Konathala and gandi babji to join tdp

Konathala RamaKrishna, Gandi Babji, YCP, TDP,. Vishakapatnam, OPeration Akarsh, Senior leaders, Vijayamma, party members, Sarpanches, MPTCs, Ayyana Paathrudu

Konathala and Gandi Babji to join TDP

టీడీపీ గూటికి చేరనున్న కొణతల, గండి బాబ్జి..

Posted: 10/31/2014 11:21 AM IST
Konathala and gandi babji to join tdp

వైసీపీ నుంచి బయటకు రావడంతో తనకు నరకం నుంచి విముక్తి లభించినట్లయిందని నిన్న ఘాటు వ్యాఖ్యాలు చేసిన కొణతాల రామకృష్ణ టీడీపీ గూటికి చేరేందుకు రంగం సిద్దం చేసుకుంటున్నారు. వారం రోజుల్లో టీడీపీ తీర్థం పుచ్చుకునేందుకు కొణతల రామకృష్ణతో పాటు మాజీ ఎమ్మెల్యే గండి బాబ్జి కూడా రెడీ అవుతన్నారు. తెలంగాణలో పార్టీ నేతలను కొల్పోతున్న టీడీపీ ఇప్పడు అదే ఆపరేషన్ ఆకర్ష్ ను ఆంధ్రప్రదేశ్ లో ప్రతిపక్ష పార్టీపై ప్రయోగిస్తుంది. దీంతో ఎన్నికల నాటి నుంచి మౌనంగా వున్న కొణతల ఒక్కసారిగా పార్టీకి రాజీనామా చేసిన అందరనీ అశ్చర్యపర్చారు. అయితే ఎన్నికలకు ముందు టీడీపీ నేత దాడి వీరభద్రరావు చేరికతోనే పార్టీకి గుడ్ బై చెప్పాలనుకున్న కొణతలను పార్టీ నేతలు బుజ్జగించారు. దీంతో పార్టీకి క్రీయాశీలక కార్యకర్తగా, నేతగా సేవలందించినా.. అధినాయకత్వం నుంచి ఆమేరకు గుర్తింపు దక్కకపోవడంతో బయటకు వచ్చిన కొణతల..ఇప్పుడు వైసీపీకి వైరివర్గం, అధికారపార్టీ అయిన టీడీపీలో చేరేందుకు సన్నాహాలు ప్రారంభించారు. ఆయనతో పాటే మాజీ ఎమ్మెల్యే గండి బాబ్జి కూడా నడవనున్నారు.

వైసీపీని చేజేతులా నాశనం చేసుకుంటున్న జగన్ ప్రవర్తన చూస్తుంటే తనకు ఆయనపై జాలి, దయ కలుగుతున్నాయని కొణతల నిన్న వ్యాఖ్యానించారు. తన రాజీనామాను వెంటనే ఆమోదించి, నాలుగేళ్ల నుంచి తాను అనుభవిస్తున్న నరకం నుంచి జగన్ నాకు విముక్తి కలిగించారని ఎద్దేవా చేశారు. దీనికి, ఆయనకు థ్యాంక్స్ కూడా చెప్పారు. కొణతాల రామకృష్ణ తన అనుచరులు, సన్నిహితులు, మీడియా మిత్రులతో నిన్న జరిపిన ప్రైవేటు సంభాషణలో పై వ్యాఖ్యలు చేశారు. మరోవైపు కొణతల అనుచరుడిగా వున్న గండిబాబ్జి కూడా జగన్ పై విరుచుకుపడ్డారు. పార్టీ గౌరవాధ్యక్షురాలు విజయమ్మను విశాఖ నుంచి పోటీకి దింపవద్దని చెప్పినా.. పెడ చెవిన పెట్టని జగన్.. ఓటమి తరువాత కొణతలను దోషిగా నిలబెట్టారని మండిపడ్డారు. జగన్ వైఖరితో రాష్ట్రంలోని పలు జిల్లాల్లో సీనియర్ నేతలు పార్టీకి దూరమవుతున్నారని విమర్శించారు. విశాఖ జిల్లాలోని తమ అనుచరవర్గం అందరితో కలసి టీడీపీ పార్టీలో చేరనున్నట్లు చెప్పారు. వీరిని టీడీపీలోకి ఆకర్ష్ ఆపరేషన్ ను తెర వెనుక నడిపింది టీడీపీ నేత మంత్రి, అయ్యన్నపాత్రుడని సమాచారం.

వైసీపీకి మరో జలక్.. పార్టీ వీడనున్న జమ్మలమడుగు సోదరులు

వైసీపీకి 'జమ్మలమడుగు సోదరులు' రాజీనామా చేయనున్నారనే ఊహాగానాలు ఊపందుకున్నాయి. జమ్మలమడుగు ఎమ్మెల్యే ఆదినారాయణరెడ్డి, ఆయన సోదరుడు ఎమ్మెల్సీ దేవనారాయణరెడ్డి వైసీపీకి గుడ్ బై చెప్పనున్నారనే ప్రచారం కడప జిల్లాలో జోరుగా జరుగుతోంది. అధికారం దక్కక నిరుత్సాహంతో ఉన్న పార్టీ శ్రేణులను ఉత్తేజపరచడానికి పార్టీ ప్రధాన కార్యదర్శి విజయసాయిరెడ్డి, పర్యవేక్షక కార్యదర్శి ఉమ్మారెడ్డి వెంకటేశ్వర్లు ఆధ్వర్యంలో నిన్న నిర్వహించిన కడప జిల్లా సర్వసభ్య సమావేశానికి వీరిద్దరూ హాజరు కాకపోవడం ఈ ఊహాగానాలకు మరింత ఊతం ఇచ్చినట్లయింది. వీరికి అనుచరుడైన జడ్పీ చైర్మన్ గూడూరు రవి కూడా ఈ సమావేశానికి రాకపోవడం ఈ వార్తలకు మరింత బలమిచ్చింది.

వైసీపీని వీడి టీడీపీలో చేరాలని ముందు అనుకున్నప్పటికీ, కడపలో టీడీపీ నేత రామసుబ్బారెడ్డి వర్గం బలంగా ఉండటంతో, ఆ పార్టీలోకి వెళ్లే ఆలోచనను జమ్మలమడుగు సోదరులు విరమించుకున్నారని తెలుస్తోంది. ప్రత్యామ్నాయంగా, బీజేపీ వైపు ప్రస్తుతం ఆదినారాయణరెడ్డి సోదరులు చూస్తున్నట్టు తెలుస్తోంది. మరోవైపు, జగన్ చిన్నాన్న మల్లికార్జునరెడ్డి కడపలో ఉండి కూడా ఈ సమావేశానికి హాజరుకాకపోవడంతో... కడప వైసీపీలో లుకలుకలు తీవ్రస్థాయికి చేరాయని ఆ పార్టీ శ్రేణులు భావిస్తున్నాయి.

జి.మనోహర్

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Other Articles