Want to lose weight eat all your food in an eight hour time frame and never snack at night

Want to lose weight, Eat all your food in an eight-hour time frame and NEVER snack at night

Want to lose weight, Eat all your food in an eight-hour time frame and NEVER snack at night

ఎలాంటి శ్రమ లేకుండా స్లిమ్ గా వుండాలంటే..

Posted: 12/04/2014 04:02 PM IST
Want to lose weight eat all your food in an eight hour time frame and never snack at night

లావుగా వున్నారా, ఒబెసిటీ(అధిక లావు)తో ఇబ్బందులు పడుతున్నారా..? లావుగా వుండటం వల్ల డయాబిటీస్ వ్యాధి వచ్చిందా..? బరువు తగ్గాలనుకుంటున్నారా..? అధిక లావుతో బాధపడుతున్న వాళ్లు అనేక మంది.. జిమ్ లకు వెళ్లి ఎక్సైజ్ చేస్తుంటారు. మరికొందరు ఎవేవో మందులు వాడుతుంటారు. ఇంకొందరు లైపోసెక్షన్ చేయించుకుంటారు. అయినా బరువు తగ్గుతున్నారా..? అని అడిగితే.. ఇంకెంత శ్రమపడాలో అంటుంటారు. కానీ అయితే కేవలం ఈ చిన్న సూత్రం పాటిస్తే అధిక బరువు తగ్గుతారని తెలుసా..? వేల కోద్ది డబ్బులు ఖర్చు చేసి లావు తగ్గాలన్న ఆశ నేరవేరని వారు ఒక్కసారి దీనిని ప్రయత్నించి చూడండి.. రిజల్ట్స్ గ్యారంటీ అంటున్నారు శాస్త్రవేత్తలు

ఉదయం మీరు టిఫిన్ చేయడం మొదలు పెట్టిన దగ్గర నుంచి సాయంత్రం, అనేక మంది రాత్రులు, అర్థరాత్రులు కూడా భుజిస్తుంటారు. ఇలా చేయడం వల్ల సహజంగా మన శరీరంలో చోటుచేసుకోవాల్సిన జీవక్రియ ప్రతిచర్యలు అంతగా జరవని కాలిఫోర్నియా లోని సాల్క్ ఇస్టిట్యూట్ శాస్త్రవేత్తలు చెబుతున్నారు. ఉదయం పలహారం తీసుకున్న సయయం నుంచి కేవలం ఎనమిది గంటలలోనే మీరు ఏం తినాలనుకున్నా అది తీనేసి ఎనమిది గంటలు దాటిన తరువాత ఏమీ తినకుండా వుంటే మీరు సన్నబడటం గ్యారంటీ అని చెబుతున్నారు. అయితే అది కూడా క్రమం తప్పకుండా ప్రతీ రోజు ఒకే సమయానికి తినడం వల్ల శరీరంలో కాలరీలు నిల్వ వుండకుండా ఖర్చు అవుతందని చెబుతున్నారు. దీని వల్ల ఊబకాయం తగ్గిపోవడంతో పాటు రెడు రకాల మదుమేహ వ్యాధుల ప్రమాదం తగ్గుతుందని చెప్పారు.

ఈ క్రమాన్ని పాటిస్తున్నప్పుడు మీరు తీసుకునే ఆహారం కోవ్వుతో కూడుకుందా..? లేక తీపి పదార్థమా అని కూడా అలోచించాల్సిన అవసరం లేదు. ఏలాంటి ఆహారం తీసుకున్నా హాని చేయదంటున్నారు శాస్త్రవేత్తలు. అయితే మన తీసుకునే అహారం అర్థవంతమైనదిగా వుంటే క్యాలరీలను తొందరగా ఖర్చు అవుతుంది. ఎనిమిది గంటల్లో బోజనం కార్యక్రమానికి స్వస్తి పలకడం వల్ల జీవ పక్రియ సక్రమంగా జరిగడంతో పాటు.. మన శరీరం కూడా బోజన సమయాలకే అలవాటు పడుతుందంటున్నారు.

మంచి పుష్టికరమైన కొవ్వు అధికంగా వున్న ఆహారాన్ని ఎలుకలకు పెట్టి పరీక్షించారు. ఉదయం తొమ్మిది గంటల నుంచి సాయంత్రం ఐదు గంటల వరకే వాటిని అహారాన్ని అందించినా.. అవి ఆరోగ్యకరంగా వున్నాయని, నాజుకుగా వున్నాయని అధ్యయనం చేసిన శాస్త్రవేత్తలు చెబుతున్నారు. ఈ ఎనమిది గంటల్లోనే అవి సాదరణంగా రోజు మొత్తానికి తీసుకునే అహారాన్ని ఇచ్చినా అవి ఆరోగ్యంగా వున్నాయి. ఇక కొన్ని లావుగా వున్న ఎలుకలకు తొమ్మిది గంటలకు వాటి ఆహరాన్ని కుదించారు. దీంతో అవి సగటున నెలకు 5 శాతం బరువు తగ్గాయని వైద్యులు తెలిపారు.

శరీరం రోజువారి బోజణ సమయాన్ని అంచనా వేయడానికి ఇది దోహదపడుతుందని, దీని వల్ల శరీరం తన ఆహారాన్ని సిద్దం చేసకునేందుకు, జీర్ణ వ్యవస్థ సమకాలీకరించడానికి ఉపయుక్తమవుతుందని చెప్పారు. చిన్న, పెద్ద పెగులలోని వున్న బ్యాక్టీరియా సంతులనం ప్రభావితం చేయడానికి, జీవక్రియను నియంత్రించడానికి దోహదపడుతుందట. మన ఆరోగ్యానికి ఎది మంచిదని తీసుకుంటామో అదే విధంగా మనం ఏం తింటున్నామన్నది కూడా ప్రాధాన్యమివ్వాలని అంటున్నారు అద్యయనకర్త ఫ్రోఫెసర్ సత్చిన్ పాండా. మంచి పోషకాలతో కూడిన ఆహారాన్ని తీసుకోవాలని, అదే అరోగ్యకరమని చెబుతున్నారు. అయితే అడపా దడపా ఉపవాసదీక్షలు వుండటం కూడా ఆరోగ్యానికి మంచిదేనంటున్నారు.

జి. మనోహర్

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Other Articles