Hyderabad is second best place in world one should see in 2015 says traveller magazine

Hyderabad, falkhnuma palace, birla mandhir, Golconda Fort, purani haveli palace, Chowmahalla Palace, Salar Jung Museum, Hyderabad News, National geographic channel

Hyderabad is second best place in world one should see in 2015 says Traveller Magazine

400 ఏళ్ల హైదరాబాద్ కీర్తి కిరీటంలో మరో కలికితురాయి..

Posted: 11/29/2014 08:29 PM IST
Hyderabad is second best place in world one should see in 2015 says traveller magazine

హైదరాబాద్..!! నాలుగు శతాబ్దాల మహానగరం. ఇప్పుడీ నగర కీర్తికిరీటంలో మరో కలికితురాయి చేరింది. ఇక్కడి వీధులు.. ఒకనాడు రాసులుగా ముత్యాలను పోసి అమ్మిన మండీలు! ప్రపంచంలోనే అత్యంత సంపన్నుడైన రాజు ఇక్కడివాడే! అత్యద్భుతమైన నిర్మాణ కౌశల్యాలు.. అచ్చెరువొందించే విశాల.. విలాసవంతమైన విలాసాల ఇలాకా ఇది! ఇదంతా ఘనమైన గతం! చారిత్రక, సాంస్కృతిక సంపద ఈ భాగ్యనగరం ఆస్తి! అదే ఒకప్పుడు హైదరాబాద్‌ను ప్రపంచస్థాయి నగరంగా నిలిపింది! ఈ ఘనమైన వారసత్వం వెలిసిపోలేదు!

ప్రపంచంలో చూడదగిన అత్యుత్తమ ప్రదేశాల జాబితాలో హైదరాబాద్‌కు రెండోస్థానం లభించింది. తొలిస్థానం అమెరికాలోని శాన్‌ఫ్రాన్సిస్కోలో ఉన్న ప్రెసీడియో పార్కుకు దక్కింది. ''2015లో చూడాల్సిన ప్రపంచంలోని అత్యుత్తమ 20 ప్రదేశాలు'' పేరుతో నేషనల్ జియోగ్రాఫిక్‌కు చెందిన ట్రావెలర్ మ్యాగజీన్ తన వార్షిక సంచికలో ఒక జాబితాను ప్రకటించింది. దీంట్లో శాన్‌ఫ్రాన్సిస్కో, హైదరాబాద్‌తోపాటు స్విట్జర్లాండ్‌లోని జెర్మాట్, వాషింగ్టన్‌లోని నేషనల్‌మాల్, కోర్సికా, పెరూలోని చోక్యూక్విరా, జపాన్‌లోని కొయాసాన్, ఓక్లహామా నగరం, రొమేనియాలోని మారామ్యూర్స్ తదితర ప్రాంతాలున్నాయి.


Simple Picture Slideshow:
Could not find folder /home/teluguwi/public_html/images/slideshows/Hyderabad City

హైదరాబాద్ నగరాన్ని వర్ణిస్తూ.. ''ప్రపంచంలోనే అత్యంత ధనవంతుల్లో ఒకరైన ఉస్మాన్ అలీ ఖాన్ ఈ నగరంలోనే జీవించారు. హైదరాబాద్‌ను పాలించిన చివరి నిజాం ఆయన'' అని పేర్కొన్నారు. హైదరాబాద్‌కు కవితాత్మకమైన చరిత్ర ఉందని గుర్తు చేశారు. ఒకప్పటి రాచనగరమైన హైదరాబాద్ నేడు అనేక అంతర్జాతీయ ఐటీ కంపెనీలకు కేంద్రంగా మారిందని, సుసంపన్నమైన ఫలక్‌నుమా ప్యాలెస్, ఇరానీ కేఫ్‌లు, ఐదోతరం ముత్యాల వర్తకులు, ఇంకా అనేక ఆకర్షణలు హైదరాబాద్ సొంతమని 'ట్రావెలర్'లో తెలిపారు.

జి మనోహర్

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Other Articles