India dialy posted a cartoon on antares rocket blast which is reply to america cartoon

mangalyan mission, antares rocket blast, america cartoon, india cartoons, rocket blast cartoon, mangalyan cartoon, india vs america, india america cartoon war

india dialy posted a cartoon on antares rocket blast which is reply to america cartoon

అమెరికా - భారత్ ల మధ్య కార్టూన్ వార్!

Posted: 11/01/2014 09:33 PM IST
India dialy posted a cartoon on antares rocket blast which is reply to america cartoon

ఇటీవలే భారత్ కు చెందిన ఇస్రో శాస్త్రవేత్తలు అంగారకుడి గ్రహంమీద ‘‘మంగళ్ యాన్’’ మిషన్ ను విజయవంతంగా పూర్తి చేసిన విషయం తెలిసిందే! అయితే ఆ విషయం మీద అమెరికాలో వుండే ఓ వార్తపత్రిక కాస్త వెటకారాన్ని జోడించి భారతీయ మనోభావాలు దెబ్బతినేలా సంచలనం సృష్టించిన విషయం గుర్తు వుండేవుంటుంది. ఆ కార్టూన్ ప్రకారం.. ‘‘ఎలైట్ స్పేస్ క్లబ్’’ అంటూ మేధావులు వుండే క్లబ్ లోకి పంచెకట్టు, తలపాగాతో వున్న ఓ భారతీయుడు తనతోపాటు ఆవును వెంటబట్టుకుని వస్తున్నట్లుగా వుంటుంది. ఈ కార్టూన్ ను ప్రచురించిన మరుక్షణమే దీనిపై చాలా రాద్ధాంతమే జరిగిపోయింది. అయితే ఆ పత్రికవారు భారతీయుల్ని కించపరచడం కాదని.. తమ ప్రతిభను గొప్పగా తెలియపరుస్తూ ఇలా కార్టూన్ ప్రచురించడం జరిగిందని.. తమవల్ల తప్పు జరిగివుంటే క్షమించాలంటూ కోరుకుంది కూడా! దాంతో ఆ వివాదం ప్రశాంతంగా మారిపోయింది.

hindustan-times-antares-roc

ఇదిలావుండగా.. తాజాగా నిన్న అమెరికా ఒక మానవరహిత రాకెట్ ‘‘అంతారేస్’’ను ప్రయోగిస్తుండగా.. అది ఎగిరిగిన మరోక్షణమే పేలిపోయింది. అది పేలిందో.. లేదో.. వెంటనే వార్తలమీద వార్తలు ప్రపంచవ్యాప్తంగా వ్యాప్తి చెందాయి. ఆ విషయాలను కాస్త పక్కనపెడితే.. ఆ రాకెట్ పేలిపోయిన విషయంమీద భారత్ లోని ఓ ప్రముఖ దినపత్రిక అమెరికా ప్రచురించిన కార్టూన్ తరహాలోనే వారికి సమాధానంగా ఒక కథనాన్ని ప్రచురించింది. ఆ కథనం ప్రకారం... ఎలైట్ స్పేస్ క్లబ్ లు వుండే అమెరికావారు ప్రయోగించిన రాకెట్ పేలిపోవడానికి ఒక ఇస్రో ఛైర్మన్ చూస్తూ.. ‘‘మనకు రాకెట్ సైన్స్ అంటే ఇది కాదు’ అంటూ వ్యాఖ్యానిస్తున్నట్లుగా కార్టూన్ వేశారు. వచ్చిన అవకాశాన్ని వదులుకోకుండా తన భారతీయ దినపత్రిక అమెరికాకు సమాధానమిస్తూ ఇలా కార్టూన్ ను ప్రచురించడాన్ని ప్రముఖులందరూ విశేషంగా భావిస్తున్నారు.

AS

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : mangalyan mission  antares rocket blast  america news  india cartoons  telugu news  

Other Articles