Congo crowd kills man eats him after militant massacres witnesses

Congo, crowd kills man and eats him, militant massacres, witnesses, town of Beni, Congo's President, Joseph Kabila, ADF-NALU, Somalia, al Shabaab, al Qaeda

Congo crowd kills man, eats him after militant massacres: witnesses

యువకుడిని చంపి శవాన్ని తిన్నారు.. నరభక్షకులు..

Posted: 11/01/2014 05:08 PM IST
Congo crowd kills man eats him after militant massacres witnesses

కాంగో దేశంలో దారుణం జరిగింది. అక్కడి ఉగ్రవాదులు నరభక్షకులనే తలపించారు. ఓ యువకుడిని రాళ్లతో కొట్టి చంపి దహనం చేసి మరీ అతని శవాన్ని తిన్నారు. ప్రభుత్వంపై ప్రతికారం తీర్చుకునే చర్యలల్లో భాగంగా యుగాండా తిరుబాటుదారులు ఈ దారుణానికి ఒడిగట్టారు. వివరాల్లోకి వెళ్తే.. ఈశాన్య కాంగోలోని బెని పట్టణంలో ఎడిఎఫ్-ఎన్ఎయుఎల్ దళానికి చెందిన ఇస్లామిక్ తీవ్రవాదులు.. యుగాండా తిరుగుబాటు దారులు వున్నారన్న సమాచారంతో ప్రతి రోజు రాత్రళ్లు అక్కడి పోలీసులు అకస్మిక తనిఖీలు నిర్వహిస్తున్నారు. గత రాత్రి కూడా పోలీసులు తనిఖీలు చేయగానికి వచ్చే లోపు ఈ ఘటన చోటుచేసుకుంది.

గొడ్డలి, కడవళ్లు పట్టుకుని సుమారు వంద మంది ఇస్లామిక్ ఉగ్రవాదులు ఒక యువకుడిని రాళ్లతో కొట్టి తరిమారు. అంతటితో ఆగకుండా..అతడి శవాన్ని కాల్చికుని తిన్నారని స్థానికంగా వుండే ఓ సాక్షి తెలిపారని పోలీసులు తెలిపారు. మృతుడు ఎవరనేది తమకు తెలియదని, అతను స్థానికుడు కాదని తెలిపారు. మృతుడు స్థానికి స్వాహిలి భాష మాట్లాడపోవడంతో అనుమానం రావడం, పైపెచ్చు అతని వద్ద ఓ కొడవలి కూడా లభ్యం కావడంతో అతనిపై అనుమానాలను మరింత పెంచాయన్నారు. దీంతో అనుమానం వచ్చిన యుగాండ తీవ్రవాదులు అతడిని అనుమానాస్పద వ్యక్తిగా గుర్తించి రాళ్లతో కొట్టి చంపి దహనం చేసుకుని తిన్నారని చెప్పారు.

గత గురువారం ఈ తిరుగుబాటు దళాల చేతికి చిక్కి 14 మంది ప్రాణాలను కోల్పోయారు. బెణి పట్టణానికి చేరువలోని కంపి యా చుయ్ గ్రామంలో ఈ ఘటనలు చోటుచేసుకున్నాయి. దీంతో గత నెలలో మెత్తం 107 మందిని ఉగ్రవాదులు మట్టుబెట్టారని బెని పౌర సంఘం అధ్యక్షుడు టెడ్డి కటాలికో తెలిపారు. ఈ ఘటనపై కాంగో అధ్యక్షడు  జోసెఫ్ కాబిల స్పందిస్తూ.. ఈ తరహా ఘటనకు పాల్పడే ఉగ్రవాదులకు గత ఏడాది తిరిగుబాటు ఉద్యమ సమయంలో చవిచూసిన ఫలిలాలనే మళ్లీ ఎదురవుతాయని హెచ్చరించారు. ఉగ్రవాదులతో తాము ఎట్టి పరిస్థితులలో చర్చలకు అంగీకరించమని చెప్పారు. ప్రభుత్వంతో పెట్టుకుంటే మరోమారు ఓటమి తప్పదని వారు గుర్తుంచుకోవాలన్నారు.

మరోవైపు తమకు ప్రభుత్వం నుంచి ప్రత్యేక రక్షణ కవాలని కోరుతున్న ఉగ్రవాదులు నిన్న కాంగో విమానాశ్రయం నుంచి బెని పట్టణంలోకి వచ్చే రహదారిని నిర్భంధ చేసి..గొడ్డళ్లు, కొడవళ్లలను ప్రదర్శించడంతో బెని పట్టణంలో తీవ్ర ఉద్రిక్తతలు చోటుచేసుకున్నాయి. ఉగ్రవాదలు కేవలం 500 మందే వున్నారని ఐక్యరాజ్య శాంతి పరిరక్షణ మిషన్ వెబ్ సైట్ పేర్కోంటుండగా, వాస్తవానికి అది బలం పుంజుకుందని తెలుస్తోంది. మరోవైపు ఉగాంఢ తిరుగుబాటుదారులు సోమాలియాలోని అల్ ఖైదా అనుబంధ అల్ షబాబ్ తో సంబంధాలు పెట్టుకున్నారని వార్తలు అందుతున్నాయి. అయితే విశ్లేషకులు మాత్రం ఈ రెండు ఉగ్రవాద సంస్థలు ఇస్లామిక్ భావజాలంతో వున్నాయని, కానీ సంబంధాలు కుదిరినట్లు స్పష్టత లేదంటున్నారు.

జి.మనోహర్

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Other Articles