G20 countries accepts to exchange information on black money

modi on black money, narendra modi on black money in g20, narendra modi g20 speech, narendra modi latest comments, g20 countries on black money, indian black money holders list, latest news updates, world latest news updates, modi australia tour updates

g20 countries accepts to exchange information on black money : with modi request to share information on black money, all g20 countries came forward to give inforamtion and promises to exchange information regarding this

నల్లధనంపై పోరులో గెలిచిన నరేంద్రుడు

Posted: 11/17/2014 09:19 AM IST
G20 countries accepts to exchange information on black money

నల్లధనంకు వ్యతిరేకంగా అలుపెరగని పోరాటం చేస్తున్న ప్రధాని నరేంద్రమోడి మరో గొప్ప విజయం సాధించాడు. ప్రపంచ వేదికలపై ఈ విషయాన్ని పదేపదే ప్రస్తావించటం ద్వారా అందర్నీ ఆలోచింపచేసి.. చివరకు తన వైపు నడిచేలా చేసుకున్నాడు. నల్లధనంపై సమాచారం ఇచ్చిపుచ్చుకునేందుకు జీ20 దేశాలు అంగీకరించాయి. ఈ మేరకు మోడి ప్రసంగ విజ్ఞప్తులను అంగీకరిస్తూ సదస్సుకు హాజరైన దేశాల నేతలు ప్రతిన కూడా చేశారు. ఇప్పటికే నల్లధనంపై ప్రత్యేక ధర్యాప్తు బృందాన్ని ఏర్పాటు చేసి, విదేశాల నుంచి నల్ల కుభేరుల జాబితా తెప్పించి వారికి ఇచ్చిన మోడికి ఇది మరొక విజయంగా చెప్పవచ్చు.

ఆస్ర్టేలియాలోని బ్రిస్బేస్ లో జరిగిన జీ20 సదస్సులో ప్రధాని నరేంద్రమోడి నల్లధనం, ఉగ్రవాదం అంశాలపైనే ప్రధానంగా ప్రసంగించారు. నల్లధనం భారత్ కు ప్రధాన అవరోధంగా ఉందన్నారు. దీన్ని అధిగమిస్తామని., అయితే ఈ విషయంలో అన్ని దేశాల సమన్వయం కావాలని కోరారు. సమావేశాల చివరి రోజున మోడి ప్రసంగంపై స్పందిందిచిన జీ20 దేశాలు నల్లధనంపై సమాచారాన్ని ఇచ్చిపుచ్చుకునేందుకు కొత్త ప్రమాణం తీసుకువస్తామని చెప్పాయి. దీంతో 2017 నాటికి పన్ను సమాచారం ఆటోమేటిక్ గా ఇచ్చిపుచ్చుకునేందుకు యంత్రాంగం ఏర్పాటుకానుంది.

దీంతో పాటు బేస్ ఎరోజన్, ఫ్రాఫిట్ షేరింగ్ ఎదుర్కునేందుకు కార్యాచరణ ప్రణాళికకు కూటా అంగీకారం తెలిపింది. 2017 లేదా 2018 నాటికి జీ20 లోని దేశాలో పాటు ఇతర దేశాలు కూడా సీమాంతర పన్ను ఎగవేత నిరోధించేందుకు సమాచారం ఇచ్చిపుచ్చుకునే విధానం మొదలు పెడతామని తీర్మానం చేశాయి. దీనిపై జీ20 నుంచి అధికారిక ప్రకటన వెలువడంది. ఎవరైతే, ఏ దేశంలో అయితే ఆదాయం సృష్టిస్తారో, ఆ దేశానికి సంబంధించిన పన్ను ఎగవేతలపై సమాచారం ఇస్తారు. తద్వారా మనకు తెలియకుండా ఇతర దేశాల్లో డబ్బు దాచుకున్న వారి వివరాలు ఆ దేశాలు స్వయంగా భారత్ కు అందిస్తాయి. ఇలా చేయటం వల్ల నల్లధనంను సులువుగా అరికట్టవచ్చు. స్వాతంత్ర్య పోరాటంలో ఎందరు వచ్చినా.., చివరకు అంతా గాంధీ వెనకే నడిచినట్లుగా.., అవినీతి, నల్లధన పోరులో ఎంతమంది ఉద్యమకారులు వచ్చినా.. ఇప్పుడు ప్రపంచమే మోడి వెనక నడుస్తూ ఆయనకు అండగా ఉంటోంది.

కార్తిక్

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : black money  narendra modi  g20  information  latest news  

Other Articles