Tamilnadu actress khushbu joins congress party reasons chief ilangovan media press meet

khushboo, tamil actress khushboo news, khushboo congress party, khushboo joins congress party, sonia gandhi, rahul gandhi, khushboo sonia gandhi, khushboo rahul gandhi, tamilnadu congress chief ilangovan, tamilnadu politics, anna dmk party, khushboo clarification, khushboo press meet, khushboo interview

tamilnadu actress khushbu joins congress party reasons chief ilangovan media press meet : finally khushboo gives clarification on joining the congress party behalf of bjp

ఖుష్బూ కాంగ్రెస్'లో చేరడానికి అసలు కారణం ఇదేనట!

Posted: 11/29/2014 07:27 PM IST
Tamilnadu actress khushbu joins congress party reasons chief ilangovan media press meet

2010లో డీఎంకేలో చేరిన నటి ఖుష్బూ.. ఇటీవలే ఆ పార్టీకి రాజీనామా చేశారు. అయితే ఆమె తదుపరి ఏ పార్టీలో చేరుతుందోనన్న ఉత్కంఠ కొన్నాళ్లవరకు సాగింది. తొలుత ఆమె బీజేపీ పార్టీలో చేరడం ఖాయమనే వార్తలు ప్రచారంలోకి వచ్చాయి కానీ.. చివరకు కాంగ్రెస్ తీర్థం పుచ్చుకుని ఆ రూమర్లకు ఫుల్’స్టాప్ పెట్టేసింది. ‘‘అదేంటి..? గత సార్వత్రిక ఎన్నికల్లో బీజేపీ అత్యధిక మెజార్టీతో అధికారంలోకి వస్తే.. ఘోరంగా పరాజయం పాలైన కాంగ్రెస్ పార్టీలో ఎందుకు చేరారు..?’’ అని అడిగితే.. అందుకు ఆమె వివరణ ఇచ్చుకున్నారు.

శనివారం చెన్నైలోని కాంగ్రెస్ పార్టీ కార్యాలయం సత్యమూర్తి భవన్’ను సందర్శించిన ఖుష్బూకు పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు ఇళంగోవన్ స్వాగతం పలికారు. ఈ నేపథ్యంలో మీడియాతో మాట్లాడిన ఆమె... దేశంలోని వివిధ కులాలు, వర్గాల మధ్య ఐక్యత కేవలం కాంగ్రెస్ పార్టీతోనే సాధ్యమవుతుందనే నమ్మకంతోనే తాను చేరినట్లు స్పష్టం చేసింది. తన వివేకం, నమ్మకం ఆధారంగానే కాంగ్రెస్ పార్టీలో చేరానని... ‘‘లౌకిక భారతదేశం’’ తన స్వప్నమని ఆమె వెల్లడించారు.

అలాగే ఓ ప్రశ్నకు సమాధానంగా బదులిస్తూ.. తన గురించి అధినేత్రి సోనియా గాంధీకి, ఉపాధ్యక్షుడు రాహుల్ గాంధీకి బాగా తెలుసునని... వారు ఏ పదవి అప్పగిస్తే, దాన్ని తాను మనస్ఫూర్తిగా స్వీకరిస్తానని పేర్కొన్నారు. ఇదిలావుండగా.. పార్టీలో ఖుష్బూ చేరికపై తమిళనాడు కాంగ్రెస్ చీఫ్ ఇళంగోవన్ మాట్లాడుతూ, ఖుష్బూ సేవలను రాష్ట్రవ్యాప్తంగా ఉపయోగించుకుంటామని చెప్పారు.

AS

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : khushboo  congress party  sonia gandhi  rahul gandhi  tamilnadu congress chief ilangovan  

Other Articles