8 years old boy saved his sister in syria attacks becomes hero youtube views

syria attacks, 8 years boy syria hero, 8 years boy saved sister syria attaks, 8 years old hero syria attacks news, isis militants attacks, syria attacks news

8 years old boy saved his sister in syria attacks becomes hero youtube views

భేష్ బుడత! చెల్లికోసం బుల్లెట్లనే ఎదురించావ్...

Posted: 11/12/2014 08:30 PM IST
8 years old boy saved his sister in syria attacks becomes hero youtube views

సిరియాలో ఇప్పటికీ మారణహోమం జరుగుతున్న విషయం తెలిసిందే! ఈ మారణహోమంలో ఎంతోమంది చిన్నపిల్లలు తమ ప్రాణాలను కోల్పోయారు. వారిని రక్షించడానికి ఎవ్వరూ దిగిరాలేదు. అయితే తన చెల్లెలిని కాపాడటం కోసం ఎనిమిదేళ్ల బుడతను బుల్లెట్లను సైతం లెక్కచేయకుండా దూసుకెళ్లాడు. ఒకవైపు సైన్యం బుల్లెట్లు కాలుస్తుండగా.. ఈ బుడతడు సాహసంగా వాటిని ఎదుర్కొని తన చెల్లెలను కాపాడుకోగలిగాడు.

ఓ భవంతిని లక్ష్యం చేసుకుని సైన్యం భీకరంగా కాల్పులు జరుపుతోంది. ఆ భవనానికి ముందే కాలిపోయిన ఓ కారుమాటున ఒక పాప ఇరుక్కుపోయింది. వరుసగా కాల్పులు జరుగుతున్న నేపథ్యంలో అక్కడి నుంచి కదలలేక సాయంకోసం ఎదురుచూస్తోంది. ఎవరైనా తనను కాపాడుతారేమోనన్న ఆశతో అక్కడే వుండిపోయింది. ఇంతలోనే హీరోలా ఎనిమిదేళ్ల బుడతడు బుల్లెట్ల వర్షాన్ని సైతం లెక్కచేయకుండా దూసుకొచ్చాడు. అదే సమయంలో సైన్యం కాల్పులు జరుపగా.. అతడు కిందపడిపోయి చనిపోయినట్లుగా నటించాడు. దీంతో సైన్యం కాల్పులను ఆపేసింది. అంతే! ఆ అవకాశాన్ని అదునుగా తీసుకుని ఆ బుడతను అక్కడినుంచి లేచి... కారుమాటున వున్న తన చెల్లెలను తీసుకుని వెనక్కు వెళ్లిపోయాడు. అంతా నిముషం పాటు జరిగిపోయిన ఈ సంఘటనలో ఆ ఇద్దరూ పిల్లలు క్షేమంగానే బయటపడ్డారు.

ఈ వార్తను చదువుతుంటే అంతా సినిమాలో జరిగిన సన్నివేశంలా అనిపిస్తుంది కానీ.. ఇది నిజమైన కథ! ఏ విధంగా అయితే సినిమాల్లో తన చెల్లిని కాపాడుకోవడానికి హీరో గూండాలను లెక్కచేయకుండా ఫైట్ చేస్తాడో.. అదేవిధంగా ఈ బుడతడు బుల్లెట్ల వర్షాన్ని లెక్కచేయకుండా తన చెల్లిని కాపాడుకున్నాడు. ప్రపంచవ్యాప్తంగా రియల్ హీరోగా పేరు తెచ్చుకున్నాడు. సిరియాలో సోమవారం జరిగిన ఈ సంఘటనకు సంబంధించి వీడియోను యూట్యూబ్ లో అప్ లోడ్ చేయగా.. దాదాపు 19 లక్షలకు పైగా జనాలు వీక్షించారు.

AS

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : syria attacks  8 years boy syria hero  isis militants attack  telugu news  

Other Articles