Central government submits a list of 627 black money account holders to supreme court

Black money, Switzerland, India, Swiss banks, Swiss black money, government, supreme court, PM Narendra Modi, arun jaitley, nda government, hsbc bank, 627 names

central government submits a list of 627 black money account holders to Supreme Court

నల్లకుబేరుల జాబితాను బయబయలు

Posted: 10/29/2014 12:28 PM IST
Central government submits a list of 627 black money account holders to supreme court

విదేశీ బ్యాంకుల్లో కోట్ల కొలది డబ్బును దాచిన భారతీయ నల్లకుభేరులు జాతకాలకు ఎట్టకేలకు బట్టబయలయ్యాయి. దేశ సరిహద్దులను దాటించి అక్రమంగా డబ్బు నిల్వచేసిన నలధన కుబేరులను వెనకేసుకురావద్దని సుప్రీంకోర్టు తెగేసి చెప్పడంతో బీజేపీ సారథ్యంలోని ఎన్డీయే ప్రభుత్వం వారి జాబితాను బయటపెట్టింది. గత కొన్ని ఏళ్లుగా నానుతున్న నల్లకుబేరుల అంశంలో కేంద్రప్రభుత్వం అడుగుముందేకేసింది. విదేశాలలోని అక్రమంగా  సొమ్మును దాచిన మొత్తం 627 మంది పేర్లతో కూడిన ఈ జాబితాను అఫిడవిట్ రూపంలో సుప్రీంకోర్టుకు సర్కారు సమర్పించింది. 120 కోట్ల మంది భారతీయులకు.. సువిశాలమైన భారతదేశ అభివృద్దికి దోహదపడాల్సిన సోమ్మును.. సప్తసముద్రాలు దాటించిన ఘనుల జాబితాలో పలువురు రాజకీయ నాయకులు, పారిశ్రామిక వేత్తలు, వాణిజ్యవేత్తల సహా.. ఇలా అన్ని వర్గాల వాళ్లు ఉన్నారు. దీంతో ఇప్పడు వారి గుండెళ్లో రైలు పరిగెడుతున్నాయి. అందరూ వేలకోట్లలోనే తమ సంపదను విదేశాల్లోని పలు బ్యాంకుల్లో వేర్వేరు ఖాతాలలో దాచిపెట్టుకున్నారు.

అయితే.. మన దేశానికి చెందిన సొమ్ము విదేశాలకు ఇలా తరలిపోవడాన్ని తాము ఎట్టి పరిస్థితుల్లో అంగీకరించేది లేదని, దీనిపై ఎలా దర్యాప్తు చేయించాలో తమకు తెలుసునని సుప్రీంకోర్టు గట్టిగా చెప్పింది. జాబితా మొత్తాన్ని.. ఒక్క పేరు కూడా తీయకుండా తమకు సమర్పించాలని అదేశించడంతో.. కేంద్ర ప్రభుత్వం తరపున అటార్నీ జనరల్ ముకుల్ రోహత్గీ ఈ జాబితాను అఫిడవిట్ రూపంలో సుప్రీంకోర్టుకు సమర్పించారు. అయితే భద్రతా కారణాల రీత్యా ఈ పేర్లను బయటపెట్టొద్దని కేంద్ర ఆర్థికమంత్రి అరుణ్ జైట్లీ సుప్రీంకోర్టుకు విజ్ఞప్తి చేశారు.

భారతదేశంలో వేల సంఖ్యలో నల్లకుబేరులు ఉండగా, కేవలం 627 మంది పేర్లనే కేంద్రం సుప్రీంకోర్టుకు సమర్పించింది. అయితే.. కేంద్ర ప్రభుత్వం సుప్రీంకోర్టుకు సమర్పించిన 627 మంది నల్లకుబేరుల జాబితా మొత్తం ఫ్రాన్స్ లోని హెచ్ఎస్బీసీ బ్యాంకులో ఉన్న ఖాతాల వివరాలు మాత్రమేనట. ఈ జాబితాలో వ్యక్తుల పేర్లు, ఖాతా నెంబర్లు సహా.. ఏ ఖాతాలో ఎంతెంత మొత్తం ఉందన్న విషయాలు కూడా వివరంగా ఉన్నట్లు తెలిసింది. దీంతో ఈ జాబితా కాకుండా ఇంకా.. స్విస్ బ్యాంకుల ఖాతాల్లో సొమ్ము వివరాలు, ఆయా ఖాతాలు కలిగి ఉన్నవాళ్ల పేర్లు ఇంతవరకు సుప్రీంకోర్టుకు కూడా చేరలేదు. ఇంకా చెప్పాలంటే, అసలు కేంద్ర ప్రభుత్వం కూడా ఇంకా ఆయా పేర్లను సంపాదించిందో లేదో స్పష్టత లేదు. దుబాయ్, స్విట్జర్లాండ్ లాంటి దేశాల్లోని పలు ఖాతాల్లో కూడా భారీ మొత్తంలో డబ్బు దాచుకున్నారన్న కథనాలు ఎప్పటినుంచో ఉన్నాయి. వాటి వివరాలు కూడా బయటకు వస్తే.. జాబితా మరింత పెద్దది కావడం విషయం పక్కనబెడితే.. ఆ సోమ్మను భారత్ స్వాధీనంచేసుకోగలిగితే.. దేశానికి వున్న అప్పలన్నీ తీరి సిరిసంపదలు కల్గిన దేశంగా కీర్తగడించడం ఖాచం. ఇది కూడా మోడీ ప్రభుత్వ హయాంలో జరిగితే.. దేశాన్ని సుసంపన్నం చేశారన్న ఖ్యాతి కూడా దక్కుతుందని రాజకీయ విశ్లేషకుల అభిప్రాయం.

జి.మనోహర్

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Other Articles