Liquor carrying vehicle turns around villagers rush to collect bottles

liquor, liquor carrying vehicle, turns updown, villagers, collect, bottles, uttarpradesh, barelli, bypass road, police

liquor carrying vehicle turns around. villagers rush to collect bottles

‘బీరు’ లారీ బోల్తా.. గ్రామాస్థులకు పండగ..

Posted: 11/01/2014 05:16 PM IST
Liquor carrying vehicle turns around villagers rush to collect bottles

ఇల్లు కాలిపోయిందని ఒకడు ఏడుస్తుంటే… చుట్టకు నిప్పిస్తారా అని అడిగారని సామెతను వింటే.. ఇలాంటి వాళ్లు వుంటారా అన్న అనుమానం కలుగుతుంది. కానీ ఇక్కడ నిజంగానే ఉన్నారు. ఎక్కడ అంటారా..?  ఉత్తరప్రదేశ్ లో అంత ఖచ్చితంగా ఎలా చెప్పగలుగుతున్నారనేగా మీ డౌట్.. మీరే చదండి..  ఉత్తర్ ప్రదేశ్ లోని బరేలీ వద్ద బైపాస్ రోడ్డుపై బీరు కేసులను తీసుకెళుతున్న లారీ బోల్తా పడింది. ఈ విషయం అంతటా పాకడంతో సమీప గ్రామస్తులంతా సంఘటన స్థలానికి తరలివెళ్ళారు. ఎందుకనుకుంటున్నారు.. బీరు కోసం..

లారీ ప్రమాదంలో అందులోనే చిక్కుకున్న డ్రైవర్ సహా అతడి తమ్ముడిని కనీసం బయటకు తీయకుండా.. అసలు మానవత్వమన్నదే లేకుండా స్వార్థంతో వ్యవహరించారట. లారీలోని వారిని కాపాడదామని ముందుకు వచ్చిన వారిని కూడా పలువురు వాదించి.. డ్రైవర్ బయటకు వస్తే బీరు తీసుకెళ్లనివ్వడని అడ్డుపడ్డారట. మంచి తరుణం మించిన దోరకదన్నట్లు ఎవరికి దొరికిన కేసులను వారు ఇంటికి మోసుకెళ్ళారు. బిందెలు, బక్కెట్లు, చెంబులు, చివరికి ప్లాస్లిక్ సంచుల్లో కూడా బీరు సీసాలను తీసుకెళ్ళారట… ఆ నోటా, ఆ నోటా సమాచారం అందుకున్న పోలీసులు అక్కడికి వచ్చి పరిస్థితిని చక్కదిద్దారు. బాగా పొద్దుపోయిన తర్వాత ఈ ప్రమాదం జరిగింది. స్థానికులు లారీ డ్రైవర్ ను, అతని సోదరుడిని బయటికి తీశారు. వారిద్దరికీ స్వల్ప గాయాలయ్యాయి. ఇక, గ్రామస్తుల విషయానికొస్తే… కొందరు బోల్తా కొట్టిన లారీ వద్దే బీర్లు తాగడం మొదలుపెట్టగా, దారిన పోయే ప్రయాణికులు సైతం వారికి జత కలిశారట.

జి.మనోహర్

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : liquor  liquor carrying vehicle  turns updown  villagers  collect  bottles  uttarpradesh  barelli  bypass road  police  

Other Articles