Children borns with sugar disease

flight journey, flights flying technology, flight accidents, planes windows, flights windows, flights without windows, flight ticket booking, latest news, oled screens, led screens

in future planes may be windowless : a U.K.based institution developing these windows less planes for future. a organic light emitting diode screen will replaced in the place of windows this will show out sice view by cameras fitted out side of the plane. this will give natural look and also gives less fuel consumption to flights and have other advantages

పుట్టకముందే పిల్లలకు షుగర్ వ్యాధి వస్తోంది

Posted: 10/29/2014 11:17 AM IST
Children borns with sugar disease

దేశాన్ని పట్టిపీడిస్తున్న వ్యాధుల్లో ఒకటిగా ఉన్న షుగర్ (మదుమేహం) పెద్దవారినే కాదు అభంశుభం తెలియని పిల్లలపై కూడా దాడి చేస్తోంది. పుట్టక ముందే చిన్నారుల శరీరంలోకి షుగర్ వ్యాధి లక్షణాలు వచ్చి చేరుతున్నాయి. తీవ్ర భయాందోళనలు కల్గిస్తున్న ఈ విషయం సీసీఎంబీ చేస్తున్న పరిశోధనల్లో వెల్లడయింది. మధుమేహంపై పరిశోధనలు జరుపుతున్న ప్రత్యేక బృందం టైప్ 2 మధుమేంపై కొత్త ఆవిష్కరణలు చేసింది. తాజా పరిశోధన ప్రకారం దేశంలో గర్బవతుల్లో హోమోసిస్టిన్ అనే ఎంజైము అధికంగా ఉత్పత్తి అయి తక్కువ బరువున్న పిల్లలు పుట్టే అవకాశం ఉంది.

ఇలా బరువు తక్కువ ఉన్న శిశువుల శరీరంలో కండరాల కంటే కొవ్వు అధికంగా ఉంటుంది. ఫలితంగా ఇది షుగర్ వ్యాధికి దారి తీస్తుందని చెప్తున్నారు. ఇక దీనికి కారణం బి-12 విటమిన్ లోపం అని సీసీఎంబీ డైరెక్టర్ మోహన్ రావు వెల్లడించారు. ఆయన చెప్పిన వివరాల ప్రకారం.., దేశంలో గర్బవతులకు పోషకాహార లోపం రాకుండా ఫోలిక్ యాసిడ్ మాత్రలు ఇస్తారు. కాని చాలావరకు బీ12ను తీసుకోరు. దీని వల్ల హోమోసిస్టిస్ అధిక మొత్తంలో ఉత్పత్తి అయి అది శిశువు శరీరంలోకి వెళ్తుందని చెప్పారు. ఫలితంగా చిన్నారులు పుట్టినపుడు బరువు తక్కువగా ఉండటంతో పాటు.. క్రమంగా బరువు పెరిగి లావుగా తయారవుతారు. అయితే వీరి కండరాల్లో కొవ్వు శాతం ఎక్కువగా ఉంటుందని చెప్తున్నారు. బాడీ మాస్ ఇండెక్స్ ఎక్కువగా ఉండి లావుగా మారటంతో పాటు ఇన్సులిన్ ఉత్పత్తి తగ్గుతుంది.

పోషకాహార లోపం వల్లే ఇదంతా జరుగుతున్నందున.., గర్బవతులకు సరైన పోషకాహారం అందిస్తే ఈ వ్యాధిని నివారించే అవకాశం ఉందని శాస్ర్తవేత్తలు చెప్తున్నారు. గర్భిణిలకు ఫోలిక్ యాసిడ్ మాత్రలతో పాటు బీ12 మాత్రలూ ఇవ్వాలని సూచిస్తున్నారు. గర్భంతో ఉన్నపుడే కాకుండా మిగతా సమయాల్లోనూ మంచి పోషక విలువలున్న ఆహారం తీసుకుంటే మనకు.., మన ముందు తరాలకు ఎలాంటి ఢోకా ఉండదన్నమాట.

కార్తిక్

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : flight  windows  led screens  latest news  

Other Articles