Tamil nadu allies not invited for pm dinner

BJP's allies, Tamil Nadu, DMDK, MDMK, Vijayakanth, Vaiko, invitees, Prime Minister, Narendra Modi, dinner, NDA partners, October 26.

BJP's allies in Tamil Nadu, DMDK and MDMK, their leaders Vijayakanth and Vaiko do not figure in the list of invitees to Prime Minister Narendra Modi's dinner for NDA partners on October 26.

తమిళ మిత్రులకు అందని మోడీ ‘విందు’ ఆహ్వానం

Posted: 10/25/2014 07:25 PM IST
Tamil nadu allies not invited for pm dinner

ప్రధాని నరేంద్ర మోదీ ఎన్డీయే భాగస్వామ్య మిత్రులకు ఇవ్వనున్న విందులో తమిళనాడుకు చెందిన ఇద్దరు మిత్రుల పేర్లు మిస్సాయ్యాయి. ఎన్డీఏ భాగస్వామ్య మిత్రులకు ప్రధాని మోడీ ఆదివారం విందు ఇవ్వనున్నారు.. అయితే, తమిళ మిత్రులు డీఎండీకే, ఎండీఎంకే పార్టీలకు ప్రధానమంత్రి కార్యాలయం నుంచి ఆహ్వానాలు వెళ్ళలేదు. డీఎండీకే అధినేత విజయకాంత్, ఏండీఎంకే అధ్యక్షుడు వైగోలను ప్రమాణస్వీకారం సందర్బంగా ఐదు నెలల క్రితం ప్రత్యేకంగా పిలిచిన మోడీ, ఈసారి వారిద్దరినీ దూరం పెట్టడంపై రాజకీయవర్గాల్లో ఊహాగానాలు బయల్దేరాయి.

దీనిపై, తమిళనాడు బీజేపీ ఉపాధ్యక్షుడు ఎం.చక్రవర్తి వివరణ ఇచ్చారు. మోదీ కేవలం ఎంపీలకు మాత్రమే విందు ఏర్పాటు చేశారని తెలిపారు. అందుకే, ఎన్డీయే మిత్రపక్షమైన పీఎంకే ఎంపీ, కేంద్ర మాజీ మంత్రి అన్బుమణి రాందాస్ ఒక్కరికే ఆహ్వానం అందిందని తెలిపారు. ఇక, రాష్ట్రం నుంచి బీజేపీ తరపున ఎన్నికైన ఏకైక ఎంపీ, కేంద్ర మంత్రి పొన్ రాధాకృష్ణన్ కూడా ఈ విందుకు హాజరవుతారు. కాగా, విజయ్ కాంత్ డీఎండీకే, వైగో ఎండీఎంకే సార్వత్రిక ఎన్నికల్లో ఒక్క సీటు కూడా సాధించలేకపోయారు. దీంతో గెలిచే గుర్రాలకే విలువ ఉంటుందని, అందుకే మోడీ కేవలం గెలిచిన వారిన మాత్రమే తన విందుకు ఆహ్వానించారని కూడా వార్తలు వినబడుతున్నాయి.

జి.మనోహర్

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : BJP's allies  Tamil Nadu  DMDK  MDMK  Vijayakanth  Vaiko  invitees  Prime Minister  Narendra Modi  dinner  NDA partners  October 26.  

Other Articles