West bengal chief minister mamata banerjee challenges prime minister modi

Madan Mitra Arrest, Mamata Banerjee, Modi, Mamata challenges Modi, CBI Arrest, Sarada chit fund scam

4th person is inCBI Net over Sarada chit fund scam in West Bengal - arrest of minister Madan Mitra

‘దీదీ’ సవాల్: దమ్ముంటే నన్ను అరెస్టు చేయండి

Posted: 12/13/2014 03:40 AM IST
West bengal chief minister mamata banerjee challenges prime minister modi

పశ్చిమబెంగాల్ ముఖ్యమంత్రి,తృణమూల్ కాంగ్రెస్ అదినేత్రి మమత బెనర్జీకి ఎదురు దెబ్బ తగిలింది. శారదా చిట్‌ఫండ్ కుంభకోణం వ్యవహారం స్కామ్‌లో ప్రమేయం ఆరోపణలపై ఇప్పటికే ఇద్దరు తృణమూల్ కాంగ్రెస్ ఎంపీలను అరెస్టు చేసిన సీబీఐ శుక్రవారం మమత నమ్మినబంటు, బెంగాల్ రవాణా మంత్రి మదన్ మిత్రాను శుక్రవారం కోల్‌కతాలో అరెస్టు చేసింది. గత కొంతకాలంగా మమత బెనర్జీకి, కేంద్ర ప్రభుత్వానికి మధ్య ఈ విషయమై పెద్ద వివాదం నడుస్తోంది. సిబిఐని కేంద్రం దుర్వినియోగం చేస్తోందని ఆమె ఆరోపించారు. ఇప్పటికే ఆమె పార్టీకి చెందిన ఒక ఎమ్.పి అరెస్టు కాగా,తాజాగా మంత్రి కూడా అరెస్టు కావడం సంచలనమే. ఇది ఆమె ప్రభుత్వానికి తీవ్రమైన మచ్చగానే పరిగణించాలి.మదన్ మిత్ర రవాణ శాఖ మంత్రిగా ఉన్నారు

''దేశంలో ఇందిరాగాంధీ హయాం నాటి ఎమర్జెన్సీ రోజులకన్నా ప్రస్తుత బీజేపీ పాలన అధ్వానంగా సాగుతోంది. మోదీ ప్రభుత్వం పిరికిపందలా, నియంతలా ప్రవర్తిస్తూ ప్రమాదకర ఆట ఆడుతోంది. కేంద్రంతో కొత్త యుద్ధం మొదలైంది. మీ (కేంద్రం) సవాల్‌ను స్వీకరిస్తున్నాం.'' అని మమత పేర్కొన్నారు. ప్రధాని మోదీ, బీజేపీ చీఫ్ అమిత్ షాలకు దమ్ముంటే వారి వద్ద ఉన్న పోలీసు మార్బలాన్నంతా ఉపయోగించి తనను అరెస్టు చేయాలని సవాల్ విసిరారు. సీబీఐని పావుగా వాడుకుంటూ బీజేపీ అధికార దుర్వినియోగానికి పాల్పడుతోందని ఆరోపించారు.

దేశ లౌకిక, ప్రజాస్వామిక, గణతంత్ర వ్యవస్థను కేంద్రం నాశనం చేస్తోందని దుయ్యబట్టారు. ''ఈ కేసులో మిత్రాను సాక్షిగా పిలిచిన సీబీఐ కొన్ని గంటల వ్యవధిలోనే ఆయన్ను అరెస్టు చేయడం రాజకీయ కక్ష సాధింపు కాదా?'' అని మమత కోల్‌కతాలో విలేకరులతో మాట్లాడుతూ ప్రశ్నించారు. రాష్ట్ర ప్రభుత్వానికి లేదా అసెంబ్లీ స్పీకర్‌కు సమాచారం ఇవ్వకుండానే ఒక మంత్రిని (మిత్రా) సీబీఐ అరెస్టు చేయడం చట్టవ్యతిరేకం, రాజ్యాంగ విరుద్ధమన్నారు. బీజేపీ నిజస్వరూపాన్ని బయటపెడతామని...అఖిల భారత స్థాయిలో ఆ పార్టీతో పోరాడతామన్నారు. సీబీఐ అరెస్టు చేసి, అభియోగాలు మోపిన ఒక వ్యక్తి (అమిత్ షాను ఉద్దేశించి) తమ పార్టీపై వేలెత్తి చూపుతున్నారని చురకలంటించారు.

శారదా స్కాంలో తృణమూల్ పాత్ర రోజురోజుకూ బలపడుతున్న నేపథ్యంలో నైతిక బాధ్యత వహిస్తూ మమత సీఎం పదవికి రాజీనామా చేయాలని బెంగాల్ విపక్షాలు డిమాండ్ చేశాయి.

Mamata minister madanMitra Arrest

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : Mamata Banerjee  Modi  Madan Mitra  Sarada Scam  

Other Articles