Andhra pradesh and telangana government announcements a big exam to intermediate students

Andhra Pradesh Government, Telangana Government, announcements, big exam, intermediate students, final exams

Andhra Pradesh and Telangana Government announcements a big exam to intermediate students

ఇంటర్మీడియట్ విద్యార్థులకు ‘పరీక్ష’

Posted: 11/14/2014 10:59 PM IST
Andhra pradesh and telangana government announcements a big exam to intermediate students

ఇంటర్ చదువుతున్న విద్యార్థులకు రెండు తెలుగు రాష్ట్రాలు పరీక్షను పెడుతున్నాయి. పరీక్షలు ఉమ్మడిగా నిర్వహిస్తారా..? లేక విడివిడిగా నిర్వహిస్తారన్న అన్న అంశంలో భిన్నమైన ప్రకటనలు చేస్తూ.. విద్యార్థులకు పరీక్ష పెడుతున్నాయి. ఇంటర్ పరీక్షల నిర్వహణలో రెండు రాష్ట్ర ప్రభుత్వాలు ఒక నిర్ణయానికి రాలేకపోతున్నాయి. తాజాగా ఇంటర్ పరీక్షలను కామన్‌ షెడ్యూల్‌ ప్రకారమే నిర్వహిస్తామని ఆంధ్రప్రదేశ్ మంత్రి గంటా శ్రీనివాసరావు ప్రకటించగా, లేదు తాము ప్రత్యేకంగా నిర్వహిస్తామని తెలంగాణ మంత్రి జగదీశ్వర్ రెడ్డిలు ప్రకటించడంతో విద్యార్థులు గంధరగోళానికి గురవుతున్నారు.

కామన్‌ షెడ్యూల్‌ ప్రకారమే ఇంటర్‌ పరీక్షలు జరుగుతాయని ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ప్రకటించింది. మంత్రి గంటా శ్రీనివాసరావు మాట్లాడుతూ.. రెండు రాష్ట్రాలకు ఇంటర్‌బోర్డు ప్రతిపాదించిన మార్చి 11న ఫస్టియర్‌, 12న సెకండియర్‌ పరీక్షలు ప్రారంభించడానికి తాము సిద్ధంగా ఉన్నామని చెప్పారు. ఇరు రాష్ట్రాల్లో కలిపి దాదాపు 20 లక్షల మంది విద్యార్థులు ఇంటర్‌ పరీక్షలు రాయనున్నారని, అయితే పరీక్షలు ఎలా నిర్వహిస్తారన్న విషయమై వారిలో సందిగ్ధత నెలకొందని మంత్రి అభిప్రాయపడ్డారు. కామన్ షెడ్యూల్ట్ విషయంలో తెలంగాణ ప్రభుత్వం కూడా సానుకూలంగా స్పందించి అంగీకరిస్తుందన్న ఆశాభావాన్ని ఆయన వ్యక్తం చేశారు.  

అయితే గంటా శ్రీనివాసరావు ఇలా ప్రకటన చేసి 24 గంటలు కాకముందే తెలంగాణ మంత్రి జగదీశ్వర్ రెడ్డి తాము సొంతంగానే పరీక్షలు నిర్వహించుకుంటామని చెప్పారు. అంతేకాదు ఇంటర్ బోర్డు అధికారులు ఇదివరకు నిర్ణయించిన ప్రకారం కామన్ షెడ్యూల్ట్ మేరకు కాకుండా ప్రత్యేక షెడ్యూల్డ్ ప్రకారం పరీక్షలను నిర్వహిస్తామని చెప్పారు. ఈ మేరకు ఇంటర్ బోర్డు అధికారులకు ఆదేశాలు జారీ చేసినట్లు కూడా చెప్పారు. ఎట్టి పరిస్థితుల్లో ఇంటర్ పరీక్షలను ఉమ్మడిగా నిర్వహించే ప్రసక్తే లేదని తేల్చిచెప్పారు.

రెండు రాష్ట్ర ప్రభుత్వాల భిన్నమైన ప్రకటనలతో ఇంటర్ విద్యార్థులు గందరగోళంలోకి జారుకుంటున్నారు. పరీక్షల నిర్వహణ ఎప్పుడు, ఎలా జరుగుతుందోనని ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. కనీసం మూల్యాంకణం ఎలా జరుగుతుంది...? ఫలితాలు ఎప్పుడు విడుదల చేస్తారు...? ఈ ధఫా వచ్చే ఎంసెట్ పరీక్షలలో ఇంటర్ మార్కులను ఎలా కలుపుతారు...? పరీక్షా ఫలితాలలో జాప్యం వస్తే జాతీయ స్థాయి పరీక్షలకు తాము హజారుకాగలమా..? లేదా..? అన్న అనుమానులు రేకెత్తుతున్నాయి. వీరి అనుమానాలు ఇప్పటికై ప్రభుత్వాలు, ఇంటర్ బోర్డు అధికారులు నివృత్తి చేయాల్సిన అవసరం వుంది. విద్యార్థులను ప్రశాంతంగా పరీక్షలకు సిద్దం కావాలని, ఎలాంటి ఒత్తిడి పెట్టుకోవద్దని సూచించాల్సిన అవసరం వుంది.

జి.మనోహర్

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Other Articles