Telangana chief minister kcr makes statement on dlf lands in assembly

telangana assembly, kcr, DLF, lands, statement, telangana chief minister, previous governments, issue

telangana chief minister KCR makes statement on dlf lands in assembly

మా ప్రభుత్వానికి.. ఆ భూములకు సంబంధమేమిటీ..?

Posted: 11/20/2014 08:18 PM IST
Telangana chief minister kcr makes statement on dlf lands in assembly

డీఎల్‌ఎఫ్‌ భూములకు తమ ప్రభుత్వానికి సంబంధం ఎక్కడుందని ముఖ్యమంత్రి కేసీఆర్‌ ప్రశ్నించారు. తమకు డీఎల్ఎఫ్ భూములకు సంబంధం లేదని స్పష్టం చేశారు. డీఎల్‌ఎఫ్‌ భూములపై శాసనసభలో ప్రకటన చేసిన కేసీఆర్ మాట్లాడుతూ శేరిలింగంపల్లిలో 471 ఎకరాలు ఏపీఐఐకి అప్పగించారన్నారు. ఏపీఐఐసీ కొంత భూమిని విక్రయించి ప్రభుత్వానికి నిధులు ఇచ్చారన్నారు. డీఎల్‌ఎఫ్‌ 580.81 కోట్లతో 31.31 ఎకరాలు కొనుగోలు చేసిందని, 2013లో డీఎల్‌ఎఫ్‌ అదనంగా రూ.34 కోట్లు చెల్లించి రిజిస్ర్టేషన్‌ చేసుకుందని చెప్పారు. డీఎల్‌ఎఫ్‌ కొనుగోలు చేసిన భూముల్లో వారసత్వ భూములు ఉన్నందున రాయదుర్గంలో గత ప్రభుత్వం ప్రత్యామ్నాయ భూమి ఇచ్చిందని కేసీఆర్‌ వెల్లడించారు. ఈ భూములు అమ్మవద్దంటూ తాము పోరాడామని సభకు తెలియజేశారు.
 
గత ప్రభుత్వం 10 వేల కోట్ల విలువైన భూములు అమ్మిందని, తెలంగాణ ఏర్పాడక ముందే భూకేయింపులు జరిగాయని తెలిపారు. కొందరు పచ్చి అబద్దాలు చెప్పి ప్రజలను మభ్యపెడుతున్నారని విమర్శించారు. తనను, తన కుటుంబాన్ని అప్రతిష్ట పాలు చేస్తున్నారని మండిపడ్డారు. దొర ఇంకో దొరకు రాసిచ్చారనడం సమంజసమా అని కేసీఆర్‌ ప్రశ్నించారు. తమది ఎవరో నామినేట్‌ చేస్తే వచ్చిన ప్రభుత్వం కాదని, ప్రజలు తమకు అధికారం ఇచ్చారన్నారు. తాము ఏం చేసినా తప్పుబడితే సహించమని, ప్రతిపక్షాల నిర్మాణాత్మక సూచనలు స్వీకరిస్తామని సీఎం కేసీఆర్‌ వెల్లడించారు.
 
ఈ క్రమంలో కాంగ్రెస్‌ సభ్యులు ఆందోళన చేయడంతో సభలో గందరగోళం నెలకొంది. ఆరోపణలు రుజువు చేయని సభ్యులను బహిష్కరించాలన్నారు. పదవులు శాశ్వతం కాదు...సంస్కారంతో మాట్లాడాలని సూచించారు. ఫైళ్లను స్పీకర్‌ ముందు పెడదాం...తప్పెవరిదో తేల్చేద్దామని కేసీఆర్‌ అన్నారు. డీఎల్‌ఎఫ్‌ భూములను మైహోం రామేశ్వరరావు కొన్నారని, అదే భూమిలో గేమింగ్‌ సిటీకి అప్పటి సీఎం శంకుస్థాన చేసిన విషయాన్ని తెలిపారు. మైహోం భూముల్లో గేమింగ్‌ సిటీ ఎలా పెడతారంటూ రామేశ్వరరావు ధర్నాకు దిగారని, దీనికి కాంగ్రెస్‌, టీడీపీ, టీఆర్‌ఎస్‌ మద్దతిచ్చిందని చెప్పారు. రిజిస్టేషన్ల ఫీజు మాఫీ ఫైల్‌తో తమకు సంబంధంలేదని, గతంలో తీసుకున్న నిర్ణయాన్నే అమలు చేస్తున్నట్లు కేసీఆర్‌ వెల్లడించారు.
 
మైహోం సంస్థ ప్రభుత్వం నుంచి గజం కూడా పొందలేదని వివరించారు. బ్లాక్‌మెయిల్‌కు రామేశ్వరరావు లొంగకపోవడం వల్లే ఆరోపణలు చేస్తున్నారు. పారిశ్రామికవేత్తలను సతాయిస్తే అభివృద్ధి జరగదన్నారు. మైండ్‌ స్పేస్‌, ఎమార్‌ భూకేటాయింపులపై చర్చిద్దామన్న ఆయన అవసరమైతే చర్చను మరో 20 రోజులు పొడిగిద్దామన్నారు. తప్పుడు ఆరోపణలు చేసిన వారు సభకు క్షమాపణ చెప్పాలని సీఎం కేసీఆర్‌ అన్నారు.

జి.మనోహర్

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : telangana assembly  kcr  DLF  lands  statement  telangana chief minister  previous governments  issue  

Other Articles