Parents held for honour killing of daughter in delhi

honour killing, delhi university, parents held, Bhavana, abishek seth, Assistant programer, cabinet secreteriat, police, crime news, delhi

parents held for honour killing of daughter in delhi

కన్నకూతర్ని కడతేర్చిన కసాయి తల్లిదండ్రులు..

Posted: 11/20/2014 08:14 PM IST
Parents held for honour killing of daughter in delhi

దేశ రాజధానిలో ఢిల్లీలో దారుణం జరిగింది. కన్న కూతరు అన్న కనికరం కూడా లేకుండా కసాయి తల్లిదండ్రులు ఆమెను బలితీసుకున్నారు. కులాంతర వివాహం చేసుకుందని కోపంతో తమ కుమార్తెను అతి దారుణంగా హత్య చేశారు. దిల్లీ యూనివర్సిటీ సౌత్ క్యాంపస్‌లోగల ప్రతిష్టాత్మక  శ్రీవెంకటేశ్వర కళాశాలకు చెందిన 21ఏళ్ల భావన అనే యువతిని కన్న తల్లిదండ్రులే గోంతు నులిమి చంపేశారు. ఇందుకు అమ్మాయి మేనమాక కూడా సహకరించారు. తర్వాత మృతదేహాన్ని తమ గ్రామానికి తీసుకెళ్లి అక్కడ అంత్యక్రియలు నిర్వహించి కప్పెట్టేశారు.

వివరాల్లోకి వెళ్తే.. రియల్ ఎస్టేట్ వ్యాపారి, స్థానిక కాంగ్రెస్ కార్యకర్త అయిన జగ్మోహన్, ఆయన భార్య సావిత్రిల కూతరు భావన (21) ఈనెల 12వ తేదీన తనకు నచ్చిన యువకుడు అభిషేక్ సేఠ్ అనే యువకుడిని ఆర్యసమాజంలో  పెళ్లి చేసుకుంది. అతడు కేబినెట్ సెక్రటేరియట్లో అసిస్టెంట్ ప్రోగ్రామర్గా పనిచేస్తున్నాడు. భావన రాజస్థానీ యాదవ కులానికి చెందినది కాగా, అభిషేక్ పంజాబీ. వారి వివాహ విషయం ఇంట్లో తెలియడంతో.. వారు భావనను క్షమించేశామని, పద్ధతిగా పెళ్లి చేస్తామని పిలిపించారు.

ఇంటికి తీసుకెళ్లిన తరువాత పంజాబీ కుర్రాడిని వదిలేయాలని, మరో పెళ్లికి సిద్దం కావాలని నచ్చజెప్పారు. పెళ్లి జరిగింది ఇక ఆ విషయాన్ని వదిలేయండని చెప్పిన భావనను అతి కిరాతకంగా గోంతు నులిమి చంపేశారు. తన భార్యను తీసుకెళ్లిన అమె తల్లిదండ్రులు ఇంకా పంపకపోవడంతో అభిషేక్ సేఠ్ పోలీసులను ఆశ్రయించడంతో విచారణ జరిపిన పోలీసులకు అసలు గుట్టు తెలిసింది. వారిపై పక్కా సాక్ష్యాలు ఉండటంతో తల్లిదండ్రులను అరెస్టు చేశామన్నారు. మృతురాలి తండ్రి జగ్మోహన్, తల్లి సావిత్రిలను అరెస్టు చేసినట్లు పోలీసులు తెలిపారు. వారిపై హత్యకేసు నమోదు చేసినట్లు పోలీసులు తెలిపారు.

జి.మనోహర్

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Other Articles