Janata dal united asks bihar chief minister jitin ram manjhi not to make controversial remarks

Jitan Ram Manjhi, JD(U), controversial remarks, kc thyagi, party cadre, president, sharad yadav,

janata dal united asks bihar chief minister jitin ram manjhi not to make controversial remarks

సీఎంగా వుంటూ నోరు జారితే.. కార్యకర్తల కష్టాలు..

Posted: 11/20/2014 08:16 PM IST
Janata dal united asks bihar chief minister jitin ram manjhi not to make controversial remarks

వివాదాస్పద వ్యాఖ్యలు చేస్తూ నిత్యం వార్తల్లో ఉంటున్న బీహార్ ముఖ్యమంత్రి జితన్ రామ్ మాంజీకి సొంతపార్టీ నుంచి జలక్ తగిలింది. బీహార్ ముఖ్యమంత్రిగా కొనసాగుతూ నోరు జారితే పార్టీ నేతలు, కార్యకర్తలు, విపత్కర పరిణమాలను ఎదుర్కోవాల్సి వస్తుందని జేడీ(యూ) కళ్లెం వేసింది. వివాదాస్పద వ్యాఖ్యలు చేయొద్దని ఆయనకు సూచించింది. అగౌరవపరిచే వ్యాఖ్యలు పార్టీ, నాయకులకు ఇబ్బందికరంగా ఉంటాయని జేడీ(యూ) ప్రధాన కార్యదర్శి కేసీ త్యాగి అన్నారు. పార్టీ కార్యకర్తల నైతికస్థైర్యాన్ని దెబ్బతీస్తాయని పేర్కొన్నారు. వివాస్పద వ్యాఖ్యలు చేయొద్దని మాంజీకి ఆయన సూచించారు. పార్టీకి నష్టం కలిగించే విధంగా వ్యవహరించొద్దని కోరారు.

మాంజీని సీఎం పదవి నుంచి తప్పించే ఉద్దేశం ఉందా అని ప్రశ్నించగా...మాంఝీని ముఖ్యమంత్రి పదవి నుంచి తప్పించాలన్న యోచన పార్టీకి లేదన్నారు. ఒకవేళ ఆ ధిశగా ఆలోచన చేయాల్సి వస్తే.. దీనిపై జేడీ(యూ) అధ్యక్షుడు శరద్ యాదవ్ నిర్ణయం తీసుకుంటారని త్యాగి సమాధానమిచ్చారు. అగ్రవర్ణాల వారిని విదేశీయులుగా అభివర్ణించిన మాంఝీ..అంతకు ముందు అనేక పర్యాయాలు వివాదాస్పద వ్యాఖ్యాలు చేశారు. తాజాగా కేంద్రం నుంచి నిధులు తీసుకురాకుంటే బీహార్ కు చెందిన కేంద్ర మంత్రులను రాష్ట్రంలో అడుగుపెట్టనీయబోమని మాంజీ బుధవారం వ్యాఖ్యానించారు. అంతకుముందు కూడా ఆయన పలు వివాదస్పద వ్యాఖ్యలు చేశారు.

జి.మనోహర్

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : Jitan Ram Manjhi  JD(U)  controversial remarks  kc thyagi  party cadre  president  sharad yadav  

Other Articles