Narendra modi to expand his ministry in november second week

Narendra Modi, Manohar Parrikar, Jayant Sinha, Pranab Mukherjee, cabinet Expansion, Prime minister, May 26th, Nirmala Sitharaman, Prakash Javadekar

narendra modi to expand his ministry in November second week

ఈ నెల రెండోవారంలో కేంద్ర మంత్రివర్గ విస్తరణ..?

Posted: 11/06/2014 03:34 PM IST
Narendra modi to expand his ministry in november second week

ఎప్పుడెప్పుడా అని ఎదురుచూస్తున్న ముహూర్తం మరి కొద్దిరోజుల్లోనే రానుంది. మే 26న దేశ 26వ ప్రధానిగా నరేంద్రమోడీ ప్రమాణస్వీకారం చేసిన రోజునే అయనతో పాటు కొందరు సీనియర్లకు మంత్రి పదవులు వచ్చాయి. ఆ తరువాత మరికొందరికి  కేంద్ర క్యాబినెట్ లో అవకాశం లభిస్తుందని ఆశగా ఎదురు చూస్తున్న ఎంపీలకు ఆరు నెలలు గడిచినా.. ఇంకా ముహుర్తం ఖరారు కాలేదని ప్రధానమంత్రి వర్గాలు స్పష్టం చేశాయి. కేంద్ర మంత్రివర్గ విస్తరణ ఎప్పడా అంటూ.. సీనియర్ ఎంపీలు, కేంద్ర మాజీ మంత్రులు సైతం ఎదురుచూస్తున్నారు.

అయితే.., కేంద్ర మంత్రివర్గాన్ని ప్రధాని నరేంద్రమోడీ విస్తరిస్తున్నారనే వార్తలు దేశ రాజధానిలో జోరందుకున్నాయి.  కేంద్రమంత్రి వర్గ విస్తరణపై చర్చించేందుకు రాష్ట్రపతి ప్రణబ్ ముఖర్జీని ప్రధాని మోడీ కలవనున్నారు. వచ్చే సోమవారం మంత్రివర్గ విస్తరణ చేసే అవకాశం ఉందని కూడా తెలుస్తోంది. మనోహర్ పారికర్ తోపాటు, హర్యానా అసెంబ్లీ ఎన్నికల ముందు కాంగ్రెస్ నుంచి బీజేపీలోకి వచ్చిన జాట్ వర్గానికి చెందిన బిరేంద్ర సింగ్, మహారాష్ట్ర నుంచి హన్స్ రాజ్ ఆహిర్, బీహార్ కు చెందిన గిరిరాజ్ సింగ్, యశ్వంత్ సిన్హా కూతురు జయంత్ సిన్ఫాలకు  కేంద్రమంత్రి వర్గంలోకి తీసుకునే అవకాశాలున్నాయి.
 
ఇటు తెలంగాణ నుంచి ప్రాతినిత్యం వహిస్తున్న ఎంపీ, బండారు దత్తాత్రేయ కూడా బెర్త్ కన్షామ్ అయినట్లు సమాచారం. ఈ నేపథ్యంలో ఇప్పటికే మనోహర్ పారికర్ కు కేంద్ర రక్షణ శాఖ కట్టబెడుతున్నారంటూ వార్తలు మీడియాలో హల్ చల్ చేశాయి. దీంతో కూపీ లాగితే..మొత్తం సమాచారం బయటపడింది. ప్రధానమంత్రి తన క్యాబినెట్ లోకి పరిపాలనానుభవం గలవారితో పాటు దూసుకెళ్లగల యువతను అవకాశం కల్పించనున్నట్లు సంకేతాలు అందుతున్నాయి. మరోవైపు కేంద్ర మంత్రివర్గ విస్తరణ నేపథ్యంలో ప్రకాష్ జవదేకర్, నిర్మలా సీతారామన్లకు ప్రమోషన్లు రావొచ్చనే ఊహాగానాలు వినిపిస్తున్నాయి. జవదేకర్తో పాటు నిర్మలా సీతారామన్లను మోదీ కేబినెట్లోకి తీసుకోనున్నట్లు సమాచారం.  కేంద్ర వాణిజ్య, పరిశ్రమల శాఖ సహాయ మంత్రిగా నిర్మలా,  కేంద్ర సమాచార, ప్రసారాల శాఖ సహాయ మంత్రిగా ప్రకాష్ జవదేకర్ బాధ్యతలు నిర్వహిస్తున్నారు. మోదీ వారణాసి పర్యటన అనంతరం నవంబర్ 7-11 తేదీల మధ్యలో మంత్రివర్గ విస్తరణకు తుదిరూపు ఇస్తారని ఢిల్లీ వర్గాల సమాచారం.

జి.మనోహర్

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Other Articles