Germany keen to help bihar in post harvest technology

Germany, Jitan Ram Manjhi, Michael Steiner, bihar, Patna, post^Harvest Technology, ambassador, Nitish kumar, former CM, t, food processing cold chain, vocational training

Germany keen to help Bihar in post-harvest technology

బీహార్ రైతులకు జర్మనీ నిపుణల సహకారం..

Posted: 10/29/2014 01:55 PM IST
Germany keen to help bihar in post harvest technology

భీహార్ రైతుల పంట పడింది. సాధారణ పద్దతుల్లో పంట ఉత్పత్తులను నిల్వ చేసుకుంటున్న బీహారీయులకు మేలు పద్దతులను, అదునాతన సాంకేతిక మార్గాలను చూపడంలో జర్మనీ వారికి సహకారాన్ని అందించనుంది. భీహార్ లోని పాట్నాలో పర్యటించిన భారత జర్మనీ రాయభారి ఈ మిషెల్ స్టెనర్ ఈ విషయాన్ని వెల్లడించారు. బీహార్ లోని రైతులకు పంట కోత తదనంతర నిల్వపై తమ దేశం సహకారం అందిస్తుందన్నారు. పంట కోతలో అనుసరించాల్సిన సాంకేతిక పరిజ్ఞానం, ఆహార ప్రక్రియ, వాటిలో వృత్తి నైపుణ్యత మరియు శిక్షణ కల్పించేందుకు తాము సహకారం అందిస్తామని ఆయన ఆసక్తిని కనబర్చారు. ఈ అంశంలో రైతులకు కావాల్సిన సహయసహకారాలను అందించేందుకు తమ దేశ ప్రభుత్వం సిద్దంగా వుందని ఆయన సంసిద్దత వ్యక్తం చేశారు. బీహార్ లో ఆహార ఉత్పత్తుల తయారీకి కావాల్సిన శీతలీకరణకు తాము సహకరిస్తామని మిషెల్ స్టెన్నర్ వెల్లడించారు.

పాట్నాలో ఆయన బీహర్ ముఖ్యమంత్రి జితన్ రామ్ మాంఝీతో భేటి అయ్యారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. తమ దేశానికి చెందిన వ్యవసాయ, ఆహార ఉత్పత్తుల రంగ నిఫుణులను బీహర్ రాష్ట్రానికి పంపుతామని చెప్పారు. వ్యవసాయ రంగం అభివృద్దిలో వారు రైతులకు మేలు రకమైన పద్దతులపై అవగాహన కల్పిస్తారన్నారు. వ్యవసాయం అనుబంధ రంగాలపై జర్మనీలో 2015లో జరిగే ప్రపంచ ఎగ్జిబిషన్ లో పాల్గొనాల్సిందిగా ఆయన బీహర్ ప్రభుత్వాన్నికి అహ్వానం అందించారు. బీహార్ లో అర్థిక వృద్దిరేటు పెరుగుదల, తదితర అంశాలపై ఆయన ప్రభుత్వాన్ని కొనియాడారు. మరింత అభివృద్ది సాధించాలని ఆకాంక్షించారు. ఛత్ పండుగను పురస్కరించుకుని ఆయన రాష్ట్ర ప్రజలకు శుభాకాంక్షలు తెలిపారు. బీహర్ ప్రస్తుతం రాజకీయాలలో, విద్య, సంస్కృతి, అధ్యాత్మికత రంగాలలో కేంద్రబింధువుగా మారిందని మిషెల్ స్టెన్నర్ కొనియాడారు.

మాజీ ముఖ్యమంత్రి నితీష్ కుమార్ రాష్ట్రాన్ని ఏ విధంగా అభివృద్ది పథంలో నడిపిందని స్టెన్నర్ కు బీహార్ ముఖ్యమంత్రి జతిన్ రామ్ మాంఝీ వివరించారు. గత పదేళ్లుగా రాష్ట్రం అన్ని రంగాలలో అబివృద్దిలో దూసుకుపోవడానికి కారణం మాజీ ముఖ్యమంత్ర నితీష్ కుమార్ తీసుకున్న చర్యల ఫలితమేనన్నారు. విద్యారంగంతోపాటు, శాంతిభద్రతలు, వ్యవసాయం, రోడ్లు, మౌళిక సదుపాయాల కల్పనలో రాష్ట్రం పురోగాభివృద్ది సాధిస్తుందని చెప్పారు. బీహర్ సమగ్ర అభివృద్ది దిశలో పయనిస్తుందని వివరించారు. రాష్ట్రంలో విద్యుతీకరణ కూడా క్రమంగా విస్తరింపజేస్తున్నామన్నారు. 2005లో 800 మెగావాట్ల విద్యుత్ వినియోగం.. ప్రస్తుతం 2800 మెగావాట్లకు పెరిగిందన్నారు. జర్మనీ రాయభారి స్టెన్నర్ తో భారత్ జర్మనీ దైపాక్షిక ఒప్పందాల మేరకు బీహర్ వ్యవసాయరంగంలో పెట్టబడులకు కూడా తాము జర్మనీని ఆహ్వానిస్తున్నామని మాంఝీ చెప్పారు. స్టెన్నర్ ఆయన భార్య ఎల్లీస్ తో రెండురోజుల పాటు బీహర్ పర్యటనకు వచ్చారు.

జి.మనోహర్

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Other Articles