Muslim only a muslim can become the chief minister of jammu and kashmir says pdp mla peerzada mansoor

muslim, chief minister, jammu and kashmir, peerzada mansoor, shanghan, Hindi, small parties, larger in number

muslim only a muslim can become the chief minister of jammu and kashmir says PDP MLA peerzada mansoor

ముస్లిం మాత్రమే ఇక్కడ ముఖ్యమంత్రి కావాలి..!

Posted: 11/13/2014 08:13 AM IST
Muslim only a muslim can become the chief minister of jammu and kashmir says pdp mla peerzada mansoor

దేశవ్యాప్తంగా అన్ని రాష్ట్రాల్లో బీజేపి హావా కోనసాగిస్తుంది. ఈ నేపథ్యంలో ఇప్పటి వరకు బీజేపి సొంతంగా అధికారానికి దూరంగా వున్న రాష్ట్రాల్లోనూ బీజేపి తన సత్తాను చాటుకుని అధికార పీఠాన్ని అధిరోహించింది. దీంతో త్వరలో రానున్న జమ్మూకాశ్మీర్, జార్ఖండ్ ఎన్నికలలోనూ బీజేపి ఎక్కడ తన సత్తాను చాటుకంటుందో.. అధికారాన్ని ఎక్కడ కైవసం చేసుకుంటుందోనని ఆందోళనకు గురవుతున్నారు ఆ నేత. ఆయన మరెవరో కాదు జమ్మూకాశ్మీర్ లోని షాంగన్ శాసనసభ్యుడు పీర్జదా మన్సూర్.. ఈ మేరకు ఆయన కార్యకర్తలు సమావేశంలో బహాటంగానే ప్రజలకు పిలుపునిచ్చారు..

జమ్మూకాశ్మీర్ లో ముస్లింలు అధికంగా వున్నారు కాబట్టి ఇక్కడ ముస్లిం నేతలే ముఖ్యమంత్రి పీఠాన్ని అధిరోహించాలని సంచలన వ్యాఖ్యలు చేశారు. జమ్మూకాశ్మీర్ లో కొన్నా పార్టీలు మతతత్వ పార్టీలతో కలసి కూటమి కట్టి హిందువును సీఎంగా చేయాలని ప్రయత్నాలు మొదలు పెట్టాయని వారి ఆశలకు గండి కోట్టాల్సిన సమయం అసన్నమైందన్నారు. బీజేపి జాతీయ ప్రధాన కార్యదర్శ రామ్ మాదవ్ ఇటీవల జమ్మూకాశ్మీర్ లో పర్యటించి.. చిన్న పార్టీల నేతలతో చర్చలు జరిపి జమ్మూకాశ్మీర్ ఎన్నికలలో విజయానికి ప్రణాళికలు రచించడంతో పీర్జదా మన్సూర్ ఈ వ్యాఖ్యాలు చేశారు.

ఇటీవల హర్యాన, మహరాష్ట్ర అసెంబ్లీ ఎన్నికలలో బీజేపి తొలిసారిగా అధికారన్ని చేజిక్కించుకని ప్రభుత్వాలను ఏర్పాటు చేసింది. దీంతో జమ్మూకాశ్మీర్ లో ముస్లింలు అధిక సంఖ్యలో వున్నారు కాబట్టి ఇక్కడు మహ్మదీయ సోదరులే ముఖ్యమంత్రి పీఠాన్ని అధిరోహించేలా ప్రజలు నిర్ణయం తీసుకోవాలని పిలుపునిచ్చారు. జమ్మూ కాశ్మీర్ అసెంబ్లీ ఎన్నికలలో మతతత్వ పార్టీలతో కలసి వచ్చే ఏ పార్టీకైనా ప్రజలు గుణపాఠం  చెప్పాలని సూచించారు. జమ్మూకాశ్మీర్  అసెంబ్లీ ఎన్నికల నేపత్యంలో ప్రధాని మంత్రి మోడీ అక్కడ పలు ర్యాలీలలో పాల్గొననున్నారు. దీంతో ఇక్కడ కూడా ప్రధాని ప్రసంగానికి, ఆలోచనా విధానాలకు ప్రజలు ఎక్కడ ఆ పార్టీకి అధికారాన్ని కట్టబెడతారోనని పిర్జాదా మన్సూర్ కు ఇప్పటి నుంచే గుండెల్లో రైళ్లు పరుగెడుతున్నాయట.

జి.మనోహర్

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Other Articles