Virginity tests for female indonesia police officers are discriminatory says human rights watch

Women, police officers, Virginity test, procedure, painful, traumatic, bad experiences, humiliate, Police authorities, Jakarta, immediately, unequivocally, abolish, Human Right wacth, Nisha Varia

Virginity tests for female Indonesia police officers are 'discriminatory', says Human Rights Watch

కనెత్వ పరీక్షలపై మానవహక్కుల సంఘం ఆగ్రహం..

Posted: 11/20/2014 02:00 AM IST
Virginity tests for female indonesia police officers are discriminatory says human rights watch


ఇండోనేసియాలో మహిళా పోలీసు అధికారులపై జరుగుతున్నఅకృత్యంపై మానవ హక్కుల సంఘం తీవ్రంగా మండిపడింది. మహిళా పోలీసులకు కన్నెత్వ పరీక్షలు చేయడాన్ని తీవ్రంగా ఖండించింది. మహిళా పోలీసులపై విపక్షపూరితంగానే ఈ పరీక్షలు చేస్తున్నారని ఆగ్రహాన్ని వ్యక్తం చేసింది. తక్షణమే ఈ పరీక్షఃణలను నిలివేయాలని డిమాండ్ చేసింది. మహ్మదీయుల అధిపత్య  దేశంలో మహిళలు ఫోలీసు ఉద్యోగాలు చేయడానికి ముందుకు రావడాన్ని స్వాగతించాల్సింది పోయి.. పరీక్షల పేరుతో వారిని చిత్రవధకు గురిచేస్తారా..? అంటూ ప్రశ్నించింది

ఇండోనేసియాలో మహిళా పోలీసు అధికారుల పోస్టులకు అవివాహితులతో పాటు కన్నెత్వం వున్నవారినే నియమించడంపై విమర్శలు గుప్పించింది. పలువురు అధికారులు కన్నెత్వ పరీక్షలు జరపడం లేదన్న వాదనలు తోసిపుచ్చింది. ఈ ఏడాది మహిళా పోలీసు అధికారుల పోస్టులకు దరఖాస్తు చేసిన అమ్మాయిలు తమతో బాధను పంచుకున్నారని చెప్పింది. కన్నెత్వ పరీక్షలు చాలా నొప్పికలిగించేదిగాను, బాధాకరమైనది గాను వున్నాయని చెప్పారని తెలిపింది. పరీక్షలకు హాజరైన అమ్మాయిలను అక్కడున్న మహిళా వైద్య సిబ్బంది ముందు ఎలా నగ్నంగా నిల్చోబెడతారో, వారికి రెండు వేళ్లతో ఎలా పరీక్షలు జరుపుతారో చెప్పి వారు విలపించారని తెలిపింది.

దాదాపుగా పరీక్షలకు హాజరైన వారందరూ ఆ చేదు జ్ఞాపకాలను గుర్తు చేసుకోవడానికి కూడా జంకుతున్నారని మానవ హక్కుల సంఘం తెలిపింది. వాటిని గుర్తు చేసుకుంటే తామను తాము కించపర్చుకున్నట్లేని పశ్చిమ సుమత్రాలోని పెకన బరు లో పరీక్షలు చేయించుకున్న మరో అమ్మాయి తెలిపిందని మానవహక్కుల సంఘం తెలిపింది. తమకు తెలియని వారి ఎదుట తాము వివస్త్రలుగా ఎందుకు నిలబడాలని, అది అవసరమా, ఈ రకమైన పరీక్షలను తక్షణం నిలిపివేయాలని వారు డిమాండ్  చేశారని మానవహక్కుల సంఘం అసోసియేట్ డైరెక్టర్ నిషా వార్య తెలిపారు.

మహిళా పోలీసు అధికారులకు నిర్వహించే కన్నెత్వ పరీక్షలను తక్షణం జాకర్తా పోలీసులు నిర్ద్వందంగా నిషేధించాలని అమె పోలీసు అధికారులను కోరారు.. ఈ కాలం చెల్లిన నిబంధనలను ఇక మీదట ఎక్కడా అమలు పర్చకూడదని కూడా దేశ్యవాప్తంగా అందరు పోలీసుల ఉన్నతాధికారులకు అదేశాలు పంపాలని కోరారు. అయితే  పోలీసులు ఉన్నతాధికారులు మాత్రం గత కోన్నేళ్లుగా కన్నెత్వ పరీక్షలను నిలిపివేశారని చెప్పారు. దీంతోనే ప్రస్తుతం నాలుగు లక్షల మంది పోలీసు విభాగంలో సమారు మూడు శాతం మేర మహిళా అదికారులు వున్నారని వారు చెప్పుకోచ్చారు.

జి.మనోహర్

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Other Articles