Living with tigers family share home with pets

Brazil, brazilian family, exotic pets, new extremes, Borges brood, Seven Tigers. Aryas Borges, circus, Nayara, Uyara, Deusanira, female Tarzan, Maringa. incredible bond

Living With Tigers, Family Share Home With Pets

పులులతో సావాసం.. సహ జీవనం..

Posted: 12/05/2014 01:00 AM IST
Living with tigers family share home with pets

పూర్వం మహర్షులు, మునులు దట్టమైన అడవుల మధ్య ఆశ్రమాలు ఏర్పాటు చేసుకుని పచ్చని ప్రకృతి మధ్య నివాసం వుంటే వారు. అదే సమయంలో అడవిలో సంచరించే క్రూర మృగాలు అడవిలో ఎంత అటవికంగా వ్యవహరించినా.. ఆశ్రమాల వద్దకు మాత్రం వచ్చేవి కావు. ఒక వేళ వచ్చినా.. అవి పెద్ద శిష్యుడిలా మర్యాదగా నడుచుకునేవే తప్ప.. ఎవరినీ హానిపర్చేవి కావు. మునులు, మహర్షులు వాటిని ప్రేమతో దగ్గరకు తీసుకునే వారు కూడా. ఇదంతా మనం పురాణాల్లో చదవివాం. అయినా మనస్సులో సందేహం.. నిజంగా క్రూరమృగాలు ఆశ్రమాల వద్దకు వచ్చినా.. ఎవరినీ గాయపర్చకుండా తిరిగి వెళ్లేవా..? అదెలా అనుకుంటున్నారా..?

కానీ అది నిజం.. తమ దివ్యజ్ఞానంతో మూగాజీవాలను శాసిస్తే... ఇక్కడ ఓ కటుంబం చూడండీ.. ఎలాంటి దివ్యజ్ఞానం లేకుండానే.. క్రూర జంతువులతో ఎలా సావాసం చేస్తున్నారు. అవి పెద్దపులులే అయినా.. వారింట్లో అవి శునకాలు, పిల్లులతో సమానం. ఎందుకంటారా అవి వారితో అలానే నడచుకుంటాయి కాబట్టి. బ్రెజిల్ లోని మారింగా పట్టణంలో బార్జెస్ వారసులు నిజంగా పులలతో తమ ఇంటిని పంచుకుంటున్నారు. నమ్మశక్యం కావడం లేదా..? ఏదో పులి పిల్ల అనుకుంటున్నారా..? లేదండి ఏకంగా ఏడు పులులు వారి ఇంట్లో కాపురం వుంటున్నాయి. వారితో పాటు సహజీవనం సాగిస్తున్నాయి. పులులే తమ ముగ్గరు అమ్మాయిలకు కపాలా కస్తున్నాయని చెబుతున్నారు ఇంటి యజమాని ఆర్యాస్ బోర్జెస్.

ఒక రోజు తాను వస్తుండగా, సర్కస్ లో కడు దీన స్థిలో వున్న రెండు పులులను చూశాడు. అంతే వాటిని ఖరీదు చేసి తన ఇంటికి తెచ్చుకున్నాడు. వాటిని ప్రతీ రోజు అలనాపాలన చూశాడు. ఇక తమలో ఒకరిగా కలుపుకున్నాడు. తన ముగ్గురు కూతుళ్లు డిసానిరా 24, యారా 23, నయరా 20లు పులులతో కలసి పెరిగారని, వాటితో పాటు కంచం, మంచం పంచుకోవడంతో పాటు వాటితోనే నిత్యం ఆటలాడుతూ గడుపుతారని కూడా చెప్పారు. తన చిన్న కూతరు నయర లేడీ టార్జన్ తరహాలో పులులతో కలసి స్విమ్మింగ్ పూల్ లో ప్రతి రోజు ఈత కొడుతుందని చెప్పారు.

ఆ తరువాత ఆ రెండు పులులకు మరో ఐదు పులి పిల్లలు పుట్టాయని, అవి కూడా తమతో కలసి వున్నాయని అర్యా బర్జెస్ తెలిపారు. చాలా కాలంగా పులులతో కలసి వుండటంతో పులులకు ఆ ఇంటి మనుషులకు మధ్య ఓ చక్కని అనుబంధం ఏర్పడింది.

జి. మనోహర్

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Other Articles