Krishna river management board discharged the wishes again darkness may prevail in telangana

Krishna river management board, discharge, wishes of Telangana, Darkness, prevails, Telangana, AP government, telangana government, irrigation, water

Krishna river management board discharged the wishes.. again Darkness may prevail in Telangana ..

తెలంగాణ ఆశలకు గండి.. మళ్లీ అంధకారమేనా..?

Posted: 11/01/2014 09:29 PM IST
Krishna river management board discharged the wishes again darkness may prevail in telangana


శ్రీశైలం జలాల నుంచి నవంబర్ 2వ తేదీలోపు విద్యుత్ ఉత్పత్తికి మూడు టీఎంసీల నీటిని మాత్రమే వాడుకోవాలని కృష్ణా రివర్ యాజమాన్య బోర్డు తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వాన్ని ఆదేశించడంతో తమకు న్యాయం జరుగుతుందన్నకున్న తెలంగాణ ప్రజల ఆశలకు గండి పడింది. ఇప్పటికే తీవ్ర విద్యత్ సంక్షోభంలో కొట్టుమిట్టాడుతున్న తెలంగాణలో ఇక మళ్లీ అంధకార చీకట్లు అలుముకోనున్నాయి. పంటలకు నీరు లేక, బోర్లు వున్నా కరెంటు లేక అల్లలాడుతున్న రైతులు ప్రాణాల త్యజిస్తున్నా.. వాటిని కృష్ణా రివర్ యాజమాన్య బోర్డు పరిగణలోకి తీసుకోలేందు. ప్రస్తుతానికి మూడు టీఎంసీల నీటిని మాత్రమే వినియోగించుకోవాలని తన నిర్ణయాన్ని వెలిబుచ్చింది. అవసరమైతే నవంబర్ 15 తరువాత మరోమారు సమీక్షిస్తామని తెలిపింది.

 రెండు రాష్ర్టాల వాదనలు, శ్రీశైలం రిజర్వాయర్‌లో ఉన్న నీటి నిల్వ, దీర్ఘకాలిక ప్రాతిపదికన శ్రీశైలం, నాగార్జునసాగర్‌లలో సమగ్ర ఆపరేషన్ పద్ధతులు, ప్రస్తుతం ఉన్న విద్యుత్, నీటి అవసరాలను దృష్టిలో ఉంచుకుని ఈ ఆదేశాలు జారీచేస్తున్నట్లు బోర్డు తెలిపింది. 2వతేదీలోపు విద్యుత్ డిమాండ్ కూడా తగ్గుముఖం పడుతుందని పేర్కొంది. శ్రీశైలంలో విద్యుత్ ఉత్పాదనకు సంబంధించి తెలంగాణ, ఏపీల మధ్య నెలకొన్న వివాదంపై సమావేశాలు నిర్వహించిన బోర్డు.. రెండు రాష్ర్టాల వాదనలు విన్న అనంతరం ఈ మేరకు తన నిర్ణయాన్ని ప్రకటించింది. అవసరమైతే నవంబర్ 15 తరువాత మరోసారి కూడా ఈ అంశాన్ని సమీక్షిస్తామని పెర్కొంది.

ఇతర అవసరాలకంటే తాగు, సాగునీటికి మొదటి ప్రాధాన్యం ఇవ్వాలని, ఆ మేరకు తెలంగాణ ప్రభుత్వానికి సూచించాలని గత నెల 21న ఏపీ ప్రభుత్వంనుంచి వచ్చిన నోట్ ప్రకారం కృష్ణా నదీ నిర్వహణ బోర్డు తెలంగాణ ప్రభుత్వానికి లేఖ ఇచ్చింది. ఇదే తరుణంలో సాగునీటి అవసరాలకు సమానంగా విద్యుత్ ఉత్పాదనను కూడా పరిగణించాల్సిన అవసరముందని, ముఖ్యంగా ఏపీ ప్రభుత్వం తమకు రావాల్సిన కరెంటు వాటాను ఇవ్వని దరిమిలా ఇది మరింత కీలకమని తెలంగాణ ప్రభుత్వం స్పష్టం చేసింది. ఈ నేపథ్యంలో బుధ, గురువారాల్లో రెండు పర్యాయాలు ఇరు రాష్ట్ర అధికారులతో సమావేశమైన కృష్ణా రివర్ యాజమాన్య బోర్డు.. ఎటూ తేలకుండానే ముగిసింది.

రెండు రాష్ట్రాల అభిప్రాయాలు విన్నాక శ్రీశైలం రిజర్వాయర్‌లో నిల్వలను పరిగణనలోకి తీసుకొంటున్నామని బోర్డు తెలపింది. శ్రీశైలం- సాగర్ సమీకృత నిర్వహణకు సంబంధించి విధానాల రూపకల్పన పెండింగ్‌లో ఉన్నందున తక్షణ నీరు, విద్యుత్తు అవసరాల రీత్యా శ్రీశైలంలో నవంబరు 2 వరకు విద్యుదుత్పత్తికి నీటిని వినియోగించుకోవాలి. ఈ వినియోగం మూడు టీఎంసీలకు మించరాదన స్పష్టం చేసింది. ఆ తర్వాత విద్యుత్తు డిమాండ్ తగ్గుముఖం పడుతుంది. అవసరమైతే నవంబరు 15 తర్వాత దీనిపై మళ్లీ సమీక్షిస్తాం. దీనిని బోర్డు ఛైర్మన్ ఆమోదంతో జారీ చేస్తున్నామని, అమలు చేయాలని బోర్డు సభ్య కార్యదర్శి ఆర్.కె.గుప్తా పేర్కొన్నారు.దీంతో బోర్డు అధికారులు ఈ మేరకు అదేశాలు జారీ చేశారు.

3 టీఎంసీలు మాత్రమే కేటాయించడం అనైతికం

 శ్రీశైలంలో విద్యుత్ ఉత్పత్తి విషయంలో కృష్ణానది యాజమాన్య బోర్డు ఇచ్చిన తీర్పు పూర్తిగా ఏకపక్షంగా ఉందని రాష్ట్ర భారీ నీటిపారుదలశాఖ మంత్రి తన్నీరు హరీశ్‌రావు ఆక్షేపించారు. బోర్డు తన పరిధిలోకి రాని అంశాలపై నిర్ణయం తీసుకోవడం అనైతికమని అన్నారు. బోర్డు తీర్పుపై న్యాయనిపుణులతో చర్చిస్తున్నామని, తెలంగాణ న్యాయమైన హక్కుల కోసం న్యాయపోరాటానికి సిద్ధంగా ఉన్నామని హరీశ్ ప్రకటించారు. బోర్డు నిర్ణయంపై హరీష్ రావు నిప్పులు చెరిగారు. నీటి పంపకం బోర్డు పరిధిలోకి రాదని, అది ట్రిబ్యునల్ చేయాల్సిన పని అని తేల్చిచెప్పారు. బోర్డు తన పరిధిని దాటి వ్యవహరించిందని మండిపడ్డారు. కేవలం ఒప్పందాలను అమలుపరచడం వరకే బోర్డు పని అని గుర్తు చేశారు. బోర్డు ఇచ్చిన తీర్పుపై మరోసారి ఫిర్యాదు చేస్తామని హరీశ్ చెప్పారు. కేంద్ర ప్రభుత్వంపై ఏపీ సర్కారు ఒత్తిడి తెచ్చి, తీర్పు ఏకపక్షంగా వచ్చేలా చేసిందని మంత్రి హరీశ్‌రావు ఆగ్రహం వ్యక్తంచేశారు. ఏపీ ప్రభుత్వంతోపాటు తెలంగాణ ప్రభుత్వంకూడా బోర్డుకు ఫిర్యాదు చేసిందని, అయితే ఏపీ ఫిర్యాదు చేసిన 48గంటల్లో తీర్పు ఇచ్చిన బోర్డు తెలంగాణ ప్రభుత్వం చేసిన ఫిర్యాదును మాత్రం పట్టించుకోలేదని మండిపడ్డారు.

జి.మనోహర్

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Other Articles