Maharastra cabinet expansion is scheduled on tomarrow

Maharashtra, shiv sean, Devendra Fadnavis, BJP, 12 minister post, 5 cabinet rank, old friends, shake hands, maharastra news, national news, politics, political news, congress patry, NCP

Shiv sena joins to join Bjp government in maharastra, cabinet expansion is scheduled tomarrow

రేపు మహారాష్ట్ర మంత్రివర్గ విస్తరణ.. జతకట్టనున్న శివసేన

Posted: 12/04/2014 04:29 PM IST
Maharastra cabinet expansion is scheduled on tomarrow

ఎట్టకేలకు మహారాష్ట్రలో పాతికేళ్ల మైత్రి బంధం మళ్లీ చిగురించింది. కొన్ని నెలల పాటు ఎవరి దారి వారేదే అనుకుని వైరి వర్గాలుగా మారిన ఇద్దరు మిత్రులు ఒక్కటయ్యేందుకు చేతులు కలపుతున్నారు. అధికార పక్షానికి చెందిన భారతీయ జనతా పార్టీ, ప్రధాన ప్రతిపక్షంగా మహారాష్ట్రలో కోనసాగుతున్న శివసేనల మద్య స్నేహం చిగురించింది. మహారాష్ట్రలో తొలిసారి అధికారాన్ని చేపట్టిన బీజేపి ప్రభుత్వంలో చేరేందుకు గత రెండు నెలలుగా ఆశగా ఎదురుచూసిన శివసేన పార్టీ.. ఎట్టకేలకు అధికారంలో చేరేందుకు సమయం ఆసన్నమైంది. ఈ మేరకు రెండు పార్టీల మధ్య సాగిన చర్చలు సఫలమయ్యాయి.

అధికార బీజేపికి అండగా నిలిచేందుకు శివసేన డిమాండ్ చేసిన 12 మంత్రి పదవులను ఇచ్చేందుకు ముఖ్యమంత్రి దేవేంద్ర ఫెడ్నవిస్ సుముఖత వ్యక్తం చేశారు. శివసేనకు 12 మంత్రి పదవులను కేటాయిస్తున్నట్లు అయన అధికారికంగా వెల్లడించారు. అయితే వాటిలో 5 మాత్రమే క్యాబినెట్ ర్యాంకు పదవులని, మిగిలినవి సహాయ మంత్రి పదవులని చెప్పారు. ఈ నెల 5న శుక్రవారం శివసేన తమ ప్రభుత్వంలో అధికారికంగా చేరుతుందని వెల్లడించారు.

అంతేకాదు.. అదే రోజున మహారాష్ట్ర క్యాబినెట్ విస్తరణ కూడా జరుగుతుందని తెలిపారు. రాష్ట్ర గవర్నర్ విద్యాసాగర్ రావు.. శివసేనకు చెందిన 12 మంది మంత్రులు చేత గవర్నర్ కార్యాలయంలో ప్రమాణ స్వీకారం చేయిస్తారని చెప్పారు. అయితే ఎవరెవరకి ఏ ఏ పదవులను కేటాయించేది వారి ప్రమాణస్వీకారం పూర్తైన తరువాతే నిర్ణయించినట్లు మహారాష్ట్ర ముఖ్యమంత్రి దేవేంద్ర పెడ్నవిస్ చెప్పారు. అయితే తమకు కేటాయించే శాఖల విషయంలో శివసేన గుర్రుగా వున్నట్లు సమాచారం.

జి. మనోహర్

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Other Articles