Gone in 12 minutes india pakistan wc tickets sold out

India vs Pakistan, 2015 Cricket World Cup, ICC World Cup, general Tickets, 12 minutes, sold out, Australia.

Gone in 12 minutes: India-Pakistan WC tickets sold out

హాట్ కేక్.. 12 నిమిషాల్లోనే అమ్ముడైన టిక్కెట్లు..!

Posted: 11/12/2014 11:59 PM IST
Gone in 12 minutes india pakistan wc tickets sold out

ఆ రెండు దాయాది దేశాలు అడుతున్నాయంటే చాలు అది ఏ ఆటైనా పోరు రసవత్తంగా వుంటుంది. ఆటను వీక్షించేందుకు ప్రేక్షకులు కూడా ఆసక్తి కనబరుస్తారు. మరి అదే క్రికెట్ అనుకోండి ఇసుకేసినా రాలనంత జనం వచ్చేస్తారు. అయితే అంత మంది జనాన్ని రానిస్తారా..? అనేగా మీ డౌట్.. కాదండి.. అంతలా జనం వస్తారని ఉదాహరణకు చెప్పాం. స్టేడియంలోని సీట్ల సంఖ్యను బట్టే అధికారులు టిక్కెట్లను విక్రయిస్తారు. అంతా చెబుతున్నారు ఇంతకీ ఎవరెవరకి మధ్య మ్యాచ్, ఎందులో క్రీడా విభాగంలో జరుగుతుంది అన్న సమాచారం చెప్పమంటారు అంతేగా..

దాయాది దేశాలు భారత్, పాకిస్థాన్ల జట్ల మధ్య క్రికెట్ మ్చాచ్ అంటే ఎంత క్రేజ్ అన్నది మాటల్లో చెప్పలేం. అదీ వరల్డ్ కప్ అయితే.. ఇక ఆ క్రేజ్ కు అది అంతమూ వుండదు. మరి ఈ మ్యాచ్ ను వీక్షించాలంటే టిక్కట్లు దోరుకుతాయా..? అసలు దోరకవ్.. నిజమండీ.. వచ్చే ఏడాది ఫిబ్రవరి 15న జరగనున్న వరల్డ్ కప్ లో భాగంగా అస్ట్రేలియాలోని అడిటైడ్ లో జరగనున్న భారత్, పాకిస్థాన్ క్రికెట్ మ్యాచ్ జనరల్ టిక్కెట్లను ఇవాళ విక్రయించారు. టిక్కెట్ బుకింగ్ ప్రారంభించిన 12 నిమిషాలలోనే టిక్కెట్లన్నీ అమ్ముడైపోయాయి. వేల సంఖ్యలో టిక్కెట్లు 12 నిమిషాలలో అమ్ముడవ్వడంతో దక్షిణ అస్ట్రేలియా ప్రభుత్వాధికారులు ఆశ్చర్యం వ్యక్తం చేశారు. భారత్, పాకిస్థాన్ మ్యాచులకు వున్న డిమాండ్ వారి నివ్వెరపర్చింది.

ఈ మ్యాచ్ ను వీక్షించేందుకు సుమారు 20 వేల మంది భారతీయులు అస్ట్రేలియాకు వస్తారని దక్షిణ అస్ట్రేలియా ప్రభుత్వ అంచనా వేస్తోంది. ఒవల్ లోని అడిలైడ్ లో జరగనున్న ఈ మ్యాచ్ కు కట్టుదిట్టమైన భద్రతను ఏర్పాటు చేసేందుకు ప్రభుత్వం ప్లాన్ చేస్తోంది. అయితే ఇవాళ ప్రారంభించిన టిక్కెట్ల విక్రయాలలో ఈ మ్యాచ్ కు సంబంధించి 50 వేల జనరల్ టిక్కెట్లనీ అమ్ముడయ్యాయని అధికారులు చెప్పారు,  అయితే క్రికెట్ అభిమానులు నిరాశ చెందాల్సిన అవసరం లేదని, హాలిడే, బిజినెస్ ప్యాకేజ్ లలో టిక్కెట్ల విక్రాయాలు జరపలేదని దక్షిణ అస్ట్రేలియా ప్రభుత్వాధికారులు చెప్పారు.

ఆడిలైడ్ లో తాము కొత్తగా నిర్మించిన స్టేడియంలో భారత్, పాకిస్థాన్ క్రికెట్ మ్యాచ్ తోనే అంకురార్సణ జరుగుతుండటం విశేషమన్నారు. ఈ శుభముహూర్తం ఎప్పుడు వస్తుందా అంటూ తాము ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్నామని పేర్కొన్నారు. ఈ మ్యాచ్ తో తమ స్టేడియం నిండుకుండాలా తలపిస్తుందన్నారు. ఎంతో మంది భారతీయ, పాకిస్థానీ క్రికెట్ అభిమానులు ఈ మ్యాచ్ ను వీక్షించేందుకు ఇక్కడకు రానున్నారని చెప్పారు. ముఖ్యంగా భారత్ నుంచి ప్రత్యేకంగా ఈ మ్యాచ్ వీక్షించేందుకు 20 వేల మంది అడిలైడ్ కు వస్తారని తాము అంచనా వేస్తున్నట్లు చెప్పారు.

2015 ఐసీసీ క్రికెట్ వరల్డ్ కప్ ప్రారంభమైన రెండో రోజు భారత్ పాకిస్థాన్ జట్లు తలపడనున్నాయని తెలిపారు. ఈ మ్యాచ్ కు అన్ని రకాల భద్రత, వీక్షకుల భద్రతలపై తమ ప్రభుత్వం దృష్టి సారించిందని చెప్పారు. ఈ గ్రౌండ్ నాలుగు మ్యాచులకు వేదిక కానుందని దక్షిణ అస్ట్రేలియా ప్రభుత్వఅధికారి తెలిపారు.

మనోహర్

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Other Articles