India tops facebook s content restriction list

Facebook's control, india top, hate content, Turkey, Pakistan, Facebook, India, ranked second, US, America, government, users and accounts.

Facebook has restricted access to nearly 5,000 pieces of information on its website in India in the first six months of 2014

ఫేస్ బుక్ కంటెంట్ నియంత్రణలో భారత్ దే అగ్రస్థానం..

Posted: 11/06/2014 10:43 AM IST
India tops facebook s content restriction list

సోషల్ నెట్‌వర్కింగ్ సైటు ఫేస్‌బుక్‌లోని కంటెంట్‌ను అత్యధికంగా నియంత్రిస్తున్న దేశాల్లో భారత్ అగ్రస్థానంలో నిలించింది. భారత ప్రభుత్వ, ఇతర ఏజెన్సీల విజ్ఞప్తి మేరకు ఈ ఏడాది ప్రథమార్ధంలో దాదాపు 5,000 అంశాలకు సంబంధించిన సమాచారంపై ఫేస్‌బుక్ ఆంక్షలు విధించింది. దీంతో ఫేస్ బుక్ లోని దాదాపు 5 వేల అంశాలను ఇతరులు చూడడానికి వీలు లేకుండా ఆంక్షలు విధించింది. ఇది ఇతర దేశాలకంటే అధికం. సోషల్ మీడియాలో విద్వేషపూరిత కంటెంట్‌ను నియంత్రించాలనే ఉద్దేశంతో ప్రభుత్వం, భద్రతా ఏజెన్సీల ఆదేశాలతో ఈ చర్యలు తీసుకున్నట్లు  ఫేస్‌బుక్ ఒక నివేదికలో పేర్కొంది.

వంద మిలియన్ల ఖాతాదారులున్న ఫేస్‌బుక్‌కు యూఎస్ తర్వాత భారతదేశమే ఎక్కువ మంది ఖాతాదారులున్న దేశం. దీనిని ఆసరాగా చేసుకుని అరాచక శక్తులు కుట్రలు పన్నకుండా ఫేస్ బుక్ లో వచ్చే అంశాలను ఎప్పటికప్పుడు భారత ప్రభుత్వం నియంత్రిస్తూ వస్తుంది. సామాజిక వైబ్ సైట్ లను ఆధారంగా చేసుకుని తొలినాళ్లలో జరిగిన విష ప్రచారాలను దృష్టిలో పెట్టుకని భారత ప్రభుత్వం ఎప్పటికప్పుడు వెబ్సైట్ లలో తప్పుడు ప్రచారాలను నియంత్రించాలని ఫేస్ బుక్ ను కోరుతూనే వస్తుంది. మతాలు, ప్రభుత్వాలను విమర్శించే విధమైన కంటెంట్‌పై భారత చట్టాల ప్రకారం నిషేధం ఉన్నట్లు వివరించింది. దరిమిలా.. ఎలాంటి సంఘవ్యతిరేక కార్యక్రమాలకు, విధ్వంస రచనలకు ఆస్కారం వుండకుండా చర్యలు తీసుకంటూ వస్తోంది.

ఇక అత్యధికంగా ఆంక్షల విజ్ఞప్తులు చేసిన భారత్ తరువాతి దేశాల్లో టర్కీ (1,893), పాకిస్థాన్ (1,773) ఉన్నాయి. మరోవైపు, అత్యధిక సంఖ్యలో యూజర్లు, వారి అకౌంట్లకు సంబంధించిన వివరాలు ఇవ్వాలంటూ కోరిన దేశాల్లో అమెరికా అగ్రస్థానంలోనూ, భారత్ రెండో స్థానంలో ఉన్నాయి. భారత ప్రభుత్వం నుంచి జనవరి-జూన్ 2014 మధ్య కాలంలో 5,958 మంది యూజర్లు, వారి అకౌంట్ల వివరాలు ఇవ్వాలంటూ 4,559 విజ్ఞప్తులు వచ్చినట్లు ఫేస్‌బుక్ తన నివేదికలో వెల్లడించింది.

జి.మనోహర్

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Other Articles