Indian man pulling wild lion by tail and pokes injured lion with a stick

Indian Farmer, Lioness, TAIL, Alive, Pulling Wild Lion By Tail, Indian Farmer, Pokes, Injured Lion, Stick, friend, filmed, cattle, Jasadhar forest, India's Gir wildlife sanctuary, rare Asiatic lions

Indian Man Pulling Wild Lion By Tail and Pokes Injured Lion With A Stick

మృగరాజుతో ఆటలా..? తోక పట్టుకుని లాగుతారా..?

Posted: 11/30/2014 01:24 PM IST
Indian man pulling wild lion by tail and pokes injured lion with a stick

దేశ రాజధాని ఢిల్లీలోని జూలో ప్రమాదవశాత్తు కాలుజారి తెల్లపులి నివసరించే చోట పడిన ఓ అభాగ్యుడిని అది దాడి చేసి చంపి, తిన్న ఘటన ఇంకా కళ్ల ముందు కదులుతుండగానే.. దానిని మరచి.. మనిషి అనేక తప్పిదాలకు పాల్పడుతున్నాడు. అది మృగరాజు దానితో పరచకాలు అడితూ తాను సాహసవీరుడినిని చూపుతున్నాడు ఓ పశువుల కాపరి. అసలే గాయపడిన సింహం.. వేటు వేస్తే ఏమవుతుందన్న విషయం కూడా మరచి దానిని తోక పట్టి లాగటంతో పాటు కర్రతో పొడుస్తున్నాడు. సింహం బలం పుంజుకుని ఒక్క వేటు వేస్తే.. తన పరిస్థితి ఏంటనేది కూడా పశువుల కాపరి అలోచించ లేదు.

వివరాల్లోకి వెళ్తే రాజస్థాన్ లోని గిర్ జాతీయ పార్కు అటవీ ప్రాంతంలో తన మిత్రులతో కలసి వెళ్తున్న పశువుల కాపరికి ఒక సింహం కనబడింది. అది తీవ్రమైన గాయంతో భాధపడుతోంది. అయితే గాయం వల్ల అది చనిపోయినట్లు పడివుంది. దానిని చూసిన పశువుల కాపారి తన మిత్రులకు అది బతికే వుందని చూపించేందుకు దాని వద్దకు వెళ్లి తోకను లాగాడు. అదీ చాలదన్నట్టు సింహాన్ని కర్రతో పోడుస్తూ కదిలేలా చేశాడు. ఈ మొత్తం తతంగాన్ని తన మిత్రులు కొంత దూరంలో నిలబడి ఫోన్ కెమెరాలో బంధించారు. అయితే ఇప్పుడు ఈ వీడియో సోషల్ మీడియాలో బాగానే హల్ చల్ చే్స్తోంది. కాగా గాయపడిన సింహా సమాచారాన్ని సంబంధిత అధికారులకు అందిస్తే.. వారు దానిని కాపాడతారన్న మానవత్యాన్ని పక్కనబెట్టి.. తోకను లాగడం, కర్రతో పొడవటం ఏంటని పలువురు ప్రశ్నిస్తున్నారు.

జి మనోహర్

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Other Articles