Bihar cm jitam ram manjhi sensational comments on housewives and women

bihar cm jitam ram manjhi, jitan ram manjhi news, jitan ram manjhi comments, jitan ram manjhi women comments, kc tyagi news, jitan ram majhi controversy news, house wives, women in house

bihar cm jitam ram manjhi sensational comments on housewives and women. He said that when married husband went from the house for several days... then we know what their wives doing in homes.

గృహిణులపై నోరుపారేసుకున్న ముఖ్యమంత్రి...

Posted: 11/14/2014 08:48 PM IST
Bihar cm jitam ram manjhi sensational comments on housewives and women

ఈమధ్య రాజకీయ నాయకులు మహిళల మీద కొన్ని వివాదాస్పద వ్యాఖ్యలు తరుచుగా సంధిస్తున్న విషయం తెలిసిందే! మహిళలు అలా వుండాలి... కాదు ఇలా వుండాలి... జీన్స్ ధరించకూడదు... రాత్రివేళల్లో ఎక్కువగా బయట తిరగకూడదు... ఇలా రకరకాలుగా తమ అభిప్రాయాలను వెల్లడించిన నాయకులు ఎంతోమంది వున్నారు. అలాగే మరికొంతమంది మహిళల సత్ర్పవర్తనపై వివాదాస్పద వ్యాఖ్యలు చేసి.. నాలిక్కర్చున్నవాళ్లూ వున్నారు. అటువంటివారిలో బీహార్ ముఖ్యమంత్రి జితన్ రాం మాంఝీ కూడా చేరిపోయినట్లే కనిపిస్తున్నారు.

ఇప్పటికే పలు వివాదాల్లో తడిసిముద్దైపోయిన మాంఝీ... తాజాగా మహిళలపై తీవ్ర వ్యాఖ్యలు చేసి సొంత పార్టీ అధిష్ఠానం నుంచి చీవాట్లు తిన్నారు. ‘‘పెళ్లి తర్వాత భర్తలు నెలల తరబడి బయటే ఉంటే, వారి భార్యలు ఏం చేస్తుంటారన్న విషయం అందరికీ తెలుసిందే!’’ అంటూ ఆయన వ్యాఖ్యానించారు. గోపాల్ గంజ్ జిల్లా జాజ్వా పక్డీ గ్రామంలో బుధవారం జరిగిన ఓ కార్యక్రమంలో పాల్గొన్న సందర్భంగా మాంఝీ ఈ విధంగా అభ్యంతరకర వ్యాఖ్యలు చేశారు. దీంతో ఆయన సొంత పార్టీ అధిష్టానమైన జేడీయూ మండిపడింది. మాంఝీ చేసిన వ్యాఖ్యలకు ఆగ్రహం తెలుపుతూ.. హెచ్చరికలు జారీ చేశారు.

‘‘మాజీ ముఖ్యమంత్రి నితిశ్ కుమార్ రాష్ట్ర అభివృద్ధిని ముందుకు తీసుకెళ్లేందుకే మాంఝీని ముఖ్యమంత్రిగా చేశారు. అంతేగానీ.. నితిష్ కుమార్ ఏమీ భారత చరిత్రను తిరగరాయమని చెప్పలేదు. అసలు అది ఆయన పని కూడా కాదు. మాంఝీ వ్యాఖ్యలు పార్టీ ప్రతిష్ఠను మంటగలుపుతున్నాయి. తన అనుచిత వ్యాఖ్యలతో మాంఝీ హద్దులు దాటేస్తున్నారు. తన వైఖరి మార్చుకోకుండా ఇలాగే ప్రవర్తిస్తే.. మాంఝీపై చర్యలు తీసుకునేందుకు కూడా వెనుకాడబోం’’ అని పార్టీ జాతీయ కార్యదర్శి కేసీ త్యాగి చెప్పారు. మరి ఈ వ్యవహారం ఇంకెంత అగ్గిరాజుకుంటుందో వేచి చూడాల్సిందే!

AS

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : jitan ram manjhi  kc tyagi  housewives  bihar cm  telugu news  

Other Articles