Raunchy video results in turkish airlines air hostess fired

Raunchy Video, Turkish Airlines, Air Hostess, racy photographs, model, Italian magazine shoot, Zuhal Sengal, standards, qualities conservative, religious, social media., lipstick, ideology.

Raunchy Video Results In Turkish Airlines Air Hostess Fired

అలా మోడలింగ్ చేస్తే.. ఎయిర్ హాస్టస్ ఉద్యోగం పోయింది..

Posted: 12/04/2014 02:55 PM IST
Raunchy video results in turkish airlines air hostess fired

అతిగా అవేశపడే అడది, ఆశపడే మగవాడు బాగుపడినట్లు చరిత్రలో లేదు అన్ని సూపర్ స్టార్ రజనీకాంత్ డైలాగ్ అక్షారాల నిజమైంది. అతిగా అవేశపడి మోడలింగ్ చేసి ఫోటోలకు ఫోజులిచ్చిన ఓ ఎయిర్ హాస్టస్ ఉద్యోగం ఊడిపోయింది. ఫోటోలతో పాటు వీడియో కూడా చూసిన అధికారులు అమెను తక్షణం ఉద్యోగంలో నుంచి తొలగించాలని అదేశాలు జారీ చేశారు. ఏంటీ అంతమాత్రానికే అనుకుంటున్నారా..? అవును. ఒంటిపై కేవలం రెండు నూలుపోగులను వేసుకుని మోడలింగ్ చేస్తే ఎవరు మాత్రం భరిస్తారు. తమ సంస్థకు చెడుపేరు మూటగట్టవద్దని వినయంగా పంపించక ఏం చేస్తారు.

అదీనూ ఆ ఫోటోలు ఒక ప్రముఖ మ్యాగజైన్ లో కనిపించిన తరువాత వారు అమెను ఉద్యోగం నుంచి తొలగించారు. విమానంలో ఎయిర్ హాస్టస్ గా ఉద్యోగం చేస్తున్న సయమంలో ఎవరో ఒకరు అమెతో అసభ్యంగా ప్రవర్తించడానికి కూడా అస్కారముంది. అందుకు అమె అవకాశాన్ని కల్పించింది. అందుకనే ముందుజాగ్రత్త చర్యగా అమెను ఉద్యోగం నుంచి తొలగించారు అక్కడి అధికారులు. ఇంతకీ ఇందుకు సంబంధించిన పూర్తి వివరాలు ఇలా వున్నాయి.

జుహల్ సెన్గల్ 31, ఈమె టర్కిష్ ఎయిర్ లైన్స్ లో ఎయిర్ హాస్టస్ గా విధులు నిర్వహిస్తూ, పార్ట్ టైమ్ లో మోడలింగ్ చేస్తోంది. ఈ విషయం తెలసి కూడా కంపెనీ వర్గాలు సరేలే అనుకున్నారు. అయితే అమె అందాన్ని కీర్తించిన ఓ ప్రముఖ ఇటాలియన్ మ్యాగజీన్ అమెతో అసభ్యకరంగా, అశ్లీలంగా, అదీనూ కేవలం రెండు నూలు పోగులతో మాడలింగ్ చేయించారు. ఎలాంటి అభ్యంతరం లేకుండా జుహల్ సెన్గల్ అందుకు సై అనింది. ఫోటోలే కాదు.. వీడియో కూడా చిత్రీకరించారు. అందుకూ సమ్మతించింది. ఇంకే ముంది.. వెనువెంటనే ఆ ఫోటోలు మ్యాగజీన్ ముఖచిత్రంపై ప్రచురించబడ్డాయి.

ఎయిర్ హాస్టస్ నిర్థిష్టమైన ప్రమాణికాలు పాటించడంలో అన్ని చర్యలు తీసుకునూ టర్కిష్ ఎయిర్ లైన్స్ గత ఏడాది.. ఎరుపు, పింక్, క్లారెట్ రంగుల లిప్ స్టిక్ లను నిషేధించింది. ఈ ఘటన తెలిసి కూడా ఎయిర్ హాస్టస్ జుహల్ సెన్గల్ ఇలా మోడలింగ్ చేసి ఫోటోలకు ఫోజులివ్వడంపై ఎయిర్ లన్స్ యాజమాన్యం తీవ్రంగా స్పందించింది. ఎయిర్ హాస్టస్ జుహాల్. నిర్థిష్టమైన ప్రమాణాలు, లక్షణాలను గాలికి వదిలేసి ఇలా మోడలింగ్ చేయడంపై తీవ్రంగా అక్షేపించింది. జుహల్ చర్యతో దేశ సంప్రదాయక విలువల్ని వదిలేసిందని మండిపడింది. అసలే మతపరంగా అనేక కట్టుబాట్లను పాటించే దేశంలో ఇలా చేయడం ఎంతవరకు సమంజసమని యాజమాన్యం ప్రశ్నించింది.

టర్కిష్ ఎయిర్ లైన్స్ అధికార ప్రతినిధి మాట్లాడుతూ.. తమ ఉద్యోగులు ప్రమాణాలు, లక్షణాలను పాటించాలని ఇప్పటికే తాము సూచించామని, కానీ మోడలింగ్ చేయడం తాము అంగీకరించమని చెప్పారు. అందుకనే జుహల్ సెన్గల్ ను విధుల్లోంచి తొలగించామన్నారు. అయితే ఎయిర్ లైన్ యాజమాన్యం పూర్తిగా మతచందాసవాదంగా మారుతుందన్న అరోఫణలు వెల్లువెత్తడంతో..యాజమాన్యం దిగిరాక తప్పలేదు. మోడల్ కు మద్దతుగా ఎయిర్ లైన్స్ ఉద్యోగ సంఘం కూడా అండగా నిలిచింది.

జి. మనోహర్

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Other Articles