తన పేగు బంధం కాకపోయినా.. ఆ తల్లి హృదయం ఆ పిల్లవాడిని కరుణించింది. కన్న తల్లిలా ఆదరించింది. విద్యాబుద్దలు నేర్పంచింది.. అంతే కాదు వ్యాపారం పెట్టుకుంటానంటే డబ్బులిచ్చి సహకరించింది. ఇంత చేసినా.. ఆమె ఏదీ ఆశించలేదు. కన్న మమకారం దొరికితే చాలని భావించింది. అయినా మోసపోయింది. తన డెబిట్ కార్డుతో తనకు తెలియకుండానే పెంచిన బంధం తస్కరించి సుమారు 8 లక్షల 60 వేల రూపాయల డబ్బును దొంగలించడంపై వేదనకు గురైంది. ఎంతో క్రమశిక్షణతో వుండాల్సిన బిడ్డ చివరకు తననే నయవంచనకు గురచేసి వెన్నపోటు పోడిచాడని ఆందోళన చెందిన అమె అతడిపై కేసు నమోదు చేయాల్సిందిగా పోలీసులను ఆశ్రయించింది. పోలీసులు కూడా అమె వేదనను పట్టించుకోని తరుణంలో.. ఉన్నతాధికారులను ఆశ్రయిస్తానని చెప్పడంతో ఎట్టకేలకు ఎర్రవాడ పోలీసులు 420 కింద చీటింగ్ కేను నమోదు చేశారు.
ఈ నయవంచనకు సంబంధించిన పూర్తి వివరాలు ఇలా వున్నాయి. ముంబాయి నగరంలోని కోల్హాపూర్ లో నివసించే లక్ష్మీ రహర్కర్.. స్థానికంగా వున్న వైద్య కళాశాలలో విభాగం అధిపతిగా పనిచేస్తున్నారు. నాందేడ్ లోని తన సోదరి ఇంట్లో పనిమనిషిగా వున్న పనిమనిషి కుమారుడు బాలాజీ వాగ్మేర్ ని అక్కున చేర్చుకుంది. అతను పదో తరగతి మంచి మార్కులతో పాస్ కావడంతో.. తన కొడుకులా భావించి అతడి ఉన్నత విద్యను అభ్యసించేందుకు డబ్బు రూపంలో సహాయం అందించింది. అప్పటి నుంచి పిల్లవాడు తరచు అమె వద్దకు వచ్చి వెళ్తూ వుండేవాడని తెలిపింది. సుమారు 30 ఏళ్లుగా బాలాజీతో తనకు మంచి అనుబంధం వుందని తెలిపింది. కొంత కాలం కిందట బాలాజీ వ్యాపారం పెడతానంటే.. అతనికి డబ్బు సాయం చేసి యోగ్యతతో వ్యాపారం చేయాలని కోరింది. అంతేకాదు అతని చేత కర్టైన్లను తెప్పించి తన సహచరులకు కూడా ఇప్పించింది.
ఈ నేపథ్యంలో తనకు సుమారు 60 రోజుల లీవులు వుండటంతో.. వాటిని వినియోగించుకునే క్రమంలో పూణేలో ధ్యాన తరగతులకు హాజరుకవాలని భావించి కోల్హపూర్ నుంచి ఆగస్టు 5న పూణేలోని ఎర్రవాడ ప్రాంతానికి వచ్చింది. కొన్ని రోజుల పాటు బాలజీ నివాసంలో వున్నా.. వారి వ్యక్తిగత జీవితానికి అడ్డు కాకూడదని వేరే అపార్టుమెంటును అద్దెకు తీసుకుని అక్కడే వుంది. ఫూణే రైల్వేస్టేషన్ వద్ద ధ్యాన తరగతులకు హాజరైన తరువాత సాయంత్రం డెక్కన్ ప్రాంతంలో నాచురోపతి ద్వారా చికిత్స చేయించుకుంది. తనకు ఎప్పడు ఖాళీ లభించినా.. బాలాజీ కర్టైన్ల దుకాణానికి వెళ్లి అతడికి సాయం చేసేది.
ఎప్పటిలాగానే అక్టోబర్ 14న విమన్ నగర్ లోని బాలాజీ దుకాణానికి వెళ్లిన లక్ష్మీ షాక్ గురైంది. క్యాష్ కౌంటర్ వద్ద కస్లమర్లు ఇచ్చిన డబ్బలను లెక్కించు వేస్తుండగా, అందులో తన డెబిట్ కార్డు కనిపించింది. దాంతో పాటు తన అకౌంట్ నుంచి డబ్బుల డ్రా చేసిన రీసిప్టులు కూడా కనిపించాయి. దీంతో ఖంగుతిన్న లక్ష్మీ విమన్ నగర్ లోని తన బ్యాంకుకు వెళ్లి నగదు లావాదేవీలపై అరా తీసింది. ఆగస్టు మాసం నుంచి ప్రతి రోజు తన అకౌంటు లో నుండి 30 నుంచి 40 వేల రూపాయలు డ్రా అయినట్లు అవి మొత్తం ఎనమిది లక్షల 60 వేల రూపాయలుగా గుర్తించింది. పూణేలో కాకుండా నాందేడ్, హైదరాబాద్, తదితర ప్రాంతాల్లో డబ్బును డ్రా చేసినట్లుగా తెలుసుకుంది. తల్లిలా ఆదరిస్తాడని అతిధిలా ఇంటికి వెళ్తే.. తన డెబిట్ కార్డును కాజేసి డబ్బును దొంగలించి వెన్నుపోటు పోడవటంపై ఆవేదనకు గురైంది.
బాలాజీని ఘటనపై నిలదీసింది. అయితే డబ్బు మొత్తాన్ని తిరిగి ఇస్తానని నమ్మబలికిన బాలాజీ.. పోలీసులకు గానీ ఇతరులకు కానీ విషయాన్ని చెప్పవద్దని ప్రాధేయపడ్డాడని బాధితురాలు తెలిపారు. అప్పుడే తాను రెండు లక్షల రూపాయల చెక్కు ఇచ్చాడని, అది కూడా బౌన్స్ అయ్యిందని తెలిపారు బాలాజీపై ఎర్రవాడ పోలీసులకు పిర్యాదు చేసింది. అయినా వారు పట్టించుకోలేదని, ఉన్నతాధికారులకు పిర్యాదు చేస్తానని చెప్పడంతో ఎట్టకేలకు బాలాజీపై పోలీసులు చీటింగ్ కేసు నమోదు చేశారని లక్ష్మీ తెలిపారు
ఘటనపై ఎర్రవాడ పోలీసు సిఐ పాటిల్ మీడియాతో మాట్లాడుతూ.. బాలాజీ..లక్ష్మి డెబిట్ కార్డును తనకు తెలియకుండా దొంగలించాడని, ఆ తరువాత ఎలాగో తన పాస్ వర్డ్ తదితర వివరాలు తెలుసుకుని డబ్బును బ్యాంకు నుంచి డ్రా చేశాడని తెలిపారు. బహుశా బ్యాంకు తాలుకూ వివరాలను మొబైల్ ఫోన్ లో సేవ్ చేయడంతో వాటిని కనుగోని వుండవచ్చునన్నారు. నిందితుడిపై చీటింగ్ కేసు నమోదు చేసినట్లు తెలిపారు. కాగా నిందితుడు పరారీలో వున్నాడని చెప్పారు. కేసు నమోదు చేయడంలో ఆలస్యమై ప్రశ్నించగా, తన దృష్టికి ఈ విషయం రాలేదని చెప్పారు. ఈ విషయమై తాను స్వయంగా విచారిస్తానని పాటిల్ తెలిపారు.
జి.మనోహర్
(And get your daily news straight to your inbox)
Aug 22 | అమెరికా అందరికీ ఒక డ్రీమ్. మరీ ముఖ్యంగా ఇంజనీరింగ్ పూర్తి చేసిన మన దేశవాసులకు అందులోనూ తెలుగువారికి అగ్రరాజ్యంలోకి అడుగుపెట్టి.. అక్కడ ఉద్యోగం సంపాదించి, స్థిరపడాలన్నది చాలామంది అభిలాష. ఇప్పటికే ఈ ఆశలు ఉన్నవారు... Read more
Oct 08 | అసలే నవరాత్రి వేడుకలు.. అంతా ఉత్సాహంగా ఉన్నారు.. వీధి మధ్యలో గర్భా నృత్యం చేయడానికి ఏర్పాట్లు చేశారు. యువతులు, మహిళలతోపాటు పురుషులూ బాగా రెడీ అయి వచ్చేశారు. కానీ డ్యాన్స్ మొదలుపెట్టగానే కరెంటు పోయింది.... Read more
Oct 08 | తిరుమలలో భక్త జన సందోహం పెరిగింది. దసరా పండగ తరువాత పండగ సెలవులు ముగింపు దశకు చేరకుంటున్న తరుణంలో శ్రీవారి దర్శనం కోసం భక్తులో పోటెత్తారు. సెలవులతో కూడిన వారాంతం కావడంతో భక్తులు పెద్ద... Read more
Oct 08 | దేశవ్యాప్తంగా వాహనాల రిజిస్ట్రేషన్ కు ఒకటే సిరీస్ అయిన బీహెచ్ విషయంలో కేంద్ర రవాణా శాఖ నిబంధనలను సడలించనుంది. దేశవ్యాప్తంగా ప్రతీ రాష్ట్రానికి విడిగా ఒక రిజిస్ట్రేషన్ విధానం నడుస్తోంది. తెలంగాణ అయితే టీఎస్... Read more
Oct 07 | ప్రముఖ ప్రవచనకర్త గరికపాటి నరసింహరావు ఇటీవల మెగాస్టార్ చిరంజీవిపై చేసిన వ్యాఖ్యలు దుమారాన్ని రేపుతున్నాయి. మెగాఫాన్స్ మహాపండితుడు గరికపాటిపై నెట్టింట్లో ట్రోల్ చేస్తున్నారు. ఇక దీనికి మెగాబ్రదర్ నాగబాబు చేసిన ట్వీట్ కూడా తోడు... Read more