Junior doctors chop off man s penis in kolkata

Junior Doctors Chop off Man's Penis, Junior Doctors in kolkata, Junior Doctors latest news, penis cut off, penis chop off, kolkata latest news, medical science course, medical tips to use at homes, mobile theft cases, theft mobile tracking

Junior Doctors Chop off Man's Penis in kolkata : Junior doctors and students of Kolkata's Nil Ratan Sircar Medical College and Hospital chopped off the penis of a man and beat him to death suspecting him for a cell-phone theft

ఆవేశం అనర్ధాలకు మూలం అంటే ఇదేనేమో

Posted: 11/17/2014 08:00 AM IST
Junior doctors chop off man s penis in kolkata

కోల్ కతాలో నీల్ రతన్ సిర్కార్ మెడికల్ కాలేజీ కి చెందిన జూనియర్ డాక్టర్లు రెచ్చిపోయారు. దొంగతనం చేశాడనే కోపంతో ఓ వ్యక్తి పురుషాంగం కోసేసి చావబాదారు. కాలేజి హాస్టల్ లో కొద్దిరోజులుగా ల్యాప్ టాప్ లు, మొబైల్ ఫోన్స్, ఐపాడ్లు ఇతర ఎలక్ర్టానిక్ వస్తువులు చోరికి గురవుతున్నాయి. వీటిపై విద్యార్థులు నిఘా పెట్టారు. రెండ్రోజుల క్రితం 28ఏళ్ళ ఓ వ్యక్తి హాస్టల్ లో మొబైల్ ఫోన్ దొంగతనం చేస్తుండగా రెడ్ హ్యాండెడ్ గా పట్టుకున్నారు. హాస్టల్ లో ఉండే పెద్దగదికి తీసుకెళ్లి బట్టలూడదీసి చితకొట్టారు.

అంతటితో ఆగకుండా నిందితుడి పురుషాంగం కోసేసి చిత్రహింసలు పెట్టారు. ఈ దాడిలో నిందితుడు ఘటనాస్థలంలోనే చనిపోయాడు. విషయం తెలుసుకున్న పోలిసులు హాస్టల్ కు చేరుకుని విచారించారు. దాడి చేసినట్లుగా భావిస్తున్న ఇద్దరు జుడాలను అరెస్టు చేశారు. వీరితో పాటు ఇద్దరు క్యాంటీన్ సిబ్బందిని కూడా అదుపులోకి తీసుకున్నారు. దాడిలో పాల్గొన్న, సహకరించిన మిగతా వారి కోసం ధర్యాప్తు చేస్తున్నారు. ఈ ఘటనతో ఒక్కసారిగా కాలేజి షాక్ కు గురయింది.

ప్రాణాలు పోసే డాక్టర్లు ఇలా చిత్రహింసలు పెట్టి ప్రాణాలు తీయటంపై కోల్ కతాలో విమర్శలు వస్తున్నాయి. నిందితుడు తప్పు చేసి ఉంటే.., పోలిసులకు అప్పగించాలి. లేదంటే రెండు దెబ్బలు కొట్టి పోలిసులను పిలవాలి కానీ., ఇలా పురుషాంగం కోసేసి చితకబాది, చిత్ర హింసలు పెట్టి చనిపోయేట్లు చేయటం సరికాదని మండిపడుతున్నారు. విద్యార్థులు చేసిన పని వల్ల ఒక నిండు ప్రాణం బలికావటంతో పాటు.., చదువుకోవాల్సిన వారు నేరస్తులుగా అరెస్టయి జైలు జీవితం గడపాల్సి వస్తోంది. అందుకే ఆవేశం అనర్ధాలకు మూలం అన్నారు మన పెద్దలు.

 

కార్తిక్

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : Junior Doctors  Penis  mobile  theft  kolkata  

Other Articles