Another nirbhaya incident in delhi woman gang raped in a moving car

gang-rape, Crimes against women, violence against women, rape, crimes in Delhi, Marriage, Divorce Anadn vihar, Delhi police, Dr Hedgewar Hospital

Another Nirbhaya incident in Delhi, Woman accuses husband, friends of gang-raping her in car

ఢీల్లీలో మరో నిర్భయఘటన.. కదులుతున్న కారులో రేప్

Posted: 12/03/2014 09:17 PM IST
Another nirbhaya incident in delhi woman gang raped in a moving car

దేశ రాజధాని ఢిల్లీలో మరో నిర్భయ ఘటన జరిగింది. కొత్త చట్టాలు రూపొందించినా.. సత్వర పరిష్కారానికి ప్రత్యేక కోర్టులను తెరిచినా.. పాలకులు మారినా.. అబలలమై మగమృగాళ్ల ఆకృత్యాలు ఆగడం లేదు. సభ్య సమాజాం తలదించుకునేలా ఒక యువతిని దేశ రాజధానిలోని రోడ్లపై తిరుగుతన్న కారులో ముగ్గురు అతిదారుణంగా సామూహిక అత్యచారానికి పాల్పడ్డారు. ముగ్గురు మృగాళ్లు తనపై వరస క్రమంలో అనేక సార్లు సాగించిన అకృత్యానికి అపస్మారక స్థితిలోకి జారుకున్నా.. ఆ రాతి హృదయాలు కనికరించలేదు. అమెపై సామూహికంగా అత్యారానికి పాల్పడిన అనంతరం తూర్పు ఢిల్లీలోని జాతీయ రహదారి పక్కన పడేసి వెళ్లిపోయారు.

బాధితురాలి పిర్యాదు మేరకు కేసు నమోదు చేసిన పోలీసులు ముగ్గురి కోసం గాలింపు చర్యలు చేపట్టారు. అయితే తానెంతో ఇష్టపడి ప్రేమ వివాహం చేసుకున్న తన భర్త.. అతని మరో ఇద్దరు స్నేహితులే తనపై అత్యాచారం చేశారని బాధితురాలు తెలిపింది. తూర్పు ఢిల్లీలోని రామ్ నగర్లో పక్కింట్లో వుండే వ్యక్తి నచ్చడంతో అతడిని ప్రేమించి గతేడాది పెళ్లి చేసుకున్నానని తెలిపింది. పెళ్లి తరువాత నెల రోజుల్లోనే అతని ప్రవర్తన నచ్చకపోవడంతో.. విభేధించిన బాధితురాలు భర్తతో విడిపోయి షాదర ప్రాంతంలోని మరో ఇంటిని అద్దెకు తీసుకుని అక్కడే వుంటున్నానని చెప్పింది. తనకు విడాకులు ఇవ్వాల్సిందిగా కూడా కోర్టులో కేసు వేశానని తెలిపింది.

ఈ క్రమంలో తాను ఆనంద్ విహార్ లోని షాపింగ్ మాల్ కు వెళ్లి తిరిగివస్తుండగా, తన భర్తతో పాటు అతని ఇద్దరు స్నేహితులు తనను బలవంతంగా కారులో ఎక్కించుకుని వివస్త్రను చేసి.. అత్యాచారానికి పాల్పడ్డారని పేర్కొంది. ఢిల్లీ వీధుల్లోనే కారులో తిరుగుతూ అనేక పర్యాయాలు తనపై అత్యాచారం చేశారని తెలిపింది. తనతో పాటు తన కుటుంబంలోని అందరినీ చట్టాల చక్రబంధంలో ఇరికించినందుకే తగు శాస్తి చేశానని తన భర్త అన్నారని తెలిపింది. తన మర్మస్థానంలో క్యాండిల్లను కూడా పెట్టారని భాదితురాలు పేర్కోందని పోలీసులు చెప్పారు. బాధితురాలిని జాతీయ రహదరిపై నిర్జన ప్రాంతంలో వదిలేసి వుండటంతో గమనించి.. ఆస్పత్రిలో చేర్చామని పోలీసులు తెలిపారు.

బాధితురాలని డాక్టర్ హెగ్డేవర్ అస్పత్రిలో చికిత్స నిమిత్తం తరలించామని పోలీసులు తెలిపారు. అయితే తన భర్తపై గజియాబాద్ లోని విజయ విహార్ ప్రాంతంలోని పోలిస్ స్టేషన్లో మరో కేసు నమోదైందని బాధితురాలు తమకు చెప్పిందని పోలీసులు చెప్పారు. ఈ ఏడాది మార్చి మాసంతో తనను కిడ్నాప్, హత్య చేయడానికి యత్నించాడని కేసు నమోదయ్యిందని తెలిపిందన్నారు. ఈ క్రమంలో మరోమారు అమెపై సామూహిక అత్యాచారం జరిగిందని పోలీసులు చెప్పారు. అడవారిని కేవలం అంగడి బోమ్మలుగా చూసే మగవాడి చూపు మరదా..? తన అక్కా, చెల్లికి ఇలాంటి ఘటనలు ఎదురైతే ఎలా స్పందిస్తారో.. ఇతరుల పట్ల అలా ఎందుకు స్పందిచరని మహిళా సంఘాలు ప్రశ్నిస్తున్నాయి.

జి. మనోహర్

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Other Articles