India reaches breakthrough with u s on global trade pact

India, U.S, agreement, food stock holdings, trade deal, World Trade Organization, food security, development, permanent solution, Bali Agreement

India Reaches Breakthrough With U.S. on Global Trade Pact

ఆహార భద్రతపై భారత్, అమెరికాల కీలక ఒప్పందం

Posted: 11/14/2014 08:08 PM IST
India reaches breakthrough with u s on global trade pact

డబ్ల్యుటిఒలో సంపన్న దేశాల మొండి వైఖరిపై అలుపెరుగని పోరాటంలో భారత్‌ ఎట్టకేలకు విజయం సాధించింది. వర్థమాన దేశాల ఆహార నిల్వలపై సంపన్న దేశాల వైఖరిని నిరసిస్తూ భారత్‌ ధ్వజం ఎత్తడంతో డబ్ల్యుటిఒ చర్చల్లో ప్రతిష్టంభన ఏర్పడింది. ఆహార భద్రత విషయంలో ఏర్పడిన ఈ విభేదాలను పరిష్కరించుకుంటూ భారత్‌, అమెరికా ఒక అంగీకారానికి వచ్చాయి. దీంతో దీర్ఘకాలంగా పెండింగులో ఉన్న వాణిజ్య దోహద ఒప్పందం (టిఎఫ్‌ఎ) అమలుకు మార్గం సుగమం అయింది. భారత, అమెరికాల మధ్య తాజాగా కుదిరిన ఒప్పందం ప్రకారం ఆహార భద్రత విషయంలో డబ్ల్యుటిఒలో ఒక శాశ్వత పరిష్కారం సాధించే వరకు భారతదేశం ఎలాంటి అవరోధాలు లేకుండా ఆహార భద్రతా కార్యక్రమాలను కొనసాగించుకోవచ్చు.

బాలి ఒప్పందం ప్రకారం డబ్ల్యుటిఒ సభ్య దేశాలు ఏ ఇతర డబ్ల్యుటిఒ ఒప్పందాల వల్ల అయినా సవాలు ఎదుర్కొనే పరిస్థితి ఏర్పడితే వాటికి చట్టబద్ధమైన రక్షణ లభిస్తుంది. ఈ రక్షణ 2017 వరకు అమలులో ఉంటుంది. ఆహార భద్రత స్కీమ్‌ల అమలు కోసం ఆహార ధాన్యాల నిల్వలు నిర్వహించుకునే విషయంలో భారత్‌కు స్వేచ్ఛ ఇస్తూ ఒక ఒప్పందం కుదిరిందని, దీంతో టిఎఫ్‌ఎ అమలుకు మార్గం సుగమం అయిందని భారత వాణిజ్య/పరిశ్రమల శాఖ సహా య మంత్రి నిర్మలా సీతారామన్‌ తెలిపారు. ప్రధాని నరేంద్ర మోదీ సెప్టెంబర్‌లో అమెరికా పర్యటనలో జరిపిన ద్వైపాక్షిక చర్చలే ఈ ఒప్పందం కుదిరేందుకు మూలమని ఆమె అన్నారు.

ప్రధాని పర్యటన అనంతరం భారత్‌లో వాస్తవ పరిస్థితిపై అమెరికా యంత్రాంగంలో ఒక అవగాహన ఏర్పడిందని ఆమె చెప్పారు. గత జూలైలో బాలి సదస్సులో ఏర్పడిన ప్రతిష్టంభన తొలగిపోయి టిఎఫ్‌ఎ ముందుకు కదిలే అవకాశం ఏర్పడిందని అమెరికా వాణిజ్య ప్రతినిధి మైకేల్‌ ఫ్రోమాన్‌ అన్నారు. వ్యవసాయ సబ్సిడీల పరిమితిని మదింపు చేసే విధివిధానాల్లో అవసరమైన మార్పులు చేయడం వల్ల కనీస మద్దతు ధరలు చెల్లిస్తూ వ్యవసాయదారుల నుంచి ఆహారధాన్యాలు సేకరించి తక్కువ రేట్లకు పేదలకు ఆహారధాన్యాలు అందించగలుగుతామన్నది భారత్‌ వాదం. ప్రస్తుత డబ్ల్యుటిఓ నిబంధనల ప్రకారం మొత్తం ఆహారధాన్యాల ఉత్పత్తి విలువలో పది శాతం వరకు ఆహార సబ్సిడీలు ఉండవచ్చు. కాని ఈ మదింపునకు రెండు దశాబ్దాల నాటి ధరలను బెంచ్‌మార్క్‌గా తీసుకుంటున్నారు. దీని వల్ల భారత ప్రభుత్వం హామీ ఇచ్చిన ఆహర భద్రతా పథకాలు పూర్తి స్థాయిలో అమలు పరిచే నాటికి వాస్తవ విలువ ఈ పదిశాతం పరిమితి దాటిపోతుంది. అలా దాటితే డబ్ల్యుటిఓ నిబంధనల ప్రకారం పెనాల్టీ చెల్లించాల్సివస్తుంది.

జి.మనోహర్

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Other Articles