Bollywood stars fight on diabetes

bollywood stars fight on diabetes, fight on diabetes, diabetes treatment, diabetes symptoms, diabetes rate in india, diabetes latest updates, fawda khan diabetes, gaurav kapur diabetes, sonam kapoor diabetes, bolywood acters latest news updates

bollywood stars fight on diabetes : bollywood stars fawad khan, gaurav kapur, sonam kapoor were suffering from diabetes but they are fighting against this disease and inspiring others to do like them

మధుమేహంపై ఈ తారలు ఎలా పోరాడుతున్నారంటే

Posted: 11/15/2014 07:37 AM IST
Bollywood stars fight on diabetes

మధుమేహం దేశాన్ని మధుమేహ వ్యాధి పట్టిపీడిస్తోంది. ప్రపంచ మధుమేహ వ్యాధి రాజధానిగా కూడా భారత్ గుర్తించబడింది అంటే మన దేశంలో ఎంతలా ఈ వ్యాధి ప్రభావం ఉందో అర్ధం చేసుకోవచ్చు. ఇక 2010లో ఈ సంఖ్య 50.8 మిలియన్లుగా ఉంటే ప్రస్తుతం 65మిలియన్ల మంది ఈ వ్యాధితో బాధపడుతున్నారు. అంటే ఏటా వ్యాధిగ్రస్తుల సంఖ్య పెరుగుతోంది. మరొక ఆందోళనకర విషయం ఏమిటంటే గతంలో ముప్పైఐధేళ్లు పైబడిన వారికి వచ్చే మధుమేహం ప్రస్తుతం యువతకు కూడా వస్తోంది.

మారుతున్న జీవన పరిస్థితులతో పాటు, తినే ఆహారం, కుటుంబ నేపథ్యం ఇతర అంశాల వల్ల చిన్న వయస్సులోనే వచ్చేసి చనిపోయే వరకు మనిషిని నానా ఇబ్బందులకు గురి చేస్తోంది. ఇలా చిన్న వయస్సులోనే మధుమేహ బారిన పడ్డ పలవురు బాలీవుడ్ స్టార్స్ తమకు వచ్చిన వ్యాధిని చూసి బాధపడకుండా.., మహమ్మారిపై పోరాటం చేస్తున్నారు. ఇంతకీ వారెవరు... ఏం చేస్తున్నారు ఇప్పుడు చూద్దాం.

ఫవాద్ ఖాన్
పాకిస్థాన్ కు చెందిన నటుడు ఫవాద్ ఖాన్ ఈ మద్యే బాలీవుడ్ లో ఓ సినిమా చేశాడు. అయితే దురదృష్టవశాత్తు ఈయనకు 17ఏళ్ల వయస్సులోనే  టైప్1 షుగర్ వ్యాధి వచ్చింది. టైప్ 1 అంటే శరీరంలో నిరోధక శక్తి లోపించటం వల్ల కలిగుతుంది. దీనికి చేయవల్సిందల్లా వైద్యులు సూచించిన టాబ్లెట్స్ ను వాడటంతో పాటు ఇన్సులిన్ అదుపులో ఉంచుకునేందుకు డైట్ పాటించాలని చెప్తున్నాడు. ఎక్కువ పోషకాలు ఉండే కూరగాయలు తీసుకోవటం, తక్కువ ఫ్యాట్ ఉండే పాలు తాగటంతో పాటు తరుచుగా పోషకాహార నిపుణుడిని కలిసి సలహాలు తీసుకుంటానని చెప్తున్నాడు.

గౌరవ్ కపుర్

వీడియో జాకీ, నటుడిగా పరిచయం ఉన్న గౌరవ్ కపూర్ ను కూడా మధుమేహం వదిలి పెట్టలేదు. గత 12 సంవత్సరాలుగా ఈయనీ వ్యాధితో బాధపడుతున్నారట. ఈయన కూడా టైప్1 షుగర్ బాధితుడు. ఎక్కువగా ప్రయాణాలు చేసే గౌరవ్ కు జాగ్రత్తలు తీసుకోవటం చాలా కష్టం అవుతుంది. కాబట్టి వీలైనంత వరకు కొన్ని జాగ్రత్తలు తీసుకుంటానని చెప్తున్నాడు. రోజూ ఏడు గంటలు నిద్ర పోవటంతో పాటు, సమయానికి తినటం అయితే ఎక్కువగా తినకుండా విరామం ఇస్తూ కొంచెం కొంచెంగా ఆహారం తీసుకుంటానని చెప్తున్నాడు. వీటికితోడు వ్యాయామం మాత్రం తప్పకుండా చేస్తూ మాత్రలను కూడా మర్చిపోకుండా వేసుకుంటాడట.

సోనమ్ కపూర్

ఈ బాలీవుడ్ తారకు షుగర్ ఉన్నట్లు వార్తలు వచ్చాయి. అయితే వాటిని ఆమె తోసిపుచ్చింది. తనుకు మధుమేహం లేదు.. PCOD (Polycystic Ovarian Disease) అంటే శరీరంలో ఇన్సులిన్ శాతం ఎక్కువగా ఉన్నట్లు తెలిపింది. ఇది షుగర్ వ్యాధికి చేరువయ్యేందుకు సరిహద్దు రేఖ లాంటిది. ప్రస్తుతం ఈ రేఖపై ఉన్న సోనమ్.., షుగర్ రాకుండా చాలా జాగ్రత్తలు తీసుకుంటోంది. సరైన ఆహార నియమాలు పాటిస్తూ., తరుచుగా తన ఇన్సులిన్ శాతంను పరీక్షించుకుంటానని చెప్తోంది.

ఇలా బాలీవుడ్ స్టార్లు మధుమేహంపై తమ పోరాటం కొనసాగిస్తున్నారు. మీలో ఎవరైనా వ్యాధి బాధితులు ఉంటే మీరు కూడా ఉద్యమం మొదలు పెట్టండి. వ్యాధి లేకపోతే మాత్రం సంతోషించాల్సిన విషయమే కాని అప్రమత్తంగ ఉంటూ.., సరైన డైట్ పాటించటం మర్చిపోకండి. ఎందుకంటే ఒక్కసారి మధుమేహం వచ్చిందంటే.., దానికి నివారణే తప్ప, నిర్మూలన ఉండదు.

 

కార్తిక్

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : diabetes  bollywood  india  latest news  

Other Articles