Silicon valley of california gets five foot tall robot security guards

robots as security guards, robots in silicon valley security, robots in hospitals operations, robot latest developments, robot sesnors and camers, robots in house maid service, robot like human, robot with laser scanners, robot latest technology, latest news updates science and technology latest updates, robots making, silicon valley, california latest news updates

Silicon Valley gets five foot tall robot security guards : Five foot tall robots equipped with microphones, speakers and a hos of sensors have gone on patrol in silicon Valley.

సైన్స్ : సెక్యురిటీ గార్డులే.... కాని మనుషులు కాదు

Posted: 11/21/2014 12:15 AM IST
Silicon valley of california gets five foot tall robot security guards

ప్రస్తుత ప్రపంచం మనుషులతో పాటు రోబోలతో కూడా నడుస్తోంది. హైటెక్ టెక్నాలజి పుణ్యమా అని రోబోలు అన్ని రంగాల్లోకి ప్రవేశిస్తున్నాయి. ఇంటి పనులు మొదలుకుని షాపుల్లో హౌజ్ కీపింగ్ సెక్షన్ , హోటళ్ళలో సర్వర్లుగా సేవలు అందిస్తున్నాయి. తాజాగా ఈ రోబోలు సెక్యురిటి గార్డు విధులు కూడా నిర్వర్తిస్తున్నాయి. అమెరికాలోని కాలిఫోర్నియాలో ఉన్న సిలికాన్ వ్యాలిలో రోబోలు సెక్యురిటీ గార్డులుగా పనిచేస్తున్నట్లు ప్రముఖ వెబ్ సైట్ తెలిపింది. ఐదు అడుగుల పొడవైన ఈ రొబోలు పోలిసుల కంటే మరింత పకడ్బందీగా భద్రతను అందిస్తున్నాయని కధనంలో పేర్కొంది.

ప్రతి సెక్యురిటి రోబో అత్యాధునిక లేజర్ స్కానర్లు, కెమెరాలు, మైక్రో పోన్ లు కలిగి ఉంది. ఫలితంగా చుట్టూ ఉండే పరిస్థితులను గమనించటంతో పాటు, బాంబులు వంటి పేలుడు పధార్ధాలను స్కానర్లు గుర్తిస్తాయి. ఇక మైక్రోఫోన్లు సమాచార చేరవేతలో ఉపయోగపడతాయి. కెమెరాల సాయంతో రోబో నిరంతరం స్థానిక పరిసరాలను వీడియో తీస్తుంది. ఫలితంగా అనుమానితులను గుర్తించటం సులభం అవుతుందని తయారీదారులు చెప్తున్నారు. నైట్ స్కోప్ పేరుతో పిలిచే ఈ రోబోలు పగలు, రాత్రి అనే తేడా లేకుండా పని చేయటం మరో విశేషం.

ఈ రొబోలు మనుషుల్లాగే వినటం, చూడటంతో పాటు భావాలను గుర్తించగలవట. వీటిలో ప్రత్యేకంగా జీపీఎస్ టెక్నాలజీ పొందుపర్చారు. అంతేకాకుండా వేడిని గ్రహించే సెన్సార్లు ఉన్నాయి. ఫలితంగా అగ్నిప్రమాదాలు జరిగిన వెంటనే పసిగట్టేస్తుంది. ప్రస్తుతం సిలికాన్ వ్యాలిలో ప్రయోగాత్మక దశలో ఉన్న ఈ రోబోల ఫలితాలు మెరుగ్గా ఉంటే త్వరలోనే షాపింగ్ మాల్స్, కార్యాలయాలు ఇతర ప్రాంతాల్లో ఉపయోగించే అవకాశం ఉంది. వీటి వల్ల నేరాల సంఖ్య 50శాతం తగ్గుతుందని వీటిని తయారుచేసిన శాస్ర్తవేత్తలు చెప్తున్నారు. ఇలాంటి రోబోలు కాలనీల్లో సెక్యురిటీ గార్డులుగా ఉంటే దొంగలు, దుండగుల దాడి భయం ఉండదని సిలికాన్ వ్యాలీ వాసులు చెప్తున్నారు.

కార్తిక్

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : robot security  silicon valley  california  science and technology  latest news updates  

Other Articles