Pm modi finds place for indira gandhi as he lauds sardar patel

Sardar Vallabhbhai Patel, Sardar Patel birth anniversary, Run for Unity, PM Modi, Indira Gandhi, New Delhi

PM Modi finds place for Indira Gandhi as he lauds Sardar Patel

దేశాన్ని ఐక్యం చేసిన ఉక్కు మనిషి సర్దార్ పటేల్..

Posted: 10/31/2014 11:14 AM IST
Pm modi finds place for indira gandhi as he lauds sardar patel


దేశాన్ని ఏకీకృతం చేయడానికే ఉక్కుమనిషి సర్దార్ వల్లభాయ్పటేల్ జీవితం అంకితం చేశారని దేశ ప్రధాని నరేంద్ర మోదీ అన్నారు. పటేల్ జీవితం ఎందరికో స్పూర్తిదాయకమని చెప్పారు. సర్దార్ వల్లభాయ్పటేల్ జయంతి సందర్భంగా న్యూఢిల్లీలోని విజయ్చౌక్ వద్ద నిర్వహించిన జాతీయ ఏక్ తా దినోత్సవ వేడుకల్లో పాల్గొన్న ఆయన పటేల్ విగ్రహనికి పూలమాల వేసి నివాళులర్పించారు. అనంతరం మోదీ మాట్లాడుతూ... దేశాన్ని ఐక్యంగా ఉంచే క్రమంలో సర్దార్ పటేల్ చేసిన సేవలను ఆయన కొనియాడారు. స్వాతంత్య్ర అనంతరం దేశంలోని సంస్థానాల వీలినమే పటేల్లో ఉన్న దేశ ఐక్యతకు నిదర్శనమని చెప్పారు.

స్వాతంత్య్ర ఉద్యమంలో రైతులందరినీ ఏకతాటిపై నడిపిన ఘనత పటేల్‌దేనని కొనియాడారు. దేశ స్వాతంత్య్ర ఉద్యమంలో కీలకమైన దండియాత్ర. భారతదేశ స్వంతంత్ర కాంక్ష, శక్తిని చాటిందని, ఈ యాత్రలో మహాత్ముడితో కదం కదం కలిపి నడిచిన వ్యక్తి పేటల్ అని ఈ సందర్బంగా  ప్రధాని గుర్తు చేశారు. ఆయన స్ఫూర్తితో కొత్త ఉత్సాహం, కొత్త ఆలోచనలతో ముందు కెళ్లాలని యువతకు ఆయన పిలుపునిచ్చారు. స్వాతంత్య్రం వస్తే దేశం ముక్కలైపోతుందని బ్రిటీష్ వారు భావించారు... కానీ దేశమంతటినీ ఒక్కతాటిపై నిలిపిన మహనీయుడు పటేల్ అని కీర్తించారు. దేశంలో జరిగిన అనేక కుట్రను ఉక్కుపాదంతో అణిచిన వ్యక్తి పటేల్ అని తెలిపారు. సంస్థానాల విలీనమే పటేల్ శక్తి సామర్థ్యాలకు ప్రతీక అని కొనియాడారు. కేంద్రమంత్రులు వెంకయ్యనాయుడు, సుష్మాస్వరాజ్, రవిశంకర్ ప్రసాద్ తదితరులు పాల్గొన్నారు. . అనంతరం ఐక్యమత్య సూత్రానికి కట్టుబడి ఉంటామని మోదీ ఈ సందర్భంగా విజయ్చౌక్ వద్ద పాల్గొన వారితో ప్రతిజ్ఞ చేయించారు. ఆ తర్వాత ఐక్యత పరుగును జెండా ఊపి మోదీ ప్రారంభించారు. ఈ పరుగులో భారీ సంఖ్యలో ప్రజలు పాల్గొన్నారు.

ఐక్యతా దివాస్ సందర్భంగా మోడీ తన ప్రసంగంలో స్వర్గీయ మాజీ ప్రధాని ఇందిరాగాంధీని గుర్తు చేసుకున్నారు. దేశానికి స్పూర్తిదాయకమైన పటేల్ జన్మదినం రోజునే దేశ ప్రధానిని అమె భద్రతా బలగాలు బలి తీసుకోవడం దురదృష్టకరమన్నారు. అయితే ఇందిరాగాంధీ మరణానంతరం జరిగిన అల్లర్లు ఒక వర్గంపై జరిగిన దాడులు కాదని, యావత్ దేశ ప్రజలపై జరిగిన దాడులుగా ప్రధాని అభివర్ణించారు..

జి.మనోహర్

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Other Articles