Trs gangula kamalakar comments on tdp errabelli dayakar and revanth reddy

gangula kamalakar comments, gangula kamalakar on chandrababu naidu, gangula kamalakar on revanth reddy, trs leaders comments on tdp, revanth reddy latest comments, errabelli latest comments, telugu desam party latest, telangana latest news

gangula kamalakar comments on errabelli dayakar and revanth reddy : trs leader gangula kamalakar fires on tdp leaders errabelli dayakar and revanth reddy, says both are waste persons in party they are wondering at kcr house only for his appearance towards them

కేసీఆర్ ఇంటి చుట్టూ తిరుగుతున్న పుచ్చు వంకాయలు

Posted: 11/09/2014 01:05 AM IST
Trs gangula kamalakar comments on tdp errabelli dayakar and revanth reddy

తెలంగాణలో రాజకీయ పార్టీల మద్య మాటల యుద్దం అంటే టీడీపీ, టీఆర్ఎస్ మద్యే అని చెప్పాలి. విభజనకు ముందు నుంచి ఈ రెండు పార్టీల మద్య పచ్చగడ్డి నీళ్లలో నానబెట్టి వేసినా మండిపోయేంత వైరం ఉంది. పార్టీ అధినేత చంద్రబాబు మొదలుకుని టీడీపీ నేతలంతా కేసీఆర్, పార్టీని తిట్టేవారే. ఇక కేసీఆర్ సహా మిగతా గులాబీ నేతలంతా పసుపు రంగుపై విమర్శలు చేసేవారే. నిత్యం ఈ రెండు పార్టీలు పరస్పరం విమర్శించుంటున్నాయి. తాజాగా టీఆర్ఎస్ పై విమర్శలు చేస్తున్న తెలంగాణ టీడీపీ నేతలు ఎర్రబెల్లి దయాకర్ రావు, రేవంత్ రెడ్డి పై అధికార పార్టీ ఎమ్మెల్యే కమలాకర్ మండిపడ్డారు.

శనివారం మీడియాతో మాట్లాడిన గంగుల కమలాకర్, ఎర్రబెల్లి, రేవంత్ రెడ్డి టీడీపీలో పుచ్చిపోయిన వంకాయల వంటి వారు అని ఎద్దేవా చేశారు. వీరిద్దరిని ఏ పార్టీ కూడా చేర్చుకోదన్నారు. టీడీపీలో ఉన్న మంచి వంకాయలనే కేసీఆర్ తీసుకుని పుచ్చు కాయల్ని వదిలేశారని పరోక్షంగా ఇద్దరు నేతలపై విమర్శలు చేశారు. అయినా సరే వారిద్దరూ కేసీఆర్ ఇంటి చుట్టూ తిరుగుతున్నారని ఆరోపించారు. అయితే వీరి ప్రయత్నాలు ఫలించవు అని చెప్పారు. తెలంగాణ ప్రజలను గందరగోళంకు గురి చేసే విధంగా ఇద్దరు నేతలు అర్ధరహిత విమర్శలు చేస్తున్నారని మండిపడ్డారు.

త్వరలోనే తెలంగాణ ప్రజలు ఎర్రబెల్లి, రేవంత్ రెడ్డికి బుద్ది చెప్పటం ఖాయమని కమలాకర్ చెప్పారు. ఎర్రబెల్లి టీఆర్ ఎస్ లో చేరతారని ఆ మద్య తెగ ప్రచారం జరిగింది. అయితే పార్టీ వీడను అని ఆయన ప్రకటించారు. అటు తెలంగాణ ఏర్పడిన కొత్తలో రేవంత్ కూడా జెండా మారుస్తారు అని గుసగుసలు వచ్చాయి. అయితే అదేం లేదు అని తనకు ఆ ఉద్దేశ్యం కూడా లేదు అని ఆయన చెప్పారు. కాని తాజాగా కమలాకర్ వ్యాఖ్యలతో ఈ అంశం మరోసారి తెరపైకి వచ్చింది. ఇద్దరు నేతలు గులాబీ కండువా కోసం ప్రయత్నిస్తున్నారని కమలాకర్ అన్నారు. మరి ఈ ముగ్గురిలో ఎవరు నిజం చెప్తున్నారో వారికే తెలియాలి.

 

కార్తిక్

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : gangula kamalakar  revanth reddy  errabelli dayakar  latest news  

Other Articles