People guerrilla liberation army maosits threatens kcr telangana government

people guerrilla liberation army maosits, pgla maoists, maoists on telangana government, maoists on kcr, maoists threatens telangana government, kcr latest news updates, telangana government on maoists, telangana latest news updates

people guerrilla liberation army maosits threatens kcr telangana government : in a shocking turn to telangana government a group of maoist wing threatens to get ready for saying end to kcr telangana government in nalgonda district choutuppal posters

తెలంగాణ సర్కారుకు మావోల షాక్... కేసీఆర్ పాలన అంతానికి పిలుపు

Posted: 12/04/2014 10:02 AM IST
People guerrilla liberation army maosits threatens kcr telangana government

తెలంగాణ ప్రభుత్వానికి షాక్ తగిలింది. తమది మావోల సిద్ధాంతమమనీ., మావోల విధానాలనే ప్రభుత్వం అమలు చేస్తుందని ఇన్నాళ్ళు తెలంగాణ సర్కారు చెప్పుకుంటూ వస్తోంది. అలాంటి ప్రభుత్వాన్ని అంతమొందించేందుకు అంతా సిద్ధం కావాలని తాజాగా మావోలే హెచ్చరికలు జారీ చేశారు. కేసీఆర్ పాలన అంతమొందించేందుకు నడుం బిగించాలని పిలుపునిచ్చారు. ఈ హెచ్చరికతో ప్రభుత్వ వర్గాలతో పాటు పోలిసులకు కూడా గుబులు పుట్టుకుంది. తెలంగాణలో మళ్ళీ ఒకప్పటి పరిస్థితులు పునరావృతం అవుతాయా అని ఆందోళనలు వ్యక్తం అవుతున్నాయి.

నల్గొండ జిల్లా చౌటుప్పల్ శివారులోని లింగోజిగూడెం, వలిగొండ క్రాస్ రోడ్ దగ్గర మావోల పేరుతో పోస్టర్లు వెలిశాయి. పీపుల్స్ గెరిల్లా లిబరేషన్ ఆర్మీ (పీజీఎల్ఏ) పేరుతో బయటపడ్డ ఈ పోస్టర్లలో గెరిల్లా దండు వారోత్సవాలను జయప్రదం చేయాలని కోరారు. అంతేకాకుండా తెలంగాణ ప్రభుత్వ పాలనను అంతమొందించేదుకు నడుం బిగించాలని పిలుపునిచ్చారు. కేసీఆర్ పాలన ప్రజా వ్యతిరేకంగా ఉందంటూ ఆగ్రహం వ్యక్తం చేశారు. ఈ పోస్టర్లపై స్థానికుల ద్వారా సమాచారం తెలుసుకున్న పోలిసులు ఉన్నతాధికారులకు విషయం సూచించారు. దీంతో చౌటుప్పల్ పరిసరాల్లో గట్టి నిఘా పెట్టారు.

తెలంగాణలో మావోయిస్టులే లేరు అని స్వయంగా హోంమంత్రి నాయిని నర్సింహ్మారెడ్డి ప్రకటించిన తర్వాతి రోజే ఈ పోస్టర్లు బయటకు వచ్చాయి. తమది మావోల సిద్దాంతమని ముందునుంచి ప్రభుత్వం చెప్పుకుంటూ వస్తున్న నేపథ్యంలో వారే సర్కారుకు వ్యతిరేకంగా బెదిరింపులకు దిగటం గమనార్హం. ఈ పోస్టర్లు చూస్తుంటే విభజనతో తెలంగాణలో మళ్ళీ మావోల సమస్య వస్తుందన్న నాటి ప్రముఖుల మాటలు నిజమన్పిస్తున్నాయి. అటు ఇన్నాళ్లుగా సరిగా భద్రత కూడా లేకుండా గ్రామాల్లో తిరిగిన నేతలు తాజా పోస్టర్లతో బయటకు వెళ్ళాలంటే జంకే పరిస్థితి నెలకొంది.

ఈ పోస్టర్లు మావోయిస్టులు విడుదల చేసినవేనా లేక.. ఆకతాయిలు ప్రభుత్వాన్ని హెచ్చరించేందుకు ఇలా చేశారా అనేది పోలిసుల విచారణలో తేలుతుంది. కానీ ప్రభుత్వ పనితీరుపై ప్రతిపక్షాలు, ప్రజల నుంచి తీవ్ర విమర్శలు వస్తున్న నేపథ్యంలో ఇలాంటి బెదిరింపులు రావటం ఆందోళనకరం. ఈ మద్య మావోల పేరుతో వరసగా ప్రభుత్వానికి వ్యతిరేకంగా లేఖలు వస్తున్నాయి. కొత్త రాష్ర్టంలో అనేక సవాళ్లు, సమస్యలను ఎదుర్కుంటున్న కేసీఆర్ సర్కారు ఈ పోస్టర్లపై ఎలా స్పందించనుందో.


కార్తిక్

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : maoists  telangana  kcr  government  latest news  

Other Articles