Ramoji film city is an artistic monument says kcr

kcr visits ramoji film city, KCR Meets Media Tycoon At RFC, Watch video of Telangana Chief Minister K.Chandrashekar Rao Visits Ramoji Film City, ramoji fim city, ramoji rao, kcr visits historical place, kcr visits ramoji place, Telangana chief minister KCR always shown swords towards Ramoji Filmcity, kcr went to ramoji film city, Ramoji Rao is said to be invited the Chief Minister to visit his RFC.

For the first-time after sworn in as the CM of Telangana, KCR visited the Ramoji Film City.

రామోజీ రమ్మన్నాడు... కెసిఆర్ "సై" అన్నాడు...!!

Posted: 12/13/2014 11:04 AM IST
Ramoji film city is an artistic monument says kcr

అంత్యంత బిజీ బిజీ గా గడిపే కెసిఆర్ ఒక ఐదు గంటలు ఒకే దగ్గర సమయం కేటాయించారు. మల్లి అది ఏ రాజకీయ పరమైన సమావేశమో కాదు.., పుణ్యక్షేత్రమో అంత కన్నా కాదు. ఎప్పుడెప్పుడు తాను విరుచుకుపడదామా అని ఎదురుచూసే "ఇంకో" ప్రాంత ప్రముఖుడికి చెందిన స్థలమది. అదే రాజధాని శివారులోని రామోజీ ఫిలింసిటీని ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్‌రావు "ఆకస్మికంగా" సందర్శించారు. ఆర్థిక మంత్రి ఈటెల రాజేందర్, ఈ మధ్యే తెరాసలో చేరిన తుమ్మల నాగేశ్వరరావు కలిసి ఆయన ఫిలింసిటీకి వెళ్లారు. ఒక్క గంట సేపు గడిపొస్తానని వెళ్లి అన్ని కార్యక్రమాలను రద్దు చేసుకొని ఏకంగా ఇదు గంటల పాటు అక్కడే గడిపారు. బర్డ్ పార్క్‌ను, సీతాకోక చిలుక వన ప్రదేశాన్ని మరియు ఇతర ప్రదేశాలను తిలకించి అబ్బురపడటమూ జరిగింది. ఫిలింసిటీ అధినేత రామోజీరావుతో కలసి కేసీఆర్ మధ్యాహ్న భోజనం చేశారు కూడా.

ఆ సమయంలో రామోజీ, కెసిఆర్ చాల సేపు ముచ్చటించుకున్నారు., హైదరాబాద్ గురించి..,రాజకీయాల గురించి కూడా చర్చించుకున్నట్టు సమాచారం. కేంద్రంతో స్నేహపూర్వక వైఖరితో వెళితే బాగుంటుందని, తెలంగాణకు, హైదరాబాద్‌కు మంచి భవిష్యత్తు ఉందని ఈ సందర్భంగా కేసీఆర్‌కు రామోజీ చెప్పినట్లు సమాచారం. హైదరాబాద్‌కు మరిన్ని పెట్టుబడులు వస్తాయని కెసిఆర్ తో పేర్కొన్నట్టు తెలుస్తుంది. తాను తదుపరి చేపట్టబోయే ‘ఓం’ ప్రాజెక్టు గురించి కూడా ముఖ్యమంత్రికి రామోజీరావు వివరించినట్లు సమాచారం. ఇంకా ఇతర విషయాలు మాట్లాడుకున్నట్లు తెలుస్తుంది. అదే సమయం లో అక్కడే ఈనాడు ఎండి కిరణ్ అక్కడే ఉన్నట్లు సమాచారం.   

ఈ సందర్శన అనంతరం కెసిఆర్ ఒక టి.వి ఛానల్ తో మాట్లాడుతూ ఒక గంట గడుపుదామని వస్తే ఐదు గంటలు గడిపేలా చేసిన అద్భుతమైన కళా ఖండము ఇదనీ, ఇది ఫిలిం సిటీ కంటే కూడా ఎక్కువగా పర్యాటకులు చూడదగ్గ ప్రదేశంమని, పిల్లలకు పెద్దలకు కూడా ఉపయోగపడే ప్రదేశమని కితాబిచ్చేశారు కూడా..!! రామోజీ ఫిలిం సిటీ హైదరాబాద్ గర్వించదగ్గ ప్రదేశమని వ్యాఖ్యానించారు...

ఈ సందర్శన పట్ల ప్రజల్లో చాల ఆసక్తికర చర్చ నడుస్తుంది. ఏది ఏమైనా అప్పుడు ఆ క్షణం అక్కడ ఆశ్చర్య పోవాల్సింది సందర్శనలో పాల్గొన్న రాజకీయ నాయకులూ కాదు, ఆ సమయంలో అక్కడ ఉన్న అధికారులు కూడా కాదు...., అక్కడ ఆ క్షణం అవాక్కయింది తెలంగాణాలోని ఒక 'ప్రముఖ జిల్లా' వాసులనీ ఆ జిల్లా వాసులు గొణుక్కుంటున్నారు. ప్రతి పక్షంలోని కొన్ని వర్గాలు కూడా ఈ సందర్శన పట్ల గుసగుసలాడుకుంటున్నాయి.. "అప్పుడు" ఉద్యమ సమయంలో ఈ ఉద్యమ నేత ప్రముఖ జిల్లా వరంగల్ సభ లో ప్రసంగిస్తూ "తెలంగాణా రైతుల నుండి లాక్కొని పీక్కుతింటున్న ఆంధ్ర బడా బాబులు ఆక్రమించిన భూములను మేము ఆక్రమిస్తం. ఆంధ్ర వాళ్ళ మీద తను కక్ష పట్టట్లేదని, తన కక్ష అంతా బ్రతుకు తెరువు కోసమని వచ్చి 'వందలు వేల ఎకరాలు' దోచుకొని మరీ మనపైనే పెత్తనం చేస్తున్న ఆంధ్ర వాళ్ళ దోపిడీ పైనే తన పోరాటం అని.., "వేల ఎకరాలు" ఆక్రమించి కట్టిన రామోజీ ఫిలిం సిటీని "లక్ష నాగళ్ళు" పెట్టి మరీ దున్నిస్తానని ఉద్యమ ఊపులో ఉపన్యిసించారు. "ఇప్పుడు" 'అదే కెసిఆర్ నా' మనం చూస్తున్నదని కొన్ని వర్గాలు అనుకుంటున్నట్లు తెలుస్తుంది.

అసలు ఈ పర్యటన ముఖ్యోద్దేశం ఏంటో తెరాస నేతలకు కూడా అంతు పట్టడం లేదు. 'ఆ' అంటే 'ఆంధ్ర నేతలపై' అదరగొట్టే మాటలతో ఆగ్రహించే తమ ఆరాధ్య నేత పర్యటన వెనుక ఆంతర్యమేమిటన్నది తేల్చుకోలేకపోతున్నారు. అసలు అక్కడికి వెళ్లి మరి ఆరా తీయాల్సిన అవసరం ఏంటో అర్థం కావట్లేదని కార్యకర్తలు అనుకుంటున్నారు. ఏది ఏమైనా కెసిఆర్ ఎం చేసిన దానికి అర్థం ఉంటుందని పార్టీ అధికార వర్గాలు అనధికారికంగా గొంతు చించుకొని చెప్తున్నాయి. ఈ పర్యటను తాము ఎం అనుకున్నా, ఎవరేమనుకున్నా ప్రాణాలకు తెగించి మరి రాష్ట్రాన్ని సాధించుకున్న తెలంగాణ ప్రజలు దీన్ని ఏ విధంగా తీసుకుంటారో చూడాలి మరని మనసులో మదనపడుతున్నారంట....!!

హరి

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : ramoji film city  cmo telangana  k chandra shekar rao  telangana  ramoji rao  etela rajendar.  

Other Articles