Another cyclone threat to coastal region of andhra pradesh

another, cyclone, Cyclone Hudhud, Visakhapatnam, Bay of Bengal, Andhra Pradesh, Tamilnadu, Vishakapatnam, vishaka meteorlogical depatment, rains

another cyclone threat to coastal region of Andhra Pradesh

కోస్తాంధ్రను పొంచి వున్న మరో తుపాను ముప్పు..

Posted: 11/02/2014 10:27 AM IST
Another cyclone threat to coastal region of andhra pradesh

బంగాళాఖాతంలో ఏర్పడిన హుదుద్ తుపాను పెనుతుపాను మిగిల్చిన గాయాలను నుంచి ఇంకా తేరుకోని కోస్తాంత్ర తీర ప్రజలపై ప్రకృతి మరోమారు పంజా విసిరేందుకు  సిద్దంగా వుంది. ఆగ్నేయ బంగాళాఖాతంలో రెండు రోజుల్లో అల్పపీడనం ఏర్పడి.. తుపానుగా మారే అవకాశం ఉందని విశాఖలోని తుపాను హెచ్చరికల కేంద్రం, హైదరాబాదులోని వాతావరణ కేంద్రం అధికారులు అంచనా వేస్తున్నారు. నైరుతి బంగాళాఖాతంలో శుక్రవారం ఉపరితల ఆవర్తనాలు ఉద్ధృతంగా ఉండడంతో అల్పపీడనం ఏర్పడే అవకాశం ఉందని తొలుత వెల్లడించారు.

అయితే ఉపరితల ఆవర్తనాలు బలహీనపడడంతో అల్పపీడనం ఏర్పడే అవకాశం లేదని శనివారం తేల్చి చెప్పిన అధికారులు మరో బాంబు పేల్చారు. ఆగ్నేయ బంగాళాఖాతంలో మాత్రం అల్పపీడనం ఏర్పడడానికి, అది బలపడి తుపానుగా మారడానికి అక్కడి వాతావరణం అత్యంత అనువుగా ఉన్నట్లు గుర్తించారు. ఆంధ్రప్రదేశ్‌లోని దక్షిణ కోస్తా, ఉత్తర తమిళనాడు పరిసరాల్లో అల్పపీడన ద్రోణి ఏర్పడినందున ఆంధ్రప్రదేశ్‌లో పలుచోట్ల ఆదివారం రాత్రి వరకు చెదురుమదురు వర్షాలు కురిసే అవకాశం ఉందని తెలిపారు.

రాగల 24గంటల్లో ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాష్ట్రాల్లో అక్కడక్కడా చెదురుమదురు వానలు కురిసే అవకాశం ఉందిన అధికారులు తెలిపారు. నైరుతి బంగాళాఖాతం నుంచి ఉత్తర తమిళనాడు మీదుగా దక్షిణ కోస్తాంధ్ర వరకు అల్పపీడన ద్రోణి కొనసాగుతోంది. దీని ప్రభావం వల్ల దక్షిణ కోస్తాలో కొన్ని చోట్ల, రాయలసీమ, ఉత్తర కోస్తా, తెలంగాణల్లో అక్కడక్కడా చెదురుమదురు వానలు కురిసే అవకాశం ఉంది.

మరోవైపు తెలుగు రాష్ట్రాల్లో పగటిపూట ఎండలు ఠారెత్తిస్తుండగా, రాత్రిపూట చలి వణికిస్తోంది. తెలంగాణలో సాధారణం కంటే 4, కోస్తాంధ్రలో 3, రాయలసీమలో 2 డిగ్రీల కనిష్ఠ ఉష్ణోగ్రతలు నమోదవుతున్నాయి. గడిచిన 24గంటల్లో మెదక్, ఆదిలాబాద్‌లలో కనిష్ఠంగా 15డిగ్రీల ఉష్ణోగ్రతలు నమోదవ్వటం గమనార్హం. ఈశాన్య దిశ నుంచి గాలులు వీస్తున్నందున క్రమంగా రాత్రిపూట కనిష్ఠ ఉష్ణోగ్రతలు మరింత తగ్గుముఖం పట్టే అవకాశముంది. దీని వల్ల చలిపులి మరింత వూపందుకోనుందని అధికారులు అంచనావేస్తున్నారు.

జి.మనోహర్

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Other Articles