తన ఊరికి చెందిన లారీ డ్రైవర్‌ను ప్రేమిస్తున్నానని, తల్లిదండ్రులు బలవంతంగా ఈ వివాహం జరిపించారని తెలిపింది. తనను అతనితో కలపాలని ప్రాథేయపడింది. నందకుమార్ తన భార్యను ప్రియుని చెంతకు చేర్చేందుకు నిర్ణయించాడు. ఆపై వేరే ప్రాంతానికి వెళ్లిన ప్రియున్ని రప్పించి దేవితో తురైయూరు పెరుమాల్ ఆలయంలో వివాహం జరిపించాడు.

జి. మనోహర్

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : husband surrenders wife  boy friend  Tamil nadu  

Other Articles