Union cabinet ministers new list

narendra modi latest, bandaru dattatreya latest minister, manohar parikar latest central minister, jp nadda central minister, central ministers list, union ministers new list, teugu ministers in union cabinet, latest news, sujana chowdary in union cabinet

central cabinet ministers new list : central or union cabinet expansion ministers list ready to announce on sunday. he stage is set for the first revamp of the Union Council of Ministers with about 15 members new one

ఫ్లాష్ : కాబోయే కేంద్రమంత్రులు వీళ్ళే

Posted: 11/08/2014 08:30 PM IST
Union cabinet ministers new list

కేంద్ర కేబినెట్ విస్తరణకు సమయం దగ్గరపడుతోంది. ఆదివారం మధ్యాహ్నం 1గంటకు జరిగే ఈ విస్తరణలో చోటు దక్కించుకునే వారు ఎవరో ఇప్పటికే ఖరారయింది. అయితే శాఖల కేటాయింపుపై తర్జనభర్జన జరుగుతోందని తెలుస్తోంది. ఆశావహుల్లో కేబినెట్ లోకి తీసుకునే వారి పేర్లతో పాటు, ఆశావహుల్లో ఎక్కువగా చాన్స్ ఉన్న వారు కూడా ఢిల్లీలో అందుబాటులో ఉండాలని ఆదేశాలు వెళ్ళాయి. ఈ పిలుపుతో నేతలంతా హస్తినకు చేరుకుంటున్నారు. ఈ జాబితాలో కొత్త ముఖాలు చాలావరకు ఉంటాయని చెప్తున్నారు.

ప్రధాని కార్యాలయ వర్గాల సమాచారం ప్రకారం, 20మంది కొత్త ముఖాలకు కేబినెట్ లో చోటు దక్కుతుందని తెలుస్తోంది. అటు శనివారం సాయంత్రం వరకు 16మంది బీజేపి ఎంపీలకు ప్రధాని కార్యాలయం నుంచి ఫోన్లు వెళ్ళాయని తెలుస్తోంది. దీంతో వీరంతా కుటుంబ సమేతంగా హస్తినకు పయనం అయ్యారు. ఇక బీజేపియేతర ఎంపీలను చూస్తే.., శివసేన, టీడీపీ నుంచి ముగ్గురికి మంత్రి పదవులు దక్కుతాయని తెలుస్తోంది. ప్రస్తుతం మహారాష్ర్ట అంశం ముడిపడి ఉండటంతో పాటు  చిరకాల ప్రయోజనాలు దృష్టిలో ఉంచుకుని శివసేనకు రెండు సీట్లు ఇచ్చి టీడీపీకి ఒక పదవి కేటాయిస్తుందని తెలుస్తోంది. దీంతో ఈ పదవి సుజనాచౌదరికి అని ఖాయమైంది. ఆయనకు ఈ మేరకు సమాచారం కూడా వచ్చింది. ఇక శివసేన నుంచి అనిల్ దేశాయ్ పేరు విన్పిస్తోంది. మరొకరు ఎవరనేది తెలియాల్సి ఉంది. అయితే శివసైనికులకు కూడా ఒకే పదవి కేటాయించే అవకాశమూ లేకపోలేదు.

ఇక తెలంగాణ బీజేపి నేత, సికింద్రాబాద్ ఎంపీ బండారు దత్తాత్రేయకు కూడా ఫోన్ వచ్చింది. ఈయన కుటుంబ సమేతంగా ఢిల్లీకి వెళ్ళారు. సదానందపై అసంతృప్తితో పాటు గతంలో రైల్వే శాఖ అనుభవం ఉండటంతో ఈ దఫా దత్తన్నకు ఏకంగా రైల్వే మంత్రి పదవి ఖాయంగా తెలుస్తోంది. మనోహర్ పారికర్ కు సీటు కన్ఫర్మ్ కావటంతో రెండ్రోజుల క్రితమే హస్తినకు వెళ్ళి పీఎంను కలిశారు. అంతేకాదు ఈయన ఇక ప్రభుత్వంలో నెంబర్ 3గా ఉంటారని సంకేతాలు వస్తున్నాయి. అటు ముస్లిం వర్గం నుంచి బీజేపీ నేతగా ఉన్న ముక్తార్ అబ్బాస్ నఖ్వీకి కూడా పదవి ఖాయమైంది. పంజాబ్ లోని హోసియర్ పూర్ ఎంపీ విజయ్ సంప్లా, జేపీ నడ్డా, అజయ్, యశ్వంత్ తనయుడు జయంత్ సిన్హా, హర్యానాకు చెందిన వీరేంద్ర సింగ్, బీహార్ కు చెందిన గిరిరాజ్ సింగ్, రాజస్థాన్ కు చెందిన సోనరామ్ చౌదరి, గజేంద్ర సింగ్, మహారాష్ర్టకు చెందిన హంసరాజ్; ఛత్తీస్ గఢ్ నుంచి రమేష్ బియాస్ విస్తరణలో చోటు దక్కించుకున్న కేంద్ర మంత్రుల జాబితాలో ఉన్నట్లు సమాచారం.

ఈ జాబితా దాదాపు ఖరారు అయినట్లు సమాచారం. అయితే చివరి నిమిషంలో స్వల్ప మార్పులు కూడా ఉండవచ్చు. ఇక పదవుల కేటాయింపుకు సంబంధించి స్పష్టత రావాల్సి ఉంది. ఎంపికైన వారిలో చాలామంది వరకు సుధీర్ఘ రాజకీయ నేపథ్యం, పార్టి పట్ల అంకిత భావం, మంచితనం ఇలా ఏదో ఒక అంశం ఆధారంగా పదవి పొందిన వారే ఉన్నారు. అయితే రాజకీయ సమీకరణాలు, కూటమి పాలన వల్ల మిత్రపక్షాలకు కేటాయించిన పదవుల్లో పార్టీల నాయకత్వాలు చెప్పిన వ్యక్తులకు ఇవ్వక తప్పటం లేదు. మోడి ప్రభుత్వంపై దేశ ప్రజలు చాలా ఆశలు పెట్టుకున్నారు. జనాల ఆకాంక్షలకు తగ్గట్లే పాలన జరుగుతుంది అని భావించవచ్చు. అయితే కొత్తగా వస్తున్న కేబినెట్ మంత్రులు ఏ మేరకు ప్రజల ఆకాంక్షలు నెరవేరుస్తారో చూడాలి.

 

కార్తిక్

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : dattatreya  modi  central cabinet  latest news  

Other Articles