Daily consumption of fruit juice can create problems for your heart

daily consumption, fruit juice, dangerous, heart, Dr Matthew Pase, Swinburne University of Technology, Australia, sweet drinks, BP, heart attack, angina, cognitive impairment, essential vitamins, high amounts of sugar, orange juice, sweetened drinks, calories

Daily consumption of fruit juice can create problems for your heart

ప్రతీ రోజు పళ్ల రసాలు ప్రమాదకరమే.. అధ్యయనాలు

Posted: 10/29/2014 03:24 PM IST
Daily consumption of fruit juice can create problems for your heart

నిత్యం పళ్ల రసాలను సేవిస్తున్నారా..? అయితే కొంచెం అప్రమత్తంగా వుండండి. నిత్యం పండ్ల రసాలను తీసుకోవడం కూడా ఆరోగ్యానికి హాని కరమని అధ్యయనాలు చెబుతున్నాయి. ప్రతిరోజు క్రమం తప్పకుండా పళ్ల రసాలను తీసుకునే వారు కూడా హృదయ సంబంధిత జబ్సులకు గురికావాల్సివస్తుందని తాజా అధ్యయనాలు స్పష్టం చేస్తున్నాయి. తరచుగా పండ్ల రసాలను తీసుకునే వారు గుండెపోటుతో పాటు సంబంధిత వ్యాధులకు గురవుతారని అస్ట్రేలియాలోని స్విన్ బర్న్ యూనివర్శిటీ ఆప్ టెక్నాలజీ విశ్వవిద్యాలయం చేసిన తాజా అధ్యయానాలు వెల్లడించాయి.

పళ్లరసాలు తీసుకునే వారిపై అద్యయనం చేసిన డాక్టర్ మ్యాథువ్ పేస్ మరిన్నీ ఆసక్తికరమైన విషయాలను వెల్లడించారు. పళ్ల రసాలలోని వున్న తీయని పదార్థాలు వాటిని సేవించేవారిలో రక్తపోటు అధికం చేస్తుందని తెలిపారు. అప్పడుప్పుడు పళ్ల రసాలను తీసుకునే వారితో పోల్చితే.. ప్రతిరోజు పళ్లరసాలను తీసుకునేవారిలో రక్తపోటు అధికంగా నమోదువుతున్నట్లు చెప్పారు. తద్వారా వీరికి గుండెపోటు,  గుండె దమనుల వ్యాధులతో పాటు మేధోపరమైన వైకల్యాలకు కూడా దారి తీసే ప్రమాదముందని వైద్యులు తెలిపారు.

పళ్ల రసాలు అధికంగా శరీరానికి కావాల్సిన విటమిన్లు వుండడంతో  అవి ఆరోగ్యానికి చాలా మంచివని పిల్లలతో పాటు పెద్దలు కూడా ప్రతిరోజూ వాటిని సేవిస్తారని.. కానీ అవి అనుకున్నంత మంచి కన్నా చేటును కూడా కలగజేస్తాయని మ్యాథీవ్ పేస్ తెలిపారు. విటమిన్ల విషయం పక్కన బెడితే.. పళ్ల రసాలలో అధిక మోతాదులో వున్న తీపి పదార్థాలు ముప్పుగా పరిణమించనున్నాయని తెలిపారు. పళ్ల రసాలు మంచివన్న ఉద్దేశ్యం పాతుకుపోయిన నేపథ్యంలో ఈ అధ్యయనం మేలు చేసిందనన్నారు. అన్నింటిలోని నారింజ పండు రసం అధిక ప్రమాదకారిగా వైద్యులు తెలిపారు. పావు లీటరు నారింజ రసంలో 115 కాలరీల ఎనర్జీ వస్తుందని, ఇది ఏడు టేబుల్ స్పూన్ల పంచధారతో సమానమన్నారు. కోలా పూర్తి బాటిల్ లో 139 కాలరీల ఎనర్జీ నిక్షిప్తమౌవుందని తెలిపారు. అయితే ప్రపంచ ఆరోగ్య సంస్థ పిషార్సుల మేరకు రోజుకు ఒక వ్యక్తి కేవలం ఆరు చెంచాల పంచధారను మాత్రమే వినియోగించాలని మ్యాధువ్ పేస్ తెలిపారు.


జి.మనోహర్

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Other Articles