Smriti irani could be made cm candidate as internal war splits delhi bjp

Smriti Irani, CM candidate, internal war, splits, Delhi BJP, Prime Minister, Narendra Modi, Amit shah, top brass, Vijay Goel, Dr Harsh Vardhan, Dr Satish Upadhyay, Dr Jagdish Mukhi

Smriti Irani could be made CM candidate as internal war splits Delhi BJP

ఢిల్లీ ముఖ్యమంత్రి అభ్యర్థిగా స్మృతి ఇరానీ..?

Posted: 11/20/2014 01:00 AM IST
Smriti irani could be made cm candidate as internal war splits delhi bjp

కేంద్ర మానవ వనురుల అభివృద్ది శాఖా మంత్రి స్మృతి ఇరాని ఇప్పుడు ఈ పేరు ఢిల్లీ ప్రజల్లో హాట్ టాపిక్ గా మారింది. ఢిల్లీ ముఖ్యమంత్రి అభ్యర్థిగా అమెను రంగంలోకి దింపేందుకు బీజేపి కేంద్ర నాయకత్వం ప్రణాళికలు రచిస్తోందని లీకులు వెలువడుతున్నాయి. ఢిల్లీ ముఖ్యమంత్రి పీఠాన్ని అధిరోహించేందుక నలుగురు సీనియర్ నేతలు పోటీ పడటంతో.. పార్టీ అంతర్గత కుమ్మలాటలకు నెలవుగా మారుతున్న నేపథ్యంలో ఈ మేరకు నిర్ణయం తీసుకోవాలని బీజేపి జాతీయ నాయకత్వం నిర్ణయించుకున్నట్లు తెలుస్తోంది.

నలుగురు సీనియర్ నేతల మధ్య రాజీ కుదర్చడం కన్నా ప్రాముఖ్యత కలిగిన స్మృతి ఇరానీని రంగంలో దింపించే ఢిల్లీ ప్రజలు అమెను ఆశీర్వదిస్తారని అధినాయకత్వం యోచిస్తోంది. స్మృతి పేరును ప్రతిపాదించడంతో ఢిల్లీ ప్రజలకు ఆశ్చర్యం కలిగించినట్లు అవుతుందని కూడా భావిస్తోంది. ఢిల్లీలోని సాధారణ ప్రజానికాని బాగా పరిచమం వున్న నేతను ప్రతిపాదిస్తే.. అంచనాలకు మించిన ఒట్లు, సీట్లు వస్తాయని కూడా పార్టీ వర్గాలు భావిస్తున్నట్లు సమాచారం. దీంతో పాటు స్మృతి ఇరానీ అటు ప్రధానమంత్రి మోడీ సహా ఇటు పార్టీ జాతీయ అధ్యక్షుడు అమిత్ షాతో కూడా మంచి సన్నిహిత్యం వుంటడం కూడా కలిసివచ్చే అంశంగానే పరిగణిస్తున్నాయి పార్టీ వర్గాలు.

జమ్మూకాశ్మీర్, జార్ఖండ్ అసెంబ్లీ ఎన్నికల అనంతరం జరగనున్న దేశ రాజధాని ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికలకు అప్పుడే వేడి రాజుకుంటోంది. సుమారుగా పది మాసాల రాష్ట్రపతి పాలనలో వున్న ఈ ప్రాంతంలో సుఫ్రీంకోర్టు అదేశాల మేరకు త్వరలోనే ఎన్నికలు జరగనున్నాయి. దేశవ్యాప్తంగా ప్రధాని నరేంద్రమోడీ హవా కొనసాగుతున్న నేపథ్యంలో ఢిల్లీలోనూ అధికార పీఠం తమకే దక్కుతుందని యోచిస్తున్న బీజేపి నేతలు ముందునుంచే ముఖ్యమంత్రి పీఠంపై కన్నెస్తున్నారు. తమకే ముఖ్యమంత్రి పీఠం దక్కెలా చూడాలని అధినాయకత్వం చుట్లూ పచార్లు కోడుతున్నారు.

ముఖ్యమంత్రి పీఠం అధిరోహించే రేసులో నలుగురు అభ్యర్థులు తీవ్రంగా పోటీ పడుతున్నారు. గత ఎన్నికల సమయంలో బీజేపి తరపున ముఖ్యమంత్రి అభ్యర్థిగా పోటీ చేసి, బీజేపిని అతిపెద్ద పార్టీగా అవరించడంలో క్రీయాశీలక పాత్ర పోషించిన కేంద్ర శాస్త్ర సాంకేతికశాఖ మంత్రి డాక్టర్ హర్షవర్థన్, ఢిల్లీ బీజేపి అధ్యక్షుడు డాక్టర్ సతీష్ ఉపాధ్యాయ, జానకీపూర్ శాసనసభ్యుడు, సీనియర్ బీజేపి నేత జగదీష్ ముఖిలతో పాటు రాజ్యసభ సభ్యుడు విజయ్ గోయల్ పోటీ పడుతున్నారు. దీంతో వీరందరినీ తోసిరాజని స్మృతి ఇరానీని ఢిల్లీ ముఖ్యమంత్రి అభ్యర్థిగా ప్రకటించే అవకాశాలు వున్నాయని తెలుస్తోంది.

జి.మనోహర్

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Other Articles