Angelina jolie interested to join in politics

Angelina Jolie, politics, holly wood, politics, serve people, Oscar award winner

angelina jolie interested to join in politics..

రాజకీయాల్లో చేరి ప్రజాసేవ చేస్తానంటున్న సినీ నటి..

Posted: 11/06/2014 12:46 PM IST
Angelina jolie interested to join in politics

కాస్తంత పాపులారిటీ వచ్చిందంటే చాలు చక చక రాజకీయాల్లోకి చేరిపోయి.. ఓ మంత్రి పదవిని అలంకరించి.. అవసరం వున్నా.. లేకున్నా.. హడావిడి చేస్తూ.. ప్రజలకు సేవ చేయాలనుకుంటారు ప్రముఖులు. అయితే ఇలాంటి ప్రముఖులు ముఖ్యంగా మన దేశంలోనే అధికంగా కనబడుతుంటారు. కానీ విదేశాల్లో అయితే రాజకీయ అవతారమెత్తిన ప్రముఖులు తక్కువ సంఖ్యలో వున్నారు. అందుకనే నేమో ఇప్పుడు ప్రముఖ హాలీవుడ్ నటి కూడా రాజకీయాల బాట పట్టనున్నారు. అవిడ  ఎవరని అనుకుంటున్నారా..?

అవిడే.. ఆస్కార్ విజేత ఏంజలీనా జోలీ. సినామాల్లో నటించి నటించి బోర్ కోట్టిందేమో ఈ అమ్మడు దృష్టి రాజకీయాలపై గాలి మళ్లింది. ఈ విషయాన్ని ఆమే స్వయంగా ఓ మ్యాగజైన్‌కు ఇచ్చిన ఇంటర్వ్యూలో వెల్లడించారు. మానవతావాదిగా, ఐక్యరాజ్య సమితి ప్రత్యేక రాయబారిగా ప్రపంచవ్యాప్తంగా ఎన్నో చారిటీ సంస్థలకు సహాయ సహకారాలు అందిస్తున్న తాను ఇక రాజకీయ రంగం ప్రవేశం చేసిన ప్రజలకు సేవ చేయాలనుకుంటున్నారట..  తాను చేపడుతున్న మానవతావాద కార్యక్రమాలే రాజకీయాలపై తన ఆసక్తిని పెంచాయని ఏంజలీనా తెలిపారు. రాజకీయాలను కెరీర్‌గా ఎంచుకుంటారా? అన్న ప్రశ్నికు, అందుకు తాను సుముఖంగానే ఉన్నట్లు తెలిపారు.

మానవతావాదిగా పనిచేసేవారు, సమాజంలో సమూల మార్పులు తీసుకురావాలనుకునే వారు రాజకీయాలలోకి రావాలని అనుకుంటారన్నారు.  అయితే తన రాజకీయ ఆకాంక్షకు సినీ కెరీర్ అవరోధం కావచ్చన్న అభిప్రాయాన్ని ఆమె వ్యక్తం చేశారు.  సమాజంలో తాను ఏ పాత్రను పోషించడం ద్వారా  మరింత ప్రయోజనం చేకూర్చగలనో తనకైతే ఇప్పటికి తెలియదన్నారు. అయితే  తన సినీ కేరీర్ వల్ల తన ఆకాంక్ష సాధ్యమయ్యే అవకాశం తక్కువగా ఉందని మాత్రం ఆమె పేర్కొన్నారు.

జి. మనోహర్

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : Angelina Jolie  politics  holly wood  politics  serve people  oscar award winner  

Other Articles